Hyderabad Cable Bridge: దుర్గం చెరువు వద్ద కలకలం, కేబుల్ బ్రిడ్జి పై నుండి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
Durgam Cheruvu Cable Bridge: హైదరాబాద్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి కేబుల్ బ్రిడ్జి నుంచి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
Durgam Cheruvu Cable Bridge: హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద విషాదం చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి కేబుల్ బ్రిడ్జి నుంచి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. టూరిస్ట్ స్పాట్‌గా ఉన్న దుర్గం చెరువు వద్ద టెన్షన్ నెలకొంది. శనివారం ఓ వ్యక్తి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేయగా.. లేక్ పోలీసులు రంగంలోకి దిగారు. రెస్క్యూ టీమ్ తో కలిస లేక్ పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
DRF స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శౌకత్ ఈ ఘటనపై స్పందించారు. శనివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు గుర్తు తెలియని వ్యక్తి కేబుల్ బ్రిడ్జి పైనుంచి దుర్గం చెరువులోకి దూకేశాడు. DRF సిబ్బంది ఆ వ్యక్తి డెడ్ బాడీ కోసం గాలిస్తున్నారు. రెండున్నర గంటల సమయంలో DRF కంట్రోల్ రూమ్ కి సమాచారం అందినట్లు తెలిపారు. మృతుడి వయసు 30 నుండి 35 సంవత్సరాలు ఉంటుంది.
రెండు DRF టీమ్స్, రెండు బోట్స్ 12 మంది సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మృత దేహం కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. ఎంత త్వరగా వీలు అయితే అంత త్వరగా బాడీని వెలికి తీస్తామని DRF స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శౌకత్ చెప్పారు. ఇందులో ఆత్మహత్య చేసుకున్న వారిలో ఇప్పటి వరకు దుర్గం చెరువో నాలుగైదు డెడ్ బాడీలు వెలికి తీశామని తెలిపారు.
సెర్చ్ ఆపరేషన్ లో లభ్యం కాకపోతే, డెడ్ బాడీ 12 నుంచి 16 గంటల తరువాత నీటిపైకి తేలే అవకాశం ఉంటుంది. పాతాళ గడియ అనే పరికరం ద్వారా డెడ్ బాడీని గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. చెరువులో బోట్ స్పీడ్ గా రొటేట్ చేయడం ద్వారా బాడీ పైకి తేలే అవకాశం ఉందని ఆ అధికారి వివరించారు.
ఇన్ స్టా రీల్స్ చేస్తూ, రైలు ఢీకొని విద్యార్థి మృతి
హైదరాబాద్ నగరంలోని రహమత్ నగర్‌కు చెందిన మదర్సా విద్యార్థి మహ్మద్ సర్ఫరాజ్(16) రీల్స్ చేద్దామని భావించాడు. తన స్నేహితులతో కలిసి సనత్ నగర్‌లోని రైల్వే లైన్ వద్దకు వెళ్లాడు. ఆపై ఫ్రెండ్ కు ఫోన్ ఇవ్వగా అతడు ఇన్ స్టా రీల్స్ కోసం వీడియోలు తీస్తున్నాడు. అయితే రీల్స్ సరదా ప్రాణం తీస్తుందని ఆ బాలురు అనుకోలేదు. రైల్వే ట్రాక్ పక్కన సర్ఫరాజ్ నిల్చోగా మరో ఫ్రెండ్ వీడివయో తీస్తున్నాడు. కానీ వెనుక నుంచి వస్తున్న రైలును సర్ఫరాజ్ గమనించలేదు. అతడి ఫ్రెండ్ కూడా అలర్ట్ చేయలేదు. ఈ క్రమంలో రీల్స్ చేస్తున్న సర్ఫరాజ్ ను వెనుక నుంచి రైలు ఢీకొట్టింది. దీంతో సర్ఫరాజ్ విద్యార్థి సర్ఫరాజ్ మృతి చెందాడు. అకస్మాత్తుగా జరిగిన ఘటనతో అతడితో పాటు రీల్స్ చేయడానికి వెళ్లిన ఇద్దరు ఫ్రెండ్స్ భయాందోళనకు గురై అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సనత్ నగర్ రైల్వే స్టేషన్ లైన్ వద్దకు చేరుకుని విద్యార్థి సర్ఫరాజ్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు చనిపోయిన విద్యార్థి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో చెక్ చేయగా సర్ఫరాజ్ వెరైటీగా రీల్స్ చేస్తున్నాడని గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.