అమెజాన్ మేనేజర్ దారుణ హత్య, బైక్‌పై వెళ్తుండగా కాల్చి చంపిన దుండగులు
Amazon Manager Dies: ఢిల్లీలో అమెజాన్ కంపెనీలో పని చేస్తున్న మేనేజర్‌ని ఐదుగురు దుండగులు కాల్చి చంపారు.
Amazon Manager Dies:
ఢిల్లీలో హత్య..
ఢిల్లీలో దారుణం జరిగింది. అమెజాన్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపారు దుండగులు. ఫ్రెండ్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా హర్‌ప్రీత్ గిల్‌పై ఐదుగురు కాల్పులు జరిపారు. ఆగస్టు 29 అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరినీ ఐదుగురు దుండగులు అడ్డుకున్నారు. వెంటనే కాల్పులు జరిపారు. ఓ బులెట్ నేరుగా హర్‌ప్రీత్ తలలోకి దూసుకుపోవడం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అతని స్నేహితుడికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో నిందితులందరూ పరారీలో ఉన్నారు. ఈ ఘటన జరిగిన చోట సీసీ కెమెరాల్లోని ఫుటేజ్‌ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి ఆచూకీ దొరకలేదు. త్వరలోనే నిందితులందరినీ పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కాల్పులకు కారణమేంటన్నదీ ఇంకా తెలియాల్సి ఉంది. అన్ని కోణాల్లోనూ విచారించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
రెస్టారెంట్‌లో కాల్పులు..
బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని ఇటీవల ఓ రెస్టారెంట్‌లో కొందరు ఆగంతకులు ఉన్నట్టుండి కాల్పులు జరపడం స్థానికలం అలజడి సృష్టించింది. రెస్టారెంట్‌లో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బులెట్ గాయాలు తగలకుండా మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. ఈ కాల్పులకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బేగుసరై జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఓ రిటైర్డ్ టీచర్‌ని దుండగులు కాల్చి చంపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దాదాపు 10 రౌండ్ల కాల్పులు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే...ఇది కేవలం ప్రజల్ని భయాందోళనలకు గురి చేయడానికి జరిపిన కాల్పులే అని చెబుతున్నారు. కావాలనే ఓ వ్యక్తిని టార్గెట్‌గా చేసుకుని కాల్పులు జరపలేదని ప్రాథమిక విచారణలో తేలినట్టు వివరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి.
#WATCH | Miscreants open fire at a restaurant in Bihar's Muzaffarpur
— ANI (@ANI) August 20, 2023
(CCTV Visuals) pic.twitter.com/8VF9dOB5iv
"దాదాపు 10 రౌండ్ల కాల్పులు జరిగాయి. ప్రాథమిక విచారణ చేపట్టాం. ఇది కేవలం ప్రజల్ని భయపెట్టడానికి జరిపిన కాల్పులే అని అర్థమవుతోంది. కావాలనే ఎవరినీ టార్గెట్ చేయలేదు. కాకపోతే కాల్పుల్లో ఓ రిటైర్డ్ టీచర్ చనిపోయారు. మొత్తం నలుగురు వ్యక్తులు ఈ కాల్పులు జరిపినట్టు సమాచారం అందింది. నిందితులందరినీ త్వరలోనే అదుపులోకి తీసుకుంటాం"
- పోలీసులు
#WATCH | "...At least 10 rounds of firing happened here...prima facie it appears to be a firing to scare people...this was not a firing targeting anybody...we have got information on 4 people who're involved, efforts to arrest the all the accused underway...": Arvind Pratap… pic.twitter.com/XteuDvGJ7s
— ANI (@ANI) August 20, 2023
Also Read: G-20 సదస్సుకి ముస్తాబవుతున్న ఢిల్లీ, మూడు రోజుల పాటు హై సెక్యూరిటీ - ఉద్యోగులకు పెయిడ్ హాలీడేస్