Johnson & Johnson Split: రెండుగా విడిపోతున్న జాన్సన్ అండ్ జాన్సన్.. ఎందుకో తెలుసా?
తమ వ్యాపారాలను సమర్థంగా నిర్వహించేందుకు కంపెనీలను సరికొత్త బాటలో పయనిస్తున్నాయి. వ్యాపారాలను విభజిస్తున్నాయి. తాజాగా జాన్సన్ అండ్ జాన్సన్ విభజన ప్రణాళికలు ప్రకటించింది.
హెల్త్‌కేర్ దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్‌ను రెండుగా విభజించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ఆ కంపెనీ తెలిపింది. ఔషధ, కన్జూమర్ హెల్త్ విభాగాలను విడదీస్తామని సీఈవో అలెక్స్ గోర్స్‌కీ చెప్పినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. బ్యాండ్ ఎయిడ్లు, బేబీ పౌడర్ వంటివి కన్జూమర్ విభాగంలో ఉండగా కొవిడ్ టీకాలు, డ్రగ్స్ వంటివి ఔషధ విభాగంలో ఉన్నాయి.
కన్జూమర్ హెల్త్ వ్యాపారం కొత్త పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీగా అవతరించనుందని రాయిటర్స్ తెలిపింది. రానున్న 18 నుంచి 24 నెలల్లో విభజనను పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకొంది. డార్జాలెక్స్ (క్యాన్సర్‌కు ఉపయోగిస్తారు) వంటి డ్రగ్స్‌ను విక్రయించే మెడికల్ డివైజు యూనిట్లు, ఫార్మా సూటికల్స్‌ను రీటెయిన్ చేసుకుంటామని కంపెనీ తెలిపింది. ఈ యూనిట్ల ద్వారా 2021లో 77 బిలియన్ డాలర్ల మేర ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
'కొత్త జాన్సన్ అండ్ జాన్సన్, కన్జూమర్ హెల్త్‌కేర్ కంపెనీల్లో ద్వారా రోగులు, కస్టమర్లకు సమర్థంగా వనరులను కేటాయించొచ్చు. వృద్ధికి ఊతం వస్తుంది. ఫలితంగా కంపెనీల విలువ మరింత పెరుగుతుంది' అని జే అండ్ జేకు కాబోయే సీఈవో జోక్విన్ డ్వాటో అన్నారు.
2019లో, జే అండ్ జే ప్రధాన పోటీదారు ఫైజర్ తన కన్జూమర్ హెల్త్ యూనిట్‌ను గ్లాక్సోస్మిత్‌కెలైన్‌తో కలిసి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే అమెరికాలోని దిగ్గజ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ సైతం విభజన ప్రణాళికలను ప్రకటించింది. వ్యాపారాన్ని సరళీకరించేందుకు మూడుగా విభజించనుంది. జపాన్ కంపెనీ తోషిబా కార్పొరేషన్ మూడు స్వత్రంత విభాగాలుగా విడిపోయేందుకు ప్రణాళికలు వేస్తున్నామని తెలిపింది.
Also Read: Cryptocurrency Prices Today: రూ.36వేలు తగ్గిన బిట్‌కాయిన్.. మిగతావీ నష్టాల బాటలోనే..!
Also Read: Paytm IPO: పేటీఎం ఐపీవోతో కోటీశ్వరులు అవుతున్న 350+ ఉద్యోగులు.. సంతోషంలో ఉబ్బితబ్బిబ్బు!
Also Read: EPFO Update: ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు శుభవార్త! మరణ పరిహారం రెట్టింపు చేసిన కేంద్రం.. ఎంత వస్తుందంటే?
Also Read: RBI on Cryptocurrency: క్రిప్టోపై ఆర్‌బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..! ప్రభుత్వానికి ఫీడ్‌బ్యాక్
Also Read: Zomato Update: జొమాటో సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ వ్యాపారాలన్నీ క్లోజ్.. ఎందుకంటే?
Also Read: Credit Score: క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలో తెలియదా? ఇలా చేస్తే సులభంగా పెంచుకోవచ్చు..!