అన్వేషించండి

Toyota Urban Cruiser Hyryder vs Maruti Suzuki Grand Vitara: టయోటా హైరైడర్‌ వర్సెస్‌ మారుతి గ్రాండ్ విటారా! మధ్యతరగతి వినియోగదారుడికి ఏది ప్రయోజనం? ధర, మైలేజీ, ఫీచర్లపై ఫుల్‌ గైడ్‌ ఇదే!

Toyota Hyryder vs Maruti Grand Vitara: టయోటా హైరైడర్‌, మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నాయి. గ్రాండ్ విటారా కాస్త చౌకైనా, ఫీచర్స్‌ విషయంలో మాత్రం హైరైడర్‌ దూసుకెళ్తోంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రెండు కార్లలో 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD వంటి భద్రతా ఫీచర్లున్నాయి.

Toyota Urban Cruiser Hyryder vs Maruti Suzuki Grand Vitara:దేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ఒకే ప్లాట్‌ఫామ్‌, ఒకే ఇంజన్ సామర్థ్యం కలిగి ఉండి కూడా టయోటా, మారుతి సుజుకి సంస్థలు తమదైన బ్రాండ్ విలువలతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. టయోటా నుంచి వచ్చిన అర్బన్ క్రూయిజర్‌ హైరైడర్‌, మారుతి సుజుకి నుంచి వచ్చిన గ్రాండ్ విటారా మధ్య ఉన్న స్వల్ప తేడాలు గమనించడం వినియోగదారులకు చాలా అవసరం. 

ధరలో వ్యత్యాసం ఎంత?

కొనుగోలుదారుడు మొదట గమనించేది ధర. మారుతి సుజుకి గ్రాండ్ విటారా బేసిక్ వేరియెంట్ ప్రారంభ ధర 10. 77 లక్షల రూపాయలు. అదే టయోటా హైరైడర్‌ ప్రారంభ ధర 10.99 లక్షల రుపాయలు. ఇక్కడ గ్రాండ్ విటారా తన ప్రత్యర్థి అంటే సుమారు 22 వేల రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. 

Also Read: ఎంజీ కామెట్‌ ఈవీ వర్సెస్‌ టాటా టియాగో ఈవీ! సామాన్యుడికి ఏది లాభదాయకం?

టెక్నికల్‌గా ఎవరు తోపులు 

సాంకేతికంగా రెండు కార్లు ఒకే రకమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. రెండింటిలోనూ 1462 cc, 4 సిలిండర్ల ఇంజన్ అమర్చారు. రెండు మోడళ్లు కూడా 6000 rpm వద్ద bhp శక్తిని ఉత్పత్తి చేస్తాయి. టార్క్‌లో మాత్రం స్వల్ప మార్పులు ఉన్నాయి. గ్రాండ్ విటారా 139Nm టార్క్‌ను అందిస్తే, హైరైడర్‌ 136.8nM టార్గ్‌ను ఇస్తుంది. బేస్ వేరియంట్లు రెండూ 5 గేర్ల మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తున్నాయి. 

మైలైజీలో రారాజు ఎవరు

మైలేజీ విషయంలో రెండు కార్లు పోటాపోటీగా ఉన్నాయి. ఏఆర్‌ఏఐ లెక్కల ప్రకారం రెండు కారక్లు లీటర్‌కు 21.11 కిలోమీటర్ల మైలేజీని అందిస్తున్నాయి. హైరైడర్‌ వినియోగదారులు లీటర్‌కు 24 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని చెబుతుంటే గ్రాండ్ విటారా 19 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని రివ్యూల్లో చెబుతున్నారు. ఇది డ్రైవింగ్ శైలి, రోడ్ పరిస్థితి, ట్రాఫిక్ అన్నింటిపై ఆధారపడి ఉంటుంది. 

స్పేస్‌లో వ్యత్యాసం ఏంటీ?

పొడవు విషయానికి వస్తే హైరైడర్‌ 4365mm, గ్రాండ్ విటారా 4345mm పొడవు కలిగి ఉంది. రెండింటి మధ్య 20mm తేడా ఉంది. వీల్‌బేస్‌ రెండింటిలో కూడా 2600mm ఉండటం వల్ల లోపల తగినంత స్పేస్‌ లభిస్తుంది. ప్రయాణాల్లో సామాన్లు ఉంచుకోవడానికి రెండు కార్లలోనూ 373 లీటర్ల బూట్ స్పేస్ అందుబాటులో ఉంది. 

Also Read: ఫుల్ ట్యాంక్‌తో 1000 కి.మీ రేంజ్.. మోడ్రన్ ఫీచర్లతో విడుదల కానున్న హోండా SUV

లోపలి భాగాన్ని పరిశీలిస్తే మారుతి గ్రాండ్ విటారా సిల్వర్ యాక్సెంట్లతో కూడిన బ్లాక్, బోర్డియక్స్‌ డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌ను కలిగి ఉండగా, టయోటా హైరైడర్‌ బేస్‌ వేరియంట్‌ సింగిల్ టోన్ బ్లాక్‌ ఇంటీరియర్‌తో వస్తుంది. హైరైడర్‌లో ఉన్న ఒక ప్రత్యేక సౌకర్యం ఏంటంటే ఇందులో PM 2.5 ఎయిర్ ప్యూరిఫైయర్ అమర్చి ఉంది. ఇది కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉపయోగకరంగా ఉంటుంది. రెండు కార్లలోనూ డీఆర్‌ఎల్‌ఈడీ టెయి్‌లైట్లు, హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

ఏ వాహనం సెక్యూర్డ్‌

భద్రత విషయంలో రెండు సంస్థలు రాజీ పడలేదు. 6 ఎయిర్‌ బ్యాగ్‌లు రెండింటీలో ఉన్నాయి. ఏబీఎస్‌, ఈబీడీ, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌, హిల్ హోల్డ్‌ కంట్రోల్ వంటి ఫీచర్లు ప్రాయాణాన్ని సురక్షితం చేస్తాయి. ఇరు వాహనాలకు నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. 

ఏ కారుకు ఎంత ఈఎంఐ చెల్లించాలి?

ఈ కార్లను ఫైనాన్స్‌లో కొనుగోలు చేయాలనుకునే వారికి ఐదేళ్ల కాలపరిమితికి లోన్ సౌకర్యం ఉంటుంది. హైరైడర్‌ నెలకు సుమారు 21, 015 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. గ్రాండ్ విటారా కొనాలని చూస్తే సుమారు 20, 585 ఈఎంఐ చెల్లించాలి. 

Also Read: ఎంజీ కామెట్ వైజాగ్‌లో కొనాలి అంటే ఎంత EMI చెల్లించాలి? డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?

మీకు తక్కువ ధరలో మంచి బ్రాండ్ విలువ, విభిన్నమైన డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ కావాలనుకుంటే మారుతి గ్రాండ్ విటారా సరైన ఎంపిక. టయోటా గ్లోబల్ విశ్వసనీయత, ఎయిర్ ఫ్యూరిఫైయర్‌ వంటి అదనపు ఫీచర్లు, మెరుగైన యూజర్ రిపోర్ట్ మైలేజీ కావాలునుకుంటే హైరైడర్‌ వైపు మొగ్గు చూపవచ్చు. 

Frequently Asked Questions

భద్రత విషయంలో ఈ రెండు కార్లు ఎలా ఉన్నాయి?

రెండు కార్లలోనూ 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్స్ కూడా అందించారు.

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌లో భలే అప్‌డేట్స్‌.. వెనుక సీట్‌లో కూర్చున్నవాళ్లకు మంచి మసాజ్‌!
2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌.. కొత్త ఫీచర్లతో అదరగొడుతున్న సెడాన్! బుకింగ్స్‌ ప్రారంభం
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?

వీడియోలు

Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget