అన్వేషించండి

Skoda Epiq Electric SUV Unveiled: స్కోడా ఎపిక్ ఈవీ అన్‌వీల్: 440 కిలోమీటర్ల రేంజ్ తో రాబోతున్న స్కోడా చీపెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ స్కోడా తన లైనప్‌లోనే అత్యంత చౌకైన, చిన్నదైన సరికొత్త ఎపిక్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని గ్లోబల్ మార్కెట్ల కోసం అధికారికంగా అన్‌వీల్ చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • స్కోడా అత్యంత చౌకైన, చిన్న ఎలక్ట్రిక్ SUV 'ఎపిక్' ఆవిష్కరణ.
  • 440 కి.మీ. రేంజ్, రెండు బ్యాటరీ ఆప్షన్లతో MEB+ ప్లాట్‌ఫామ్.
  • ఆధునిక డిజైన్, 475 లీటర్ల విశాలమైన బూట్ స్పేస్ అందిస్తుంది.
  • 13-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్, ADAS ఫీచర్లతో అధునాతన క్యాబిన్.

Skoda Epiq Electric SUV Unveiled Globally: ప్రముఖ అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో (Skoda Auto) గ్లోబల్ మార్కెట్ల కోసం తన ప్రొడక్షన్-స్పెక్ 'ఎపిక్' (Epiq) మోడల్‌ను అధికారికంగా ప్రదర్శించింది. ఇది స్కోడా బ్రాండ్ నుండి రాబోతున్న అత్యంత చిన్నదైన, చాలా అఫర్డబుల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కావడం విశేషం. గ్లోబల్ మార్కెట్లలో ఎంట్రీ-లెవెల్ ఈవీగా రాబోతున్న ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సింగిల్ చార్జ్‌పై గరిష్టంగా 440 కిలోమీటర్ల మైలేజ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. ఫ్రంట్-వీల్-డ్రైవ్ లేఅవుట్, సరికొత్త డిజైన్ లాంగ్వేజ్‌తో వస్తున్న ఈ కారు భవిష్యత్తులో రాబోయే స్కోడా ఎస్‌యూవీల రూపకల్పనకు ఒక బ్లూప్రింట్‌లా నిలవనుంది. స్కోడా ఎలక్ట్రిక్ కార్ల లైనప్‌లో ఇది ఎన్యాక్, ఎల్రోక్ మోడళ్ల కంటే కింద ఉంటుంది.

Read Also: Petrol Price Today:పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయా? మీ సిటీలో ఏ రేటు ఉందో చూడండి! 

కొత్త ఫ్లాట్‌ఫామ్.. పవర్‌ఫుల్ బ్యాటరీ ..

స్కోడా ఎపిక్ కారును వోక్స్‌వ్యాగన్ గ్రూప్‌నకు చెందిన నెక్స్ట్ జనరేషన్ ఎంఈబీ+ (MEB+) ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. ఫ్రంట్-వీల్-డ్రైవ్ కాన్ఫిగరేషన్‌ను ఉపయోగిస్తున్న మొట్టమొదటి స్కోడా ఈవీ ఇదే కావడం విశేషం. ఈ సరికొత్త ప్లాట్‌ఫామ్ వల్ల చిన్నవైన, చాలా తేలికైన బ్యాటరీ ప్యాక్‌లను ఉపయోగించే వీలు కలిగిందని కంపెనీ చెబుతోంది. స్కోడా ఈ ఎపిక్ మోడల్‌ను రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో, మూడు రకాల పవర్ అవుట్‌పుట్లలో ఆఫర్ చేయనుంది. ఇందులో టాప్-స్పెక్ ఎపిక్ 55 (Epiq 55) వేరియంట్ 211 హెచ్‌పీ పవర్, 290 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిలో పెద్దదైన 55 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు, ఇది 440 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. డీసీ ఫాస్ట్ చార్జర్ ఉపయోగించి కేవలం 24 నిమిషాల్లోనే ఈ బ్యాటరీని 10 నుండి 80 శాతానికి చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. దీని లోయర్ వేరియంట్లయిన ఎపిక్ 35 మోడల్ 116 హెచ్‌పీ, ఎపిక్ 40 మోడల్ 135 హెచ్‌పీ పవర్ ఇస్తూ దాదాపు 310 కిలోమీటర్ల రేంజ్ అందిస్తాయి.

Read Also: Tata Tiago Facelift: టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్‌ మే 28న విడుదల! అదిరిపోయే ఫీచర్లు, అప్‌డేటెడ్‌ డిజైన్‌తో ఎంట్రీ! 

మోడరన్ సాలిడ్ డిజైన్ ఫిలాసఫీ.. 

లుక్ పరంగా చూస్తే స్కోడా కంపెనీ తన సరికొత్త 'మోడరన్ సాలిడ్' డిజైన్ ఫిలాసఫీని పూర్తి స్థాయిలో ఉపయోగించి ప్రొడక్షన్ లోకి తెచ్చిన ఫస్ట్ మోడల్ ఇదే. కారు ముందు భాగంలో స్లిమ్ టి-షేప్డ్ ఎల్‌ఈడీ లైటింగ్ ఎలిమెంట్స్, గ్లోసీ బ్లాక్ టెక్-డెక్ ఫేస్ ఉన్నాయి. విజన్ 7ఎస్ కాన్సెప్ట్ కార్ నుండి ఇన్‌స్పైర్ అయిన వర్టికల్ ఎయిర్ ఇన్‌టేక్స్ ఈ కారుకు అగ్రెసివ్ లుక్ ఇస్తున్నాయి. వెనుక భాగంలో కూడా మినిమలిస్ట్ స్టైలింగ్ కొనసాగిస్తూ టి-షేప్డ్ టెయిల్ ల్యాంప్స్ ఇచ్చారు. ఈ ఎస్‌యూవీ పొడవు 4,171 మిమీ ఉంటుంది. ఇందులో 475 లీటర్ల భారీ బూట్ స్పేస్ ఇచ్చారు, ఈ సెగ్మెంట్‌లోనే ఇది అత్యంత పెద్ద బూట్ స్పేస్ కావడం విశేషం. కారు ముందు భాగంలో కూడా అదనంగా 25 లీటర్ల ఫ్రంట్ స్టోరేజ్ లేదా 'ఫ్రంక్' (Frunk) స్పేస్ లభిస్తుంది.

క్యాబిన్ ఫీచర్లు.. అడ్వాన్స్‌డ్ సేఫ్టీ టెక్నాలజీ..

కారు లోపల ఆండ్రాయిడ్ ఆధారిత పెద్దదైన 13 ఇంచుల ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను సెంటర్ లో అమర్చారు. ఈ సిస్టమ్ ద్వారా స్పాటిఫై, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ లాంటి యాప్స్ డైరెక్ట్ గా వాడుకోవచ్చు. మైస్కోడా యాప్ ద్వారా రిమోట్ చార్జింగ్, క్లైమేట్ కంట్రోల్ ఫంక్షన్లను ఆపరేట్ చేయవచ్చు. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా డిజిటల్ కీ ఫీచర్ కూడా రానుంది. క్యాబిన్ లోపల యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ చార్జింగ్, హీటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 10 స్పీకర్ల కాంటన్ ఆడియో సిస్టమ్ లాంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం స్టాండర్డ్‌గా 7 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ఫ్రంట్ అసిస్ట్, లేన్ అసిస్ట్, సైడ్ అసిస్ట్ లాంటి అడాస్ (ADAS) ఫీచర్లను అందించారు. ఇందులో బి-మోడ్ లో వన్-పెడల్ డ్రైవింగ్ ఫీచర్ ఉంది, దీనివల్ల కేవలం యాక్సిలరేటర్ పెడల్ తోనే కారును కంట్రోల్ చేయవచ్చు. ఇది బైడైరెక్షనల్ చార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది, దీని ద్వారా కారు బ్యాటరీ నుండి వేరే డివైజ్‌లకు లేదా ఇంటికి పవర్ ఇచ్చుకోవచ్చు. లాంచ్ అయిన వెంటనే ఆరెంజ్ స్టైలింగ్ ఎలిమెంట్స్, 20 ఇంచుల వీల్స్ ఉన్న లిమిటెడ్ 'ఫస్ట్ ఎడిషన్' వేరియంట్‌ను కూడా తీసుకురానున్నారు.

Frequently Asked Questions

స్కోడా ఎపిక్ అంటే ఏమిటి?

స్కోడా ఎపిక్ అనేది గ్లోబల్ మార్కెట్ల కోసం స్కోడా ఆటో విడుదల చేసిన సరికొత్త, చిన్నదైన, మరియు సరసమైన ఎలక్ట్రిక్ SUV. ఇది బ్రాండ్ నుండి రాబోయే ఎంట్రీ-లెవెల్ EV.

స్కోడా ఎపిక్ ఎంత దూరం ప్రయాణిస్తుంది?

స్కోడా ఎపిక్ సింగిల్ చార్జ్‌పై గరిష్టంగా 440 కిలోమీటర్ల మైలేజ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. టాప్-స్పెక్ వేరియంట్ 55kWh బ్యాటరీతో ఈ రేంజ్ అందిస్తుంది.

స్కోడా ఎపిక్ చార్జింగ్ ఎంత వేగంగా ఉంటుంది?

DC ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించి, స్కోడా ఎపిక్ బ్యాటరీని కేవలం 24 నిమిషాల్లో 10% నుండి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు.

స్కోడా ఎపిక్ లోపల ఏయే ఫీచర్లు ఉన్నాయి?

ఎపిక్ లోపల 13-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, మరియు 7 ఎయిర్‌బ్యాగ్‌లతో సహా అనేక ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

రూ.18 లక్షల SUVలో ఈ ఆధునిక సౌకర్యాలు లేవా? Hyundai Bayon కొనేముందు తెలుసుకోండి
కొత్తగా వచ్చిన Hyundai Bayonలో లేనివి - ప్రత్యర్థి కార్లలో ఉన్నవి.. 6 కీలక ఫీచర్లు ఇవే
Local FASTag Pass: టోల్ ప్లాజా దగ్గర నివసిస్తున్నారా? రూ.1,500 లేదా రూ.3,000తో ఫాస్టాగ్‌ లోకల్ పాస్ పొందొచ్చు!
FASTag కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచి స్థానికులకు యాన్యువల్‌ పాస్‌లు.. ధరలు ఎంతంటే?
420cc ఇంజిన్‌, 48hp పవర్‌తో దూసుకెళ్లే BMW కొత్త స్పోర్ట్స్ బైక్... ఇండియాలోకి F 450 RR ఎప్పుడొస్తుంది?
కొత్త స్పోర్ట్స్ బైక్ BMW F 450 RR గురించి యువతరం తప్పక తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు
సిటీ డ్రైవింగ్‌లో Mahindra XUV 3XO CNG టాప్.. హైవేపై Tata Nexon iCNG దూకుడు.. పూర్తి మైలేజీలో ఏ కారు బెస్ట్‌?
మహీంద్రా XUV 3XO CNG vs టాటా నెక్సాన్ CNG.. ఏది ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ టెస్ట్‌లో తేలిన నిజాలివే!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget