Crime News: హిందూపురం, నార్సింగిలో టెన్షన్ టెన్షన్- రోడ్డు వివాదంతో రెండు వర్గాలు కుమ్ములాట
Crime News: రోడ్లు వివాదం రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టింది. దీంతో పోలీసులు, ప్రజలు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Crime News: రంగారెడ్డి జిల్లా(Rangareddy ) నార్సింగి(Narsingi)లోని జన్వాడా(janwada) రోడ్డు వివాదం రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టింది. మాటామాట పెరగడంతో రెండు వర్గాలు కొట్టుకున్నాయి. ఓ వర్గానికి చెందిన ప్రార్థననా మందిరంపై మరో గ్రూప్ దాడి చేసింది. మందిరంపై రాళ్లు రువ్వారు దుండగులు. ఆ దాడిలో ప్రార్థమందిరం తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. ముగ్గురని దుండగులు చితకబాదారు. వారు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రార్థనా మందిరంపై దాడి చేసిన దుండగులు లోనికి చొరబడి దొరికిన వారిని చితకబాదారు. కర్రలతో, రాళ్లతో దాడికి తెగబడ్డారు. అడ్డు వచ్చిన మహిళలపై కూడా దాడి చేశారు. కులం పేరుతో దూషించడంతోపాటు నోటికి వచ్చిన బూతులు తిడుతూ చితిక్కొట్టారు.
ఈ దాడి ఒక్కసారిగా ఆప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. జనాలు ఏం జరుగుతుందో తెలియ కంగారు పడ్డారు. రోడ్డు విషయంలో చెలరేగిన వివాదం ఇలా మారడంతో ఎవరికి వాళ్లు ఇళ్లల్లోనే ఉండిపోయారు. విషయం తెలుసుకున్న మోకిలా, నార్సింగి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆ ప్రాంతంలో ఆందోళన చేస్తున్న వారిపై లాఠీఛార్జ్ చేశారు. వారందర్ని అక్కడి నుంచి పంపేశారు.
రెండు వర్గాలతో మాట్లాడి ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటిది రిపీట్ అయితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గాయపడిన వారిని హుటాహుటిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రార్థన మందిరంపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. దీనిలో ఏమైనా కుట్ర ఉందా అన్న యాంగిల్‌లో కూడా విచారిస్తున్నారు. అసలు ఈ దాడికి కారణమైన వారిని వెతికే పనిలో ఉన్నారు.
గాయపడిన వర్గం మాత్రం ఓ సంస్థ పేరు చెబుతోంది. పోలీసులు, జనం చూస్తుండగానే కావాలనే తమపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. వద్దని చెబుతున్నా కర్రలు, రాళ్లతో విరుచుకపడ్డారని చెబుతున్నారు. అణగారిన వర్గాలమనే తమపై దాడి చేసి కులం పేరుతో దూషించారని వాపోతున్నారు. దీనికి నిరసనగా మోకిలా పోలీస్ స్టేషన్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని వారిని అక్కడి నుంచి పంపేశారు.
ఇలాంటి ఘటనే హిందూపురంలో కూడా జరిగింది. ఆర్‌పి జి టి రోడ్డుకు ఈద్గా రోడ్డు అని నామకరణం చేయాలని మున్సిపల్ కౌన్సిల్ మీట్‌లో పెట్టారు. దీన్ని ఓ వర్గం వ్యతిరేకించింది. బ్రిటిష్ కాలం నుంచే ఆర్ పి జి టి రోడ్డుగా పిలుస్తున్నామని ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించాయి ఆ సంఘాలు.
ఆర్పీజీటీ రోడ్డు పేరు మార్చాలన్న నిర్ణయంపై అభ్యంతరం చెబుతూ మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు ప్లాన్ చేశారు నేతలు. హిందూపురంలో భారీ ర్యాలీగా కమిషనర్ కార్యాలయానికి వెళ్లేందుకు ట్రై చేశారు. ఈ ర్యాలిపై ప్రత్యర్థి వర్గం దాడి చేసినట్టు చెబుతున్నారు. రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో సంఘ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రజాస్వామ్యబద్ధంగా డిమాండ్ చెప్పేందుకు వెళ్తుంటే ర్యాలీపై దాడి చేయడం ఏంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. తీవ్రంగా మండిపడుతున్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని హిందూపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా చేపట్టారు. దాడి జరుగుతుందని ఇంటెలిజెన్స్ విభాగానికి తెలిసినప్పటికీ పోలీసు బందోబస్తు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బందోబస్తు ఇచ్చి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదన్నారు.