అన్వేషించండి
AP Crime News: విహారయాత్రలో విషాదం, వాగులో దిగిన ముగ్గురు విద్యార్థులు మృతి
Alluri District Crime News: అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో విహారయాత్రకి వెళ్ళిన వారిలో ముగ్గురు మృతి చెందడంతో విషాదం నెలకొంది.
Alluri District News: అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రకి వెళ్ళిన వారిలో ముగ్గురు మృతి చెందడంతో విషాదం నెలకొంది. రంపచోడవరం మండలం ఐ.పోలవరం గ్రామంలోని సీతపల్లి వాగులో విహారయాత్రకు వచ్చిన ఐదుగురిలో ముగ్గురు గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టగా, ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరు గోకవరం మండలం రంప ఎర్రంపాలెం గ్రామానికి చెందిన కాకర అర్జున్(15), అంది బోయిన దేవి చరణ్(15), లావేటి రాంజీ (15) 10 తరగతి విద్యార్థులుగా గుర్తించారు. వీరి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి పంచనామా నిమిత్తము రంపచోడవరం ఆసుపత్రికి తరలిస్తామని పోలీసులు తెలిపారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion