Year Ender Cyberabad Crime Review : సైబరాబాద్ పరిధిలో తగ్గిన నేరాలు - అసలు సవాల్ విసిరింది ఆ నేరాలే !
సైబరాబాద్‌లో ఈ ఏడాది క్రైమ్ డీటైల్స్ ను కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. ఓవరాల్‌గా నేరాలు తగ్గాయన్నారు.
Cyberabad Crime Review : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది క్రైమ్ రేట్ పన్నెండు శాతానికిపైగా తగ్గింది. 2022 ముగింపు సందర్భంగా సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నేరాల తీరును వివరించారు. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది 12 % క్రైమ్ రేట్ తగ్గిందని.. సైబరాబాద్ లో జరిగిన సంచలన సంఘటన ల్లో 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశామమని ప్రకటించారు. సైబరాబాద్ లో గత ఏడాది 30954 కేసులు నమోదు అవ్వగా, ఈఏడాది 27322 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో మహిళ పై వేధింపులు 2021 లో 2363 కేసులు నమోదు అవ్వగా 2022 లో 2166 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అంటే తగ్గుదల నమోదయింది.
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు 2021లో 197 నమోదయ్యాయి. ఈ ఏడాది ఇంకా తగ్గిపోయాయి. 158 కేసులు నమోదు అయినట్లుగా సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. సైబరాబాద్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు 3228 , రాబరీలు 51 , దొంగతనాలు 584 , హత్యలు - 93 , కిడ్నాప్ లు - 232 , రేప్ లు - 316, ఛీటింగ్స్ - 6276 , హత్యాయత్నలు - 114 , మిస్సింగ్ కేసులు -3798, ఫైర్ ఆక్సిడెంట్స్ - 60 నమోదయ్యాయి. సైబరాబాద్ డయల్ హండ్రెడ్ కు ఈ ఏడాది 2 లక్షల 36 వేల 417 వచ్చాయని.. గతేడాదితో పోలిస్తే 49 శాతం కాల్స్ పెరిగాయని కమషనర్ తెలిపారు.
ఈ ఏడాది శంషాబాద్ పరిధిలో 27 వేల 322 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని తెలిపారు. ఈ ఏడాది 57175 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది 93 హత్య కేసులు నమోదయ్యాయి. 316 లైంగిక దాడి కేసులు, ఏడాది మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి 2166 కేసులు నమోదయ్యాయని కమిషనర్ తెలిపారు. ఈ ఏడాది 15 వరకు వరకట్నం హత్య కేసులు నమోదుకాగా, 1096 వరకట్నపు వేధింపులు నమోదయ్యాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే మహిళలపై నేరాల సంఖ్య ఎనిమిది శాతం తగ్గిందని గుర్తు చేశారు. మొక్కంహా ఈ ఏడాది 27322 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు అయ్యాయని కమిషనర్ వివరించారు.
సైబరాబాద్ పరిధిలో మొత్తం ఈ ఈ ఏడాది మొత్తం 79 మందిపై పీ డీ యాక్ట్ నమోదు చేసామన్నారు. 57175 డ్రంకన్ డ్రైవింగ్ కేసులు నమోదు అయ్యాయి..13 మంది పై రౌడీషీట్ లు తెరవడం తో పాటు...849 మంది పై సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసామమనితెలిపారు. గత ఏడాది తో పోలిస్తే... రోడ్డు ప్రమాదాల కేసులు 19.8 శాతం తగ్గాయన్నారు. ఈ ఏడాది నాలుగు మాత్రమే నిజమైన అత్యాచారాలు కేసులు నమోదు అయ్యాయి...మిగిలిన 316 అత్యాచారం కేసులలో అన్నీ...పెళ్లి చేసుకోకుండా మోసం చేయడం లాంటివి ఎక్కువగా ఉన్నాయన్నారు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర .