అన్వేషించండి

2026 Tata Tiago CNG Facelift: టాటా టియాగో సీఎన్‌జీలో సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్ - ప్యాడల్ షిఫ్టర్లతో రాబోతున్న సరికొత్త 2026 ఫేస్‌లిఫ్ట్ మోడల్

టాటా మోటార్స్ మే 28న లాంచ్ చేయబోతున్న టియాగో సీఎన్‌జీ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా ఏఎంటీ గేర్‌బాక్స్‌తో పాటు ప్యాడల్ షిఫ్టర్లను ఇస్తున్నట్లు ప్రకటించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 2026 టాటా టియాగో CNG AMT గేర్‌బాక్స్‌తో ప్యాడిల్ షిఫ్టర్లను అందించనుంది.
  • ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో బూట్ స్పేస్, 75hp ఇంజిన్, డైరెక్ట్ CNG స్టార్ట్ ఉంటాయి.
  • లేయర్డ్ డాష్‌బోర్డ్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా ఉంటాయి.
  • కొత్త లుక్, LED హెడ్‌ల్యాంప్స్, కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్‌తో మార్కెట్లో పోటీ ఇవ్వనుంది.

2026 Tata Tiago CNG Facelift to Get Segment First Paddle Shifters: టాటా మోటార్స్ తన అప్‌కమింగ్ 2026 టియాగో ఫేస్‌లిఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారుకు సంబంధించిన వివరాలను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది. ఇదివరకు ఎక్స్‌టీరియర్ డిజైన్, ఇంటీరియర్ లుక్‌ను చూపించిన కంపెనీ, తాజాగా ఒక కొత్త టీజర్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం టియాగో  సీఎన్‌జీ (CNG) వెర్షన్‌లో సెగ్మెంట్‌లోనే ఫస్ట్ టైమ్ ఏఎంటీ (AMT) గేర్‌బాక్స్‌తో పాటు ప్యాడల్ షిఫ్టర్లను (Paddle Shifters) అందించబోతున్నట్లు టాటా సంస్థ కన్ఫర్మ్ చేసింది. మే 28న ఇండియన్ మార్కెట్లో అఫీషియల్‌గా లాంచ్ కాబోతున్న ఈ కారు, టెక్నాలజీ పరంగా కస్టమర్లకు సరికొత్త డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది.

Read Also: Car Battery Life: కారు బ్యాటరీ త్వరగా పాడవుతుందా? ఈ చిట్కాలతో బ్యాటరీ లైఫ్ పెంచుకోవచ్చు

సీఎన్‌జీ ఇంజన్ పర్ఫార్మెన్స్..

కొత్త తియాగో సీఎన్‌జీ మోడల్ స్పెసిఫికేషన్లు దాదాపు పెట్రోల్ వెర్షన్ లాగే ఉంటాయి. ఇందులో గ్యాస్ స్టోరేజ్ కోసం టాటా పేటెంటెడ్ ట్విన్-సిలిండర్ టెక్నాలజీని కొనసాగించనున్నారు. దీనివల్ల బూట్ స్పేస్ బాగా లభిస్తుంది. ఈ కారులో 75 హార్స్‌పవర్ జనరేట్ చేసే 1.2-లీటర్, త్రీ-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్‌ను అమర్చారు. ఈ సెటప్ 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. దీనితో పాటు డైరెక్ట్ స్టార్ట్-ఇన్-సీఎన్‌జీ (Direct start-in-CNG) ఫీచర్‌ను కూడా ఇందులో కంటిన్యూ చేశారు. ఈ ఫీచర్ వల్ల కారును నేరుగా సీఎన్‌జీ మోడ్‌లోనే స్టార్ట్ చేసుకోవచ్చు.

Read Also: CNG Price Hike: మళ్లీ పెరిగిన CNG ధరలు.. 11 రోజుల్లో నాలుగో సారి పెంపు, ఇంకెంత పెరుగుతుందో!  

లేయర్డ్ డ్యాష్‌బోర్డ్.. 

పెట్రోల్ వెర్షన్ లాగే టియాగో  సీఎన్‌జీ క్యాబిన్‌లో కూడా రెండు సెపరేట్ డిస్‌ప్లేలను ఇచ్చారు. ఇందులో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ కాగా, డ్రైవర్ డిస్‌ప్లే కోసం పాత ఎల్‌సీడీ సెటప్‌ను తీసేసి సరికొత్త డిజిటల్ క్లస్టర్‌ను జోడించారు. పాత మోడల్ లో ఉన్న ఫ్లోయింగ్ డిజైన్ స్థానంలో ఇప్పుడు లేయర్డ్ లేఅవుట్‌తో డ్యాష్‌బోర్డ్‌ను రీడిజైన్ చేశారు. ఫీచర్ల పరంగా ఈ కారులో 360-డిగ్రీ కెమెరా సిస్టమ్, డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్, రోటరీ గేర్ సెలెక్టర్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్ వంటి అప్‌మార్కెట్ ఎక్విప్‌మెంట్‌ను అందించారు.

కొత్త లుక్.. మార్కెట్ లో గట్టి పోటీ

కారు ఎక్స్‌టీరియర్ లో చేసిన మార్పులు టియాగో కు మరింత మోడర్న్ అప్పీల్‌ను ఇస్తున్నాయి. ఇందులో కొత్త బంపర్లు, సరికొత్త డిజైన్ తో వచ్చిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, సరికొత్త అల్లాయ్ వీల్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సరికొత్త ఫీచర్లు, కాస్మెటిక్ అప్‌డేట్స్ వల్ల కొత్త టాటా టియాగో  ధరలు మునుపటి మోడల్ కంటే స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. ఇండియన్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయిన తర్వాత ఈ కారు సరికొత్త మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ వంటి పాపులర్ హ్యాచ్‌బ్యాక్ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Frequently Asked Questions

2026 టాటా టియాగో CNG ఫేస్‌లిఫ్ట్ లో ప్రత్యేకత ఏమిటి?

2026 టాటా టియాగో CNG ఫేస్‌లిఫ్ట్ లో సెగ్మెంట్‌లోనే ఫస్ట్ టైమ్ AMT గేర్‌బాక్స్‌తో పాటు ప్యాడల్ షిఫ్టర్లను అందించనున్నారు.

కొత్త టియాగో CNG ఇంజన్‌లో ఏయే ఫీచర్లు ఉన్నాయి?

కొత్త టియాగో CNG లో 75 HP జనరేట్ చేసే 1.2-లీటర్ ఇంజన్‌తో పాటు 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌ ఉంటుంది. డైరెక్ట్ స్టార్ట్-ఇన్-CNG ఫీచర్ కూడా ఉంది.

కొత్త టియాగో CNG క్యాబిన్‌లో ఎలాంటి మార్పులు చేశారు?

క్యాబిన్‌లో 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, కొత్త డిజిటల్ క్లస్టర్‌తో పాటు లేయర్డ్ లేఅవుట్ డ్యాష్‌బోర్డ్‌ను రీడిజైన్ చేశారు.

కొత్త టియాగో CNG ఎప్పుడు లాంచ్ అవుతుంది?

ఈ కారు మే 28న ఇండియన్ మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ కానుంది.

టాప్ హెడ్ లైన్స్

రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
ఖరీదైన కార్లలోనే ADAS ఉంటుందని అనుకుంటున్నారా? మీ బడ్జెట్‌లోనే అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు
ఖరీదైన కార్లకు దీటుగా ADAS ఉన్న 'బడ్జెట్‌ కార్లు'.. రూ.9.39 లక్షలకే సొంతం చేసుకోవచ్చు!
Best selling car: దేశవ్యాప్తంగా జనం ఈ కారు కోసం షోరూమ్‌ ముందు క్యూ కట్టారు, మీ బడ్జెట్‌లోనే వస్తుంది!September 2026 best selling cars in India Maruti Baleno price
సేల్స్‌లో దేశంలోనే నంబర్ 1 ఈ మారుతి కారు.. ధర రూ.6 లక్షల లోపే!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Director Maruthi: రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Embed widget