అన్వేషించండి

Upcoming 7 Seater Electric SUVs India: భారత్ మార్కెట్‌లోకి దూసుకొస్తున్న టాప్‌ 7 సీట్ల ఎస్‌యూవీ ఈవీలు!పెద్ద ఫ్యామిలీలే టార్గెట్‌తో రాబోతున్న కార్లు! 

ఈవీలు, మధ్యతరగతి పెద్ద ఫ్యామీల కాంబినేషన్‌తో కొత్త ఎస్‌యూవీలు మార్కెట్‌లోకి సునామీ సృష్టించేందుకు వస్తున్నాయి. ఫీచర్స్‌, రేంజ్, ధరల గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారీ కుటుంబాల కోసం 7-సీటర్ ఎలక్ట్రిక్ SUVలు మార్కెట్లోకి వస్తున్నాయి.
  • కొత్త టాటా సఫారీ EV, మారుతి YMC MPV ఈ జాబితాలో ఉన్నాయి.
  • ఈ వాహనాలు 600 కి.మీ. రేంజ్, ADAS, పనోరమిక్ సన్‌రూఫ్ అందిస్తున్నాయి.
  • విన్‌ఫాస్ట్ VF 7 MPV కూడా 517 కి.మీ. రేంజ్‌తో రానుంది.

Upcoming 7 Seater Electric SUVs India: భారత్ మార్కెట్‌లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈవీలు కొనేందుకు మొగ్గు చూపుతున్న ప్రయాణికులు ఇప్పుడు భారీ వాహనాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈవీ అంటేనే ఒక చిన్న ఫ్యామీలీ కారు నుంచి భారీ ఫ్యామిలీల కోసం కూడా ఈవీలను కొనాలనే ఆలోచన మారుతోంది. దీన్ని గమనించిన తయారీదారులు విలాసవంతమైన కార్లను బడ్జెట్‌లోనే తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. మిడ్‌సైజ్ ఎస్‌యూవీ విభాగంలో మాదిరిగానే ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ వాహనాల విభాగంలో కూడా ఈవీల హవా పెరగబోతోంది. 

600 కిలోమీటర్లకు పైగా రేంజ్‌, అడ్వాన్స్‌డ్‌ ఏడీఏఎస్‌, పనోరమిక్‌ సన్‌రూఫ్‌ వంటి ఫీచర్లతో రాబోతున్న ఈ వాహనాల గురించి, ఫీచర్స్, ధరలు ఇతర వివరాలు గురించి తెలుసుకోండి. 

టాటా సఫారీ ఈవీ 

టాటా మోటార్స్‌ ఇప్పటికే హారియర్‌ ఈవీపై కసరత్తు పూర్తి చేసి, ఇప్పుడు తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ సఫారీని ఎలక్ట్రిక్ రూపంలోకి మారుస్తోంది. సాధారణం సఫారీ డిజైన్‌నే ఇది కొనసాగించినప్పటికీ, ఎలక్ట్రిక్ వాహనానికి తగ్గట్టుగా కొన్ని మార్పులు ఉండనున్నాయి. క్లోజ్డ్‌ ఫ్రంట్‌ గ్రిల్‌, గాలిని చీల్చుకుంటూ వెళ్లే ఏరోడైనమిక్‌ వీల్స్‌, కొత్తగా డిజైన్ చేసిన ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంప్స్‌ దీనికి కొత్త రూపాన్ని ఇస్తాయి. 

Also Read: అనుకూల బడ్జెట్‌, ఆకట్టుకునే మైలేజ్‌! భారత మార్కెట్‌లో దుమ్మురేపుతున్న టాప్‌ 125 సీసీ స్కూటర్లు ఇవే!

ఇందులో రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. 65kWhబ్యాటరీతో సుమారు 538 కిలోమీటర్ల రేంజ్, 75kWh బ్యాటరీతో కంగా 622 నుంచి 627 కిలోమీటర్ల వరకు రేంజ్‌ లభించవచ్చని అంచనా  ఉంది. ఎక్కువ వేరియంట్లలో ఆల్‌ వీల్ డ్రైవ్‌ సదుపాయం కూడా ఉంటుంది. ఇది ఆఫ్‌ రోడింగ్ ప్రియులను ఆకట్టుకోనుంది. దసరా నాటికి ఇది మార్కెట్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. 

Also Read: హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా vs విడా VX2గో: లక్ష లోపు బడ్జెట్‌లో బెస్ట్ ఈవీ ఏది? ధర ఫీచర్లు, పెర్ఫార్మెన్స్‌ గురించి తెలుసుకోండి!

మారుతి సుజుకి YMC

దేశంలోనే నవంబర్ వన్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, తన మొట్టమొదటి  సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీని సిద్ధం చేస్తోంది. దీనికి అంతర్గత YMC అనే కోడ్ పేరు పెట్టారు. ఇటీవల మార్కెట్‌లోకి వచ్చిన ఇ విటారా ప్లాట్‌ఫామ్‌పైనే ఈ ఎంపీవీ రూపొందుతోంది. ఇది 2026 చివరి నాటికి విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్, విశాలమైన క్యాబిన్, మధ్య వరుసలో కెప్టెన్‌సీట్లు, 360 డిగ్రీ కెమెరా, లెవల్‌ 2 అడాస్‌ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉంటాయి. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, వెంటిలేటెడ్‌ సీట్లు, పనోరమిక్ గ్లాస్‌ రూఫ్‌ దీనికి అదనపు ఆకర్షణ. 

Also Read: కొత్త SUV కొనడం కంటే, ఈ 5 పాత సెడాన్‌లు తీసుకోవడం బెటర్.. అందుకు కారణాలివే

టాటా మోటార్స్ అవీన్యా ఎక్స్‌

టాటా తన ప్రీమియం ఈవీ నెట్‌వర్క్‌ కింద అవిన్యూ ఎక్స్‌ను తీసుకురాబోతోంది. గతంలో ఆటో ఎక్స్‌పోలో కాన్సెప్ట్‌ రూపంలో చూపించిన ఈ వాహనం, ఇప్పుడు ప్రొడక్షన్ దశకు చేరుకుంటోంది. ఇది 5,6, 7 సీట్‌ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులోకి రానుంది. సుమారు ఐదు మీటర్ల పొడవు ఉండే ఈ క్రాస్ ఓవర్‌, టాటా ప్రస్తుత కార్ల కంటే ఎంత ఆడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో వస్తోంది. 

Also Read: టీవీఎస్ జూపిటర్ 125 నుంచి అదిరిపోయే అప్‌డేట్‌! ఆకట్టుకునే ఫీచర్స్‌తోపాటు కలర్‌ఫుల్ రంగుల్లో మార్కెట్‌లోకి...

విన్‌ఫాస్ట్ వీఎఫ్‌ ఎంపీవీ 7

వియత్నాంకు చెందిన ఈవీ కంపెనీ విన్‌ఫాస్ట్‌ కూడా భారత మార్కెట్‌లోకి అడుగు పెడుతోంది. తన మొదటి 7 సీటర్‌ ఎంపీవీగా వీఎఫ్‌ ఎంపీవీ 7ను ప్రవేశపెట్టనుంది. ఇందులో 60.13kWh బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. ఇది సుమారు 517 కిలోమీటర్ల రేంజ్‌ను ఇవ్వగలదు. పరిమిత రంగుల్లో వచ్చినా, రైడ్‌ హైలింగ్ సర్వీస్‌ల కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. 

Also Read: టాటా టియాగో సీఎన్‌జీలో సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్ - ప్యాడల్ షిఫ్టర్లతో రాబోతున్న సరికొత్త 2026 ఫేస్‌లిఫ్ట్ మోడల్

చాలా మంది పర్యటనకు వెళ్లేటప్పుడు ఎక్కువ మంది ఒకే కారులో వెళ్లాలని కోరుకుంటారు. పెట్రోల్ ధరలు పెరుగుతున్న వేళ వినియోగదారుల ఆలోచన సరళి కూడా మారుతోంది. అందుకే 7 సీటర్ ఈవీలు తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలుగా ఉంటున్నాయి. ఇప్పుడు వస్తున్న కొత్త తరం ఈవీలు కేవలం ఇంజిన్ మార్పుతోనే కాకుండా రేంజ్‌ కూడా పెరుగుతోంది. ఇప్పుడు వస్తున్న వాటిలో 600 కిలోమీటర్ల రేంజ్ కలిగిన వాహనాలు ఉన్నాయి. అంతే కాకుండా లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కూడా తగ్గేదేలే అన్నట్టు ప్రత్యర్థులతో పోటీ పడుతున్నాయి. 

భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా పెద్ద కుటుంబాల కోసం వస్తున్న ఈ 7 సీటర్ ఎస్‌యూవీలు భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని మరో మెట్టుపైకి తీసుకెళ్లబోతున్నాయి.  

Frequently Asked Questions

భారత మార్కెట్‌లో 7 సీటర్ ఈవీల ప్రాచుర్యం ఎందుకు పెరుగుతోంది?

పెరుగుతున్న పెట్రోల్ ధరలు, ఎక్కువ మంది ఒకేసారి ప్రయాణించాలనే కోరిక వలన 7 సీటర్ ఈవీలకు గిరాకీ పెరుగుతోంది. ఇవి తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలు కల్పిస్తాయి.

రాబోయే 7 సీటర్ ఈవీలలో ఎలాంటి ఫీచర్లు ఆశించవచ్చు?

600 కిలోమీటర్లకు పైగా రేంజ్, అడ్వాన్స్‌డ్‌ ఏడీఏఎస్‌, పనోరమిక్‌ సన్‌రూఫ్‌ వంటి అత్యాధునిక ఫీచర్లతో ఈ వాహనాలు రానున్నాయి.

మారుతి సుజుకి నుండి 7 సీటర్ ఈవీ ఎప్పుడు విడుదల కానుంది?

మారుతి సుజుకి తన మొదటి 7 సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీని 2026 చివరి నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి YMC అనే కోడ్ పేరు పెట్టారు.

టాటా సఫారీ ఈవీ యొక్క అంచనా రేంజ్ ఎంత?

టాటా సఫారీ ఈవీ 65kWh బ్యాటరీతో సుమారు 538 కిలోమీటర్లు, 75kWh బ్యాటరీతో 622 నుంచి 627 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించవచ్చని అంచనా.

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget