అన్వేషించండి

2026 TVS Jupiter 125 Colors: టీవీఎస్ జూపిటర్ 125 నుంచి అదిరిపోయే అప్‌డేట్‌! ఆకట్టుకునే ఫీచర్స్‌తోపాటు కలర్‌ఫుల్ రంగుల్లో మార్కెట్‌లోకి... 

2026 TVS Jupiter 125 Colors:స్మార్ట్ ఫీచర్స్‌, ఆకట్టుకునే హంగులతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న టీవీఎస్ జూపిటర్ 125 ఇప్పుడు మరో అప్‌డేట్‌తో వచ్చింది. ఈసారి ఏకంగా 11 రంగులను అందుబాటులో తీసుకొచ్చింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టీవీఎస్ జూపిటర్ 125 కొత్త ఐవరీ మ్యాట్ కాపర్ బ్రాంజ్, ఎలైట్ గ్రీన్ రంగుల్లో లభ్యం.
  • డీటీఎస్ఎక్స్ఎక్స్సీ వేరియంట్ ట్రై-టోన్ లుక్, లగ్జరీ బ్రౌన్ సీటుతో వస్తుంది.
  • స్మార్ట్ఎక్సోనెక్ట్ వేరియంట్ సింగిల్-టోన్ ఫినిషింగ్, బ్లాక్ సీటుతో స్పోర్టీగా ఉంటుంది.
  • కొత్త రంగులతో పాటు ధరలు రూ. 600-1000 వరకు పెరిగాయి.

2026 TVS Jupiter 125 Colors: మధ్యతరగతి ఫ్యామిలీ వినియోగదారులను ఆకట్టుకుంటున్న టీవీఎస్ జూపిటర్ 125 ఎప్పటికప్పుడు వివిధ విభాగాల్లో అప్‌డేట్ అవుతూ వస్తోంది. ఇప్పుడు మరో కీలకమైన అప్‌డేట్‌తో మరింత మంది వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికి అందుబాటులో ఉన్న కలర్స్‌తోపాటు మరిన్ని కలర్స్‌తో మార్కెట్‌లో మరింత కలర్‌ఫుల్‌గా ముస్తాబైంది. కేవలం రంగులను మార్చడమే కాకుండా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగానే వేరియంట్స్‌లో, ధరల్లో స్వల్ప మార్పులు చేసింది. వాటి గురించి ఇక్కడ చూద్దాం. 

టీవీఎస్‌ మోటార్స్‌ తన పాపులర్‌ స్కూటర్‌ జూపిటర్‌ 125లో రెండు సరికొత్త రంగులను ప్రవేశ పెట్టింది. ఐవరీ మ్యాట్‌ కాపర్ బ్రాంజ్‌, ఐవరీ ఎలైట్ గ్రీన్ అనే రెండు రంగులను ఇప్పుడు మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీంతో ఇప్పుడు మొత్తంగా టీవీఎస్ జూపిటర్‌ 125 11 రంగుల్లో లభిస్తోంది. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన రెండు రంగులు కూడా డీటీ ఎస్‌ఎక్స్‌సీ వేరియంట్స్‌లో అమ్మకానికి ఉంచింది. 

styleim

125 సీసీ ఫ్యామిలీ స్కూటర్స్‌కు మార్కెట్‌లో గట్టి పోటీ ఉంది. వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా సంస్థలు వదులుకోవడం లేదు. అందుకే తమ ప్రొడక్ట్ ట్రెండీగా ఉండాలని, వినియోగదారులను ఆకర్షించాలని కోరుకునే వారంతా ఏదో మార్పుతో మార్కెట్‌లో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే చిన్న చిన్న మార్పులతో మార్కెట్ లీడర్‌గా ఎదగాలని టీవీఎస్ జూపిటర్ 125 చూస్తోంది. అందుకే కలర్‌ కాంబినేషన్‌లో మార్పులు చేసింది. 

img

ఫ్యామిలీ రైడర్స్‌ను టీవీఎస్‌ జూపిటర్‌ టార్గెట్ చేసింది. డీసెంట్‌గా ఉండే రంగులను కొత్తగా పరిచయం చేసింది. ఈ కొత్త రంగులు చూడటానికి కేవలం డ్యూయల్ టోన్ లాగా కాకుండా, ట్రై టోన్‌ ఎఫెక్ట్‌ను ఇస్తున్నాయి. డీటీ ఎస్‌ఎక్స్‌సీ వేరియంట్‌లో బ్రౌన్ కలర్ సీటు, ఫ్లోర్‌ బోర్డ్‌ చుట్టూ లేత బ్రౌన్ షేడ్ ఉండటం వల్ల స్కూటర్‌కు ఒక లగ్జరీ లుక్ వస్తుంది. ఫ్రంట్‌ ఏప్రాన్, సైడ్ ప్యానెల్‌పై ప్రధాన రంగు ఉండగా మిగిలిన చోట్ల ఐవరీ ఫినిషింగ్ ఇచ్చారు. 

img

స్మార్ట్ ఎక్సోనెక్ట్ వేరియంట్‌ సింపుల్‌గా ఉంటోంది. ఈ వేరియంట్‌లో మ్యాట్ కాపర్ బ్రాంజ్‌, ఎలైట్‌ గ్రీన్‌ను సింగిల్‌ టోన్ ఫినిషింగ్‌తో ఇచ్చారు. దీనికి బ్లాక్ సీట్‌, బ్లాక్ ఇన్నర్‌ ప్యానెల్స్ ఉండటం వల్ల కొంచెం స్పోర్టీగా కనిపిస్తుంది. 

రంగుల్లోనే కాదు ధరల్లోనూ మార్పులు 

కొత్త రంగులతోపాటు ధరల్లో కూడా చిన్న చిన్న మార్పులు చేసింది పాత ధరలతో పోలిస్తే 600 నుంచి 1000 రూపాయల వరకు పెరిగాయి. 

వేరియంట్‌ కొత్త ధర పాతధర తేడా 
డ్రమ్‌ అలోయ్‌   రూ. 80,550  రూ. 81,150 రూ. 600 
డిస్క్‌  రూ. 85,750 రూ. 86,350 రూ. 600
డీటీఎస్‌ఎక్స్‌సీ    రూ. 86,750   రూ.89,700    మార్పు లేదు.
స్మార్ట్ఎక్సోనెక్ట్‌    రూ. 89,760  రూ. 90,760 రూ. 1000

 జూపిటర్ 150 కేవలం రంగుల వల్ల మాత్రమే కాకుండా, దాని ప్రాక్టికాలిటీ వల్ల అగ్రస్థానంలో ఉంది. యూజర్‌ల రివ్యూల ప్రకారం సీటు కింద ఇద్దరు వ్యక్తుల హెల్మెట్లు పట్టేంత స్థలం ఉంది. ఇది బాగా నచ్చుతోంది. సీటు దిగకుండా పెట్రోల్ కొట్టించుకునే సదుపాయం కూడా సౌకర్యవంతంగా ఉంది. స్మార్టోనెక్ట్‌ ఫీచర్ ద్వారా నావిగేషన్, కాల్ అలర్ట్స్‌ వంటివి స్కూటర్‌ స్క్రీన్‌పైనే చూసుకోవచ్చు. అడ్జస్టబుల్‌ షాక్ అబ్జర్వర్స్‌ వల్ల గుంతల రోడ్లలో కూడా సాఫీగా వెళ్లిపోవచ్చని చెబుతున్నారు. 

Frequently Asked Questions

2026 TVS Jupiter 125 లో కొత్తగా ఏ రంగులు అందుబాటులోకి వచ్చాయి?

TVS Jupiter 125 లో ఐవరీ మ్యాట్ కాపర్ బ్రాంజ్ మరియు ఐవరీ ఎలైట్ గ్రీన్ అనే రెండు కొత్త రంగులను ప్రవేశపెట్టారు. దీంతో మొత్తం 11 రంగుల్లో ఇప్పుడు అందుబాటులో ఉంది.

ఈ కొత్త రంగులు ఏ వేరియంట్లలో లభిస్తాయి?

కొత్తగా ప్రవేశపెట్టిన ఐవరీ మ్యాట్ కాపర్ బ్రాంజ్, ఐవరీ ఎలైట్ గ్రీన్ రంగులు DTS-i SX వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.

కొత్త రంగులతో పాటు ధరలలో ఏమైనా మార్పులు జరిగాయా?

అవును, కొత్త రంగులతో పాటు ధరలలో కూడా స్వల్ప మార్పులు చేశారు. పాత ధరలతో పోలిస్తే రూ. 600 నుండి రూ. 1000 వరకు ధరలు పెరిగాయి.

TVS Jupiter 125 యొక్క ముఖ్యమైన ఫీచర్లు ఏమిటి?

సీటు కింద ఎక్కువ స్థలం, సీటు దిగకుండా పెట్రోల్ కొట్టించుకునే సౌకర్యం, స్మార్టోనెక్ట్ ఫీచర్ ద్వారా నావిగేషన్, కాల్ అలర్ట్స్, మరియు అడ్జస్టబుల్ షాక్ అబ్జర్వర్స్ దీనిలోని ముఖ్యమైన ఫీచర్లు.

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
PM Modi Chennai Tour: సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Embed widget