Crime News: ఏపీలో దారుణం, కత్తితో బెదిరించి రైలులో మహిళపై అత్యాచారం
Woman Molested in Running Train | ఏపీలో దారుణం జరిగింది. రైలు బోగీలో మహిళ ఒంటరిగా ఉందని గమనించిన ఓ వ్యక్తి కత్తితో బెదిరించి రన్నింగ్ రైలులో మహిళపై అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది.

Woman Abused in Train | అమరావతి: ఏపీలో రన్నింగ్ ట్రైన్ లో దారుణం జరిగింది. గుంటూరు నుంచి పెదకూరపాడు మధ్య రైల్లో ప్రయాణిస్తున్న మహిళపై అత్యాచారం జరిగింది. రన్నింగ్ ట్రైన్లో బోగిలోకి ఎక్కిన వ్యక్తి కామాంధుడిగా మారి మహిళపై అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..
ఓ మహిళ రాజమహేంద్రవరంలో సంత్రగచి ప్రత్యేక రైలు ఎక్కింది. గుంటూరుకు చేరుకునే సమయానికి ఆమె ప్రయాణిస్తున్న బోగీ పూర్తిగా ఖాళీ అయింది. తోటి ప్రయాణికులు దిగిపోయిన ఈ సమయంలో ఓ 40ఏళ్ల వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి రన్నింగ్ ట్రైన్‌లో మహిళ ఉన్న బోగీలోకి ఎక్కాడు. మహళ ఒంటరిగా ఉందని గమనించి వెంటనే తన బుద్ధి చూపించాడు. ఒంటరిగా ఉన్న మహిళను కత్తితో బెదిరించి హ్యాండ్‌బ్యాగ్, సెల్‌ఫోన్, డబ్బులు లాక్కొన్నాడు. అంతటితో ఆగకుండా కామాంధుడిగా మారి రన్నింగ్ ట్రైన్లోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
తరువాత పెదకూరపాడు స్టేషన్ వద్ద రైలు ఆగగానే, దిగి పరారయ్యాడు. బాధిత మహిళ చర్లపల్లికి రాగానే నేరుగా సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను సంప్రదించింది. రైలులో తనపై జరిగిన అఘాయిత్యంపై వారికి ఫిర్యాదు చేసింది. రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. పెదకూరపాడు స్టేషన్ వద్ద సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.






















