అన్వేషించండి

Honda Activa e vs TVS iQube: యాక్టివా ఇ స్కూటర్‌ వర్సెస్‌ టీవీఎస్‌ ఐక్యూబ్, ధర,మైలేజీలో ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇక్కడ!

Honda Activa e vs TVS iQube: భారత్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మార్కెట్‌లో పెద్ద సంస్థలైన హోండా, టీవీఎస్‌ మధ్య పోటీ రసరవత్తంగా మారింది. ఈ సంస్థల నుంచి వచ్చిన యాక్టివా ఇ, ఐక్యూబ్‌లలో ఏది కొనడం మంచిది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పెరుగుతున్న పెట్రోల్ ధరలు, పర్యావరణ స్పృహతో ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు.
  • యాక్టివా ఇ, ఐక్యూబ్: ధర, రేంజ్, టాప్ స్పీడ్ పోలిక.
  • స్వాపబుల్ బ్యాటరీ యాక్టివా ఇ, ఫిక్స్డ్ బ్యాటరీ ఐక్యూబ్ అందిస్తుంది.
  • యాక్టివా ఇ ఎక్కువ పవర్, ఐక్యూబ్ ఎక్కువ స్టోరేజ్ ఇస్తాయి.

Honda Activa e vs TVS iQube: భారత్‌లో పెట్రోల్ ధరలు పెరుగుదలకు తోడు పర్యావరణ స్పృహ పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు సైతం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు అత్యంత ఇష్టైన బ్రాండ్‌ హోండా తన ఐకానిక్ యాక్టివాను ఎలక్ట్రిక్‌ రూపంలో ప్రవేశపెట్టగా, టీవీస్ తన ఐక్యూబ్‌తో ఇప్పటికే మార్కెట్‌లో బలమైన ముద్ర వేసుకుంది. ఈ రెండు ఫ్యామిలీ ఈవీ స్కూటర్‌లో ఏది మెరుగైనదో వివరంగా చూద్దాం. 

ఏది చౌక? హోండా యాక్టివా ఇ vs ఐక్యూబ్‌ ధరలు

బడ్జెట్ విషయానికి వస్తే టీవీఎస్ ఐక్యూబ్‌ కొంత తక్కువ ధరకే లభిస్తోంది.  టీవీఎస్‌ ఐక్యూబ్‌ ఎక్స్‌ షోరూమ్‌ ప్రారంభ ధ 1, 15, 322 కాగా, ఆన్‌ రోడ్ ధర లక్షా పాతిక వేలుకుపైమాటే. హోండా యాక్టివా ఇ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర సుమారు 1,18,147 రూపాయలు. దీని ఆన్‌రోడ్ ధర లక్షా 30 వరకు ఉంది. ఆరంభంలో కొంచెం పొదుపును ఆశించే వారికి ఐక్యూబ్ కాస్త ఆకర్షణీయమైన ఆప్షన్‌గా కనిపిస్తుంది. 

ఒకే క్లిక్‌లో పూర్తి పోలిక 

ఫీచర్లు / స్పెసిఫికేషన్స్ హోండా యాక్టివా ఇ (Honda Activa e) టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)

రియల్ వరల్డ్ రేంజ్ (Range)

102 కిలోమీటర్లు (ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే) 94 కిలోమీటర్లు (ఒక్క ఛార్జ్‌పై)

గరిష్ట వేగం (Top Speed)

80 కిలోమీటర్‌లు /గంట 75-78 కిమీ/గంట

మోటార్ పవర్ (Peak Power)

6 kW (శక్తివంతమైనది) 4.4 kW

బ్యాటరీ టైప్ (Battery Type)

స్వ్యాప్పబుల్ (మార్చుకోగలిగేది) ఫిక్స్‌డ్ బ్యాటరీ

డిక్కీ స్పేస్ (Storage)

చాలా తక్కువ (సీటు కింద బ్యాటరీ వల్ల) 30 - 32 లీటర్లు (ఎక్కువ స్టోరేజ్)

డిస్‌ప్లే స్క్రీన్ (Display)

7-అంగుళాల పెద్ద TFT స్క్రీన్ స్మార్ట్ డిజిటల్ డిస్‌ప్లే

బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీ

ఈ రెండు స్కూటర్ల మధ్య ఉన్న అతి పెద్ద వ్యత్యాసం బ్యాటరీ సెటప్‌లోనే ఉంది. 

హోండాయ యాక్టివా ఇ ఇన్నోవేషన్ :- ఇందులో హోండా ప్రవేశపెట్టిన స్వాపబుల్‌ బ్యాటరీ టెక్నాలజీ ఉంది. అంటే గంటల తరబడి ఛార్జింగ్ కోసం వేచి చూడాల్సిన పని లేదు. బ్యాటరీ స్టేషన్‌లోకి వెళ్లి ఖాళీ బ్యాటరీ ఇచ్చి, ఫుల్ ఛార్జ్ ఉన్న బ్యాటరీ కేవలం నిమిషాల్లో మార్చుకుని వెళ్లిపోవచ్చు. అయితే రెండు బ్యాటరీలను సీటు కింద ఉంచడం వల్ల యాక్టివా ఇలో డిక్కీ స్పేస్‌ దాదాపు ఉండదు. 

టీవీఎస్‌ ఐక్యూబ్ కంఫర్ట్‌:- ఇందులో ఫిక్స్డ్‌ బ్యాటరీ ఉంటుంది. ఇంటి వద్దే ఛార్జ్ చేసుకోవాలి. కానీ, దీని వల్ల ఇందులో 30 నుంచి 32 లీటర్ల పెద్ద స్టోరేజ్‌ స్పేస్ లభిస్తుంది. నిత్యావరస వస్తువులు లేదా, హెల్మెట్ పెట్టుకోవడానికి ఇది పక్కా ఫ్యామిలీ స్కూటర్‌లా ఉపయోగపడుతుంది. 

టెక్నాలజీ పరంగా రెండు దేనికదే సాటి. యాక్టివా ఇ స్కూటర్‌లో టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ చేసే ఏడు అంగుళాల పెద్ద టీఎఫ్‌టీ స్క్రీన్, స్మార్ట్ కీ, రైడింగా మోడ్స్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఐక్యూబ్‌లో క్రాష్‌ అండ్ ఫాలో అలర్ట్, బ్లూటూత్‌ కనెక్టవిటీ, రివర్స్‌ అసిస్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. సింగిల్ లేదా వెనుక ఒకరిని కూర్చోబెట్టుకొని ప్రయాణించినా దీని రైడ్ క్వాలిటీ స్మూత్‌గా ఉంటుంది. 

మీరు ప్రతి రోజూ ఆఫీస్‌కు లేదా వేర్వేరు పనులపై ఎక్కువ దూరం ప్రయాణించే వారైతే, ఎక్కువ పవర్ కావాలనుకుంటే, ఛార్జింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయించలేకపోతే యాక్టివా ఇ స్కూటర్‌ మంచి ఆప్షన్ అవుతుంది. 

మీరు కంప్లీట్ ఫ్యామిలీ కోసం, కూరగాయలు, లేదా సామాగ్రి పెట్టుకోవడానికి ఎక్కువ డిక్కీ స్పేస్ కావాలనుకుంటే టీవీఎస్‌ ఐక్యూబ్‌ మంచి ఎంపిక. 

Frequently Asked Questions

ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు ప్రజలు ఎందుకు మొగ్గు చూపుతున్నారు?

పెట్రోల్ ధరలు పెరుగుదల మరియు పర్యావరణ స్పృహ పెరగడం వల్ల ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆకర్షితులవుతున్నారు.

హోండా యాక్టివా ఇ మరియు టీవీఎస్ ఐక్యూబ్ ధరలలో తేడా ఏమిటి?

టీవీఎస్ ఐక్యూబ్ ధర హోండా యాక్టివా ఇ కంటే కొంచెం తక్కువగా ఉంది. ఐక్యూబ్ ధర సుమారు రూ.1,15,322 నుండి ప్రారంభం కాగా, యాక్టివా ఇ సుమారు రూ.1,18,147 నుండి ప్రారంభమవుతుంది.

హోండా యాక్టివా ఇ మరియు టీవీఎస్ ఐక్యూబ్ బ్యాటరీలలో ప్రధాన తేడా ఏమిటి?

యాక్టివా ఇ లో స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీ ఉంది, దీని వలన బ్యాటరీలను నిమిషాల్లో మార్చుకోవచ్చు. ఐక్యూబ్ లో ఫిక్స్డ్ బ్యాటరీ ఉంటుంది, దీనిని ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవాలి.

ఎక్కువ స్టోరేజ్ స్పేస్ ఉన్న స్కూటర్ ఏది?

టీవీఎస్ ఐక్యూబ్ లో 30-32 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉంటుంది, ఇది కూరగాయలు లేదా సామాగ్రి పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

ఎక్కువ దూరం ప్రయాణించేవారికి ఏ స్కూటర్ మంచిది?

ఎక్కువ దూరం ప్రయాణించేవారికి, త్వరగా ఛార్జింగ్ చేయాలనుకునే వారికి హోండా యాక్టివా ఇ మంచి ఎంపిక.

టాప్ హెడ్ లైన్స్

Renault Triber 7-సీటర్‌ ఫ్యామిలీ కారు.. రూ.1.16 లక్షల డౌన్‌పేమెంట్‌ చాలు, మిగిలింది EMIల్లో చూసుకోవచ్చు
ఏడు సీట్ల కారు ఇంత చౌకగానా? నెలకు కేవలం రూ.8,300 కడితే Renault Triber మీ సొంతం!
Renault Triber కొనేవాళ్ల అసలు ఛాయిస్ ఇదే.. ఈ వేరియంట్‌లో ఫీచర్లు & పవర్ రెండూ పక్కా!
రెనాల్ట్‌ ట్రైబర్‌లో ఏ వేరియంట్ కొనాలి? రూ.8.53 లక్షలకే టర్బో ఇంజిన్‌తో అదిరిపోయే ప్యాకేజీ!
2026 Bajaj Pulsar NS125 కొత్త అవతార్.. ఇక LCD డిస్‌ప్లేతో పాటు మరిన్ని ఫీచర్లు!
లాంచ్‌కు ముందే లీకైన 2026 పల్సర్ NS125 ఫొటోలు.. కొత్త రంగులు, కలర్ డిస్‌ప్లే!
First-Time Car Insurance: మీ కార్ ఇన్సూరెన్స్‌లో ఇవి ఉన్నాయా? పాలసీ తీసుకునే ముందు ఈ చెక్‌లిస్ట్ చూడండి
మొదటిసారి కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
Union Cabinet Decisions: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత పూర్తి వివరాలు
Vijayasai Reddy About YSRCP: ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Rajinikanth : ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
Vijayasai Reddy: ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
Boyapati Srinu: బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
October Rule Changes: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
Embed widget