అన్వేషించండి

Tata Tiago Facelift: టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్‌ మే 28న విడుదల! అదిరిపోయే ఫీచర్లు, అప్‌డేటెడ్‌ డిజైన్‌తో ఎంట్రీ!

Tata Tiago Facelift Launch: టాటా మోటార్స్‌ మే28న టియాగో ఫేస్‌లిఫ్ట్‌ను లాచ్ చేయనుంది. ఆధునిక డిజైన్, 10.25 అంగుాల టచ్‌స్క్రీన్, లేటెస్ట్‌ ఇంటీరియర్ ఫీచర్లతో వస్తోంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ మే 28న విడుదలయ్యే అవకాశం ఉంది.
  • కొత్త టియాగో షార్ప్ డిజైన్, అగ్రెసివ్ లుక్ తో వస్తుంది.
  • 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ క్లస్టర్ క్యాబిన్ విశేషాలు.
  • పెట్రోల్, ఈవీ వెర్షన్లు మెరుగైన బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తాయి.

Tata Tiago Facelift: భారతీయ ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్‌ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇటీవల హ్యుందాయ్‌ మోటార్ ఇండియాను వెనక్కి నెట్టి, భారత్‌లో రెండో అతి పెద్ద కార్ల తయారీ సంస్థగా టాటా మోటార్స్ అవతరించింది. ఈ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతోపాటు, వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు సంస్థ వరుసగా కొత్తగా మోడళ్లను, అప్‌డేటెడ్‌ వెర్షన్లను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా టాటా నుంచి వస్తున్న అత్యంత సరసమైన హ్యాచ్‌బ్యాక్ టియాగో ఇప్పుడు సరికొత్త  ఫేస్‌లిఫ్ట్‌ రూపంలో అలరించేందుకు సిద్ధమైంది. 

ప్రస్తుతం భారత్ హ్యాచ్‌బ్యాక్‌ మార్కెట్‌లో పోటీ తీవ్రంగా ఉంది. మారుతి సుజుకి వాగన్ ఆర్, హ్యుందాయ్‌ గ్రాండ్‌ ఐ10 నియోస్‌, సిట్రోయెన్ సీ3, మారుతి సుజుకి స్విఫ్ట్ వంటి దిగ్గజ మోడళ్లతో టియాగో పోటీ పడుతోంది. ఇప్పటికే మంచి అమ్మకాలతో దూసుకుపోతున్న టియాగోు మరింత ఊపునివ్వడానికి, మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా దీనిని అప్‌డేట్‌ చేయాలని ాటా మోటార్స్ నిర్ణయించింది. డిజిటల్‌ ఫీచర్లు, ప్రీమియం లుక్ కోరుకునే నేటి తరం కస్టమ్లకు ఆకర్షించడమే ఈ ఫేస్‌లిఫ్ట్ ప్రధాన ఉద్దేశం. 

టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్‌ లాంచ్ ఎప్పుడు

తాజా సమాచారం ప్రకారం, సరికొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్‌ మే 28న అధికారికంగా మార్కెట్‌లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. ఈ లాంచ్‌తో హ్యాచ్‌బ్యాక్‌ విభాగంలో టాటా తన పట్టును మరింత పెంచుకోవాలని భావిస్తోంది. 

Also Read:కుటుంబ ప్రయాణాలకు అనువైన టాప్‌ ఎంపీవీలు ఇవే! ధర, ఫీచర్స్‌ ఇతర వివరాలు తెలుసుకోండి!

టాటా టియాగో  ఫేస్‌లిఫ్ట్‌లో వస్తున్న మార్పులేంటీ?

టియాగో ఫేస్‌లిఫ్ట్ కేవలం పైపై మెరుగులు మాత్రమే కాకుండా, లోపల, బయట గణనీయమైన మార్పులతో వస్తోంది. కొత్త టియాగో మునుపటి కంటే మరింత ఆధునికంగా, షార్ప్‌గా కనిపిస్తోంది. ముందు భాగంలోని సన్నని గ్రిల్, రీడిజైన్ చేసిన హెడ్ ల్యాంప్స్‌ ఉంటాయని అంచనా ఉంది. అగ్రెసివ్‌, స్పోర్టీ లుక్‌ కోసం కొత్త ప్రంట్ బంపర్‌ను అమర్చారు. సైడ్ ప్రొఫైల్‌లో ప్రధానంగా మల్టీ స్పోక్‌,  కాంప్లెక్స్‌ డిజైన్‌తో కూడిన కొత్త అల్‌లాయ్‌ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వెనుకవైపు ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంప్స్‌, ఫ్లాట్ డిజైన్‌తో కూడిన అగ్రెసివ్ రియర్ బంపర్‌ ఉండబోతున్నాయి. 

Also Read:పోర్షే నుంచి లంబోర్ఘిని వరకు... ఎన్టీఆర్ గ్యారేజీలో కార్ కలెక్షన్, ఆయన టోటల్ నెట్ వర్త్ తెలుసా?

ఇంటీరియర్, టెక్నాలజీలో వస్తున్న మార్పులు 

క్యాబిన్‌ లోపల 10.25 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్మెంట్‌ సిస్టమ్‌ ప్రధాన హైలైట్‌. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేను సపోర్ట్‌ చేస్తుంది. డ్రైవర్‌ కోసం పూర్తిగా డిజిటల్‌్ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ను కేటాయించారు. గ్లోస్‌ బ్లాక్‌  ఫినిషింగ్‌తో కూడిన సెంటర్‌ కన్సోల్‌, టచ్ ఆధారిత క్లైమేట్ కంట్రోల్‌ బటన్లు, యాంబియంట్‌ లైటింగ్‌, మెరుగైన సౌండ్ సిస్టమ్‌‌ వంటివి కూడా ఉండనున్నాయి. ఇందులో 360 డిగ్రీల కెమెరా ఫీచర్‌ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఈ విభాగంలోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. 

Also Read:పెట్రోల్ వర్సెస్ ఎలక్ట్రిక్ బైక్స్: వాహనదారులకు ఏది బెస్ట్ ఆప్షన్?

ఇంజిన్ పని తీరు సంగతేంటీ?

ఇది కేవలం మిడ్ లైఫ్ రిఫ్రెష్‌ మాత్రమే కావడంతో, ప్రస్తుతం ఉన్న ఇంజిన్ ఆప్షన్లనే కొనసాగించే అవకాశం ఉంది. 1.2 లీటర్ రెవోట్రాన‌ పెట్రోల్‌ ఇంజిన్, ఇది 86 పీస్‌ పవర్‌, 113Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ీనికి 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉంటాయి. 

Also Read:10 లక్షల బడ్జెట్‌తో లభించే అత్యుత్తమ కార్లు! ఫీచర్లు, మైలేజీ వివరాలు ఇవే!

ఐసీఈ వెర్షన్లతోపాటు టాటా టియాగో.ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ను కూడా త్వరలో రానుంది. ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం చిన్న 19 kWh బ్యాటరీని నిలివేసి, 24 kWh ని స్టాండర్డ్‌ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా, కొత్తగా 30kWh బ్యాటరీ ప్యాక్‌ను ప్రవేశపెట్టవచ్చు. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 366కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని అంచనా ఉంది. ఇది 50kW కంటే ఎక్కువ వేగంతో కూడిన డీసీ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే అవకాశం ఉంది. 

Also Read:Electric Bike లో క్లచ్‌ పనితీరు ఏంటీ? Honda కొత్త EVలో ఫేక్ క్లచ్ ఇవ్వడానికి కారణమిదే

టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్‌ ద్వారా సంస్థ తన అమ్మకాలను మరింత పెంచుకోవాలని చూస్తోంది. అత్యాధునిక ఫీచర్లు, ధృడమైన భద్రత, ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తున్న ఈ కారు, బడ్జెట్‌ ధరలో ప్రీమియం అనుభూతిని కోరుకునే భారతీయ వినియోగదారులకు కచ్చితంగా ఒక అద్భుతమైన ఎంపిక కానుంది.  

మరిన్ని లేటెస్ట్ ఆటో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Frequently Asked Questions

కొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్‌ ఎప్పుడు విడుదల అవుతుంది?

కొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్‌ మే 28న అధికారికంగా మార్కెట్‌లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది.

టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్‌లో ముఖ్యమైన మార్పులు ఏమిటి?

కొత్త టియాగో మునుపటి కంటే మరింత ఆధునికంగా, షార్ప్‌గా కనిపిస్తుంది. కొత్త అల్‌లాయ్‌ వీల్స్, LED టెయిల్‌ ల్యాంప్స్‌ వంటివి ప్రత్యేక ఆకర్షణ.

ఇంటీరియర్‌లో ఏయే కొత్త ఫీచర్లు వస్తున్నాయి?

10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ వంటివి వస్తున్నాయి. 360 డిగ్రీల కెమెరా కూడా ఉండే అవకాశం ఉంది.

ఫేస్‌లిఫ్ట్‌ టియాగోలో ఇంజిన్‌ ఆప్షన్లు మారతాయా?

ఇది మిడ్ లైఫ్ రిఫ్రెష్‌ కాబట్టి, ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ రెవోట్రాన‌ పెట్రోల్‌ ఇంజిన్‌నే కొనసాగించే అవకాశం ఉంది.

టియాగో.ఈవీ ఫేస్‌లిఫ్ట్‌లో ఏమైనా మార్పులు ఉంటాయా?

కొత్తగా 30kWh బ్యాటరీ ప్యాక్‌ను ప్రవేశపెట్టవచ్చు, ఇది 366 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. DC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్‌ చేసే అవకాశం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

ఖరీదైన కార్లలోనే ADAS ఉంటుందని అనుకుంటున్నారా? మీ బడ్జెట్‌లోనే అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు
ఖరీదైన కార్లకు దీటుగా ADAS ఉన్న 'బడ్జెట్‌ కార్లు'.. రూ.9.39 లక్షలకే సొంతం చేసుకోవచ్చు!
Best selling car: దేశవ్యాప్తంగా జనం ఈ కారు కోసం షోరూమ్‌ ముందు క్యూ కట్టారు, మీ బడ్జెట్‌లోనే వస్తుంది!September 2026 best selling cars in India Maruti Baleno price
సేల్స్‌లో దేశంలోనే నంబర్ 1 ఈ మారుతి కారు.. ధర రూ.6 లక్షల లోపే!
ఎలక్ట్రిక్ కార్లతో జర జాగ్రత్త.. చిన్న పొరపాటుతో భారీ ప్రమాదం! EV వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన భద్రత సూచనలు!
విజయవాడలో నలుగురి ప్రాణాలు తీసిన EV ప్రమాదం! ఎలక్ట్రిక్ కార్లలో మంటలు రాకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget