అన్వేషించండి

Best CNG SUVs Under 10 Lakhs: 10 లక్షల బడ్జెట్లో బెస్ట్ సీఎన్‌జీ ఎస్‌యూవీలు - పెట్రోల్ భారం తగ్గించే టాప్ కార్ల లిస్ట్ ఇదే

ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న తరుణంలో తక్కువ రన్నింగ్ కాస్ట్ తో పాటు ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ సీఎన్‌జీ ఎస్‌యూవీల గురించి తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పెరిగిన ఇంధన ధరలతో, రూ. 10 లక్షల లోపు CNG SUVలు ఆకర్షణీయంగా మారాయి.
  • టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్ CNGలు మంచి మైలేజ్, ఆకర్షణీయ ధరతో లభిస్తాయి.
  • మారుతి ఫ్రాంక్స్, టొయోటా టైజర్ CNGలు ఒకే ప్లాట్‌ఫామ్‌పై, అద్భుతమైన మైలేజ్‌తో వస్తాయి.
  • టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా CNGలు శక్తివంతమైన ఇంజిన్‌లతో, మంచి మైలేజీని అందిస్తాయి.

Best CNG SUVs Under 10 Lakh Rupees: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల కస్టమర్ల కొనుగోలు ట్రెండ్స్ మారుతున్నాయి. రోజువారీ ప్రయాణాలు చేసే వారికి ఇంధన ఖర్చులు నెలకు పెద్ద భారంగా మారుతుండటంతో తక్కువ రన్నింగ్ కాస్ట్ ఇచ్చే కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఎస్‌యూవీ కార్లకు భారీ క్రేజ్ ఉన్నప్పటికీ, పెరుగుతున్న ఇంధన ధరల వల్ల కస్టమర్లు ఎకనామికల్ ఆప్షన్ల కోసం చూస్తున్నారు. ఈ క్రమంలోనే అఫర్డబుల్ సీఎన్‌జీ ఎస్‌యూవీలు (CNG SUVs) ముఖ్యంగా కాంపాక్ట్ సెగ్మెంట్ లో మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. రూ. 10 లక్షల లోపు బడ్జెట్ ఉన్న వారికి ఇవి ఒక ప్రాక్టికల్ ఛాయిస్‌గా నిలుస్తున్నాయి. ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్‌జీ కిట్ తో వచ్చే కొన్ని బెస్ట్ ఆప్షన్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Read Also: Skoda Epiq Electric SUV Unveiled: స్కోడా ఎపిక్ ఈవీ అన్‌వీల్: 440 కిలోమీటర్ల రేంజ్ తో రాబోతున్న స్కోడా చీపెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 

టాటా పంచ్ ,హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ 

ఈ లిస్టులో మొదటిది టాటా పంచ్ సీఎన్‌జీ (Tata Punch CNG). ఇది స్మార్ట్, ప్యూర్, అడ్వెంచర్, అకాంప్లిష్డ్ వేరియంట్లలో రూ. 6.75 లక్షల నుండి రూ. 10.6 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర పరిధిలో లభిస్తోంది. ఇందులో 1.2-లీటర్, 3-సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 74 హెచ్‌పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎమ్‌టీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వచ్చే ఈ కార్ కేజీకి 26.99 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో 60 లీటర్ల కెపాసిటీ ఉన్న ట్విన్ సిలిండర్ టెక్నాలజీని ఉపయోగించారు. దీనికి పోటీగా హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ (Hyundai Exter CNG) అందుబాటులో ఉంది. దీని ధర రూ. 7 లక్షల నుండి రూ. 9.41 లక్షల వరకు ఉంది. ఇందులో 1.2-లీటర్, 4-సిలిండర్ ఇంజన్ ఉంది, ఇది 69 హెచ్‌పీ పవర్ ఇస్తుంది. కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో వచ్చే ఈ కారు కేజీకి 27.1 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

Read Also: Petrol Price Today:పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయా? మీ సిటీలో ఏ రేటు ఉందో చూడండి! 

మారుతి ఫ్రాంక్స్, టొయోటా టైజర్..

మారుతి సుజుకి ఫ్రాంక్స్ సీఎన్‌జీ, టొయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ సీఎన్‌జీ అనేవి ఒకే ప్లాట్‌ఫామ్ పై తయారైన కవల కార్లు. టొయోటా-మారుతి సుజుకి భాగస్వామ్యంలో భాగంగా ఒకే ఫీచర్లు, ఇంజన్ ఆప్షన్లతో ఇవి బ్యాడ్జ్-ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్‌గా అమ్ముడవుతున్నాయి. ఫ్రాంక్స్ సీఎన్‌జీ ధర రూ. 7.79 లక్షల నుండి ప్రారంభం అవుతుండగా, ఇది సిగ్మా, డెల్టా ట్రిమ్స్ లో లభిస్తుంది. టొయోటా టైజర్ మాత్రం కేవలం ఒకే ఒక 'ఇ' వేరియంట్ లో రూ. 8.24 లక్షల ధరకు అందుబాటులో ఉంది. ఈ రెండు కార్లలోనూ 1.2-లీటర్, 4-సిలిండర్ ఇంజన్ ఉపయోగించారు. ఇది 77.5 హెచ్‌పీ పవర్, 98.5 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఇవి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో వస్తూ కేజీకి గరిష్టంగా 28.51 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజ్ ఇస్తాయి.

టాటా నెక్సాన్ ,మారుతి బ్రెజ్జా సీఎన్‌జీ..

ఈ సెగ్మెంట్ లోనే ఏకైక టర్బో-పెట్రోల్ సీఎన్‌జీ ఆప్షన్ గా టాటా నెక్సాన్ సీఎన్‌జీ (Tata Nexon CNG) ప్రత్యేకంగా నిలుస్తోంది. దీని ప్రారంభ ధర రూ. 8.3 లక్షల నుండి ప్రారంభమై టాప్ వేరియంట్లలో రూ. 13.22 లక్షల వరకు ఉంటుంది. స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, ఫియర్‌లెస్ లాంటి పలు ట్రిమ్స్ లో లభించే ఈ కారులో 1.2-లీటర్ టర్బో ఇంజన్ ఉంది. ఇది 100 హెచ్‌పీ పవర్ ఇస్తూ కేజీకి 24 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. చివరగా మారుతి సుజుకి బ్రెజ్జా సీఎన్‌జీ (Brezza CNG) కూడా ఒక మంచి ఛాయిస్. ఇది ఎల్‌ఎక్స్‌ఐ, వీఎక్స్‌ఐ, జెడ్‌ఎక్స్‌ఐ వేరియంట్లలో రూ. 9.17 లక్షల నుండి రూ. 11.46 లక్షల ధరలో లభిస్తోంది. దీనిలోని 1.5-లీటర్, 4-సిలిండర్ ఇంజన్ 88 హెచ్‌పీ పవర్ ఇస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉన్న ఈ కారు కేజీకి 25.51 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది, దీని సిలిండర్ ట్యాంక్ కెపాసిటీ 55 లీటర్లు.

Frequently Asked Questions

పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో కస్టమర్లు ఏ రకమైన కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు?

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల కస్టమర్లు తక్కువ రన్నింగ్ కాస్ట్ ఇచ్చే కార్ల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా అఫర్డబుల్ CNG SUVs ఎకనామికల్ ఆప్షన్లుగా మారాయి.

రూ. 10 లక్షల లోపు బడ్జెట్ లో లభించే కొన్ని ప్రముఖ CNG SUVలు ఏవి?

టాటా పంచ్ CNG, హ్యుందాయ్ ఎక్స్‌టర్ CNG, మారుతి ఫ్రాంక్స్ CNG, టొయోటా టైజర్ CNG, టాటా నెక్సాన్ CNG, మరియు మారుతి బ్రెజ్జా CNG అనేవి రూ. 10 లక్షల లోపు బడ్జెట్ లో లభించే కొన్ని CNG SUVలు.

మారుతి ఫ్రాంక్స్ CNG మరియు టొయోటా టైజర్ CNG మధ్య ప్రధాన తేడా ఏమిటి?

ఈ రెండు కార్లు ఒకే ప్లాట్‌ఫామ్ పై తయారయ్యాయి మరియు ఒకే ఫీచర్లు, ఇంజన్ ఆప్షన్లతో వస్తాయి. అయితే, ఫ్రాంక్స్ CNG వివిధ ట్రిమ్స్‌లో లభిస్తుండగా, టైజర్ CNG కేవలం ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

టాటా నెక్సాన్ CNG ప్రత్యేకత ఏమిటి?

టాటా నెక్సాన్ CNG ఈ సెగ్మెంట్‌లో ఏకైక టర్బో-పెట్రోల్ CNG ఆప్షన్‌గా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది 1.2-లీటర్ టర్బో ఇంజన్‌తో 100 హెచ్‌పీ పవర్ అందిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
ట్రయంఫ్ ట్రాకర్ 400 పెర్ఫార్మెన్స్‌ టెస్ట్.. యాక్సిలరేషన్‌, బ్రేకింగ్ వ్యవస్థల నిజమైన పనితీరు ఇదే!
100 కి.మీ. వేగం 7.55 సెకన్లలోనే.. Triumph Tracker 400 సూపర్‌ పెర్ఫార్మెన్స్‌!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
తక్కువ ధరకే టాటా ఎలక్ట్రిక్ కార్లు.. BaaSతో దిగొచ్చిన ధరలు, పూర్తి లెక్క ఇదిగో
టాటా EVలపై భారీ తగ్గింపు.. కొత్త స్కీమ్‌తో రూ.7.30 లక్షల వరకు ఆదా!

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
Neeru Dhanda Clinches Shooting Gold: వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
Embed widget