అన్వేషించండి

Sand Dead Body: షాకింగ్ ఘటన - ఇంటి నిర్మాణానికి తెచ్చిన ఇసుకలో తల లేని మృతదేహం, ఎక్కడంటే?

Andhrapradesh News: ఇంటి నిర్మాణం కోసం తెచ్చిన ఇసుకలో తల లేని మృతదేహం కలకలం రేపింది. బాపట్ల జిల్లా చీరాల మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది.

Dead Body Found In Sand in Bapatla District: ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం ఇసుక ఆర్డర్ ఇచ్చాడు. వచ్చిన ఇసుకను వినియోగిస్తుండగా ఓ తల లేని మృతదేహాన్ని గుర్తించిన కూలీలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విషయాన్ని యజమానికి తెలియజేయగా ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ షాకింగ్ ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల (Bapatla) జిల్లా చీరాల (Cheerala) మండలం ఈపురుపాలెం గ్రామంలోని పద్మనాభునిపేటకు కాగితాల రాంబాబు అనే వ్యక్తి కొత్త ఇంటి నిర్మాణానికి పూనుకున్నాడు. ఇందులో భాగంగా ఓ 10 ట్రాక్టర్ల ఇసుక ఆర్డర్ ఇచ్చాడు. శుక్రవారం సాయంత్రం ఇసుకను ఇంటి ముందు పోశారు. కూలీలు ఇసుకను ఇంటి పునాదుల్లో క్రేన్ తో ఇసుక నింపుతుండగా.. ఓ తల లేని మృతదేహాన్ని గుర్తించారు. దీంతో ఒక్కసారిగా ఆందోళన చెంది యజమానికి విషయాన్ని తెలియజేశారు. ఆయన షాక్ తో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది. రోజు రోజుకూ ఇసుక మాఫియా రెచ్చిపోతుందని పలువురు ఆరోపిస్తున్నారు. అటు, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇసుకలో లభ్యమైన మృతదేహం 2 రోజుల క్రితం పూడ్చి పెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. జేసీబీతో ఇసుక తవ్వే క్రమంలో తల ఊడిపోయి ఉంటుందని.. అందుకే మొండెం మాత్రమే మిగిలిందని అనుమానిస్తున్నారు. మృతదేహం ఎవరిది..?. ఇసుకలోకి ఎలా వచ్చింది.? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: YS Sharmila: ఓవైపు వైఎస్ బిడ్డ, మరోవైపు హంతకుడు, మీరే తేల్చండి - ఆడబిడ్డలం కొంగుచాస్తున్నాం: షర్మిల

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth on Kishan Reddy:  కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం - మరోసారి రేవంత్ ఆగ్రహం
కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం - మరోసారి రేవంత్ ఆగ్రహం
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
Andhra Pradesh Budget 2025: అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
Kiara Advani Pregnant: తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pastor Ajay Babu Exclusive Interview | చర్చిల విషయంలో ప్రభుత్వానికి పాస్టర్ అజయ్ సంచలన ప్రతిపాదన | ABP DesamAfg vs Eng Match Highlights | Champions Trophy 2025 | ఐసీసీ టోర్నీల్లో పనికూనల ఫేవరెట్ ఇంగ్లండ్ | ABP DesamAFG vs ENG Match Highlights | Champions Trophy 2025 లో పెను సంచలనం | ABP DesamGV Harsha Kumar on MLC Election | ఎమ్మెల్సీ ఎన్నికల తీరుపై హర్ష కుమార్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth on Kishan Reddy:  కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం - మరోసారి రేవంత్ ఆగ్రహం
కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం - మరోసారి రేవంత్ ఆగ్రహం
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
Andhra Pradesh Budget 2025: అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
Kiara Advani Pregnant: తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
EPF Interest Rate: 7 కోట్ల మందికి నిరాశ - 2024-25 ఆర్థిక సంవత్సరానికి EPF వడ్డీ రేటు ఎంతంటే?
7 కోట్ల మందికి నిరాశ - 2024-25 ఆర్థిక సంవత్సరానికి EPF వడ్డీ రేటు ఎంతంటే?
Uttarakhand : బద్రీనాథ్‌లో విరిగిపడిన మంచు చరియలు - రిస్క్‌లో 47 మంది ప్రాణాలు
బద్రీనాథ్‌లో విరిగిపడిన మంచు చరియలు - రిస్క్‌లో 47 మంది ప్రాణాలు
Andhra Pradesh Budget 2025 Highlights: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ - కూటమి సర్కార్ వార్షిక బడ్జెట్ హైలైట్స్ ఇవే 
రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ - కూటమి సర్కార్ వార్షిక బడ్జెట్ హైలైట్స్ ఇవే 
Meenakshi Natarajan: మీనాక్షి నాటరాజన్ పై తెలంగాణ కాంగ్రెస్ కోటి ఆశలు! చేయిదాటిన నేతలను దారిలోకి తెస్తారా ?
మీనాక్షి నాటరాజన్ పై తెలంగాణ కాంగ్రెస్ కోటి ఆశలు! చేయిదాటిన నేతలను దారిలోకి తెస్తారా ?
Embed widget