అన్వేషించండి

Maruti Suzuki: ఈవీల నుంచి ఫైవ్ స్టార్ సేఫ్టీ వరకు మారుతి సుజుకి ప్రస్తుతం అమ్ముతున్న వెహికల్స్ లిస్ట్ ఇదే!

Maruti Suzuki: భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి 2026 నాటికి తన వ్యాపార శైలని పూర్తిగా మార్చుకుంది. బడ్జెట్ కార్లకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఈవీలోకి కూడా అడుగు పెట్టింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అరీనా, నెక్సా నెట్వర్క్లతో విభిన్న కస్టమర్లకు కార్లను అందిస్తోంది.

Maruti Suzuki: భారత్‌లో మారుతీ సుజుకి అనే పేరు ఒక నమ్మకం. దశాబ్దాలుగా మధ్య తరగతి ప్రజల కలల సాకారం చేస్తున్న ఈ సంస్థ 2026 మార్చి నాటికి సాంకేతిక, భద్రత విషయంలో భారీ మార్పులను స్వీకరించింది. ప్రస్తుతం మారుతీ సుజుకి భారత్ మార్కెట్‌లో 19 మోడళ్లను విక్రయిస్తోంది. ఇందులో హ్యాచ్‌బ్యాక్‌లు, SUVలు, MUVలు, సెడాన్‌లు ఉన్నాయి. 

మారుతీ ఈ విటారాతో ఎలక్ట్రిక్‌ రంగంలోకి అడుగు

మారుతీ సుజుకి చరిత్రలో 2026 ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది. ఫిబ్రవరి 17న కంపెనీ తన మొదటి ఈవీ ఈ విటారాను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర 10.99 లక్షలుగా నిర్ణయించారు. ఈ వాహనాన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 440 నుంచి 543 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఇది మార్కెట్‌లో హ్యూందాయ్‌ క్రెటా ఎలక్ట్రిక్‌, ఎంజీ ZS, మహీంద్రా బీఈ6 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది. 

5 స్టార్ రేటింగ్ సాధించిన మోడళ్లు 

ఒకప్పుడు భద్రత విషయంలో విమర్శలు ఎదుర్కొన్న మారుతీ, ఇప్పుడు ఆ అపవాద చెరిపేసుకుంది. గత సెప్టెంబర్‌లో విడుదలైన మారుతి విక్టోరిస్‌ ఎస్‌యూవీ గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌, భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించింది. దీని ధర 10.50 లక్షల నుంచి 19.99 లక్షల వరకు ఉంది. 

సరికొత్త తరం డిజైన్ మోడల్ మారుతి డిజైర్‌ పెద్దల భద్రతలో ఫైవ్‌స్టార్, చిన్నారుల భద్రతల విషయంలో ఫోర్‌ స్టార్ రేటింగ్ పొందింది. 12 మే 2025 నుంచి మారుతి తన ఆరీనా నెట్‌వర్క్ పరిధిలోని అన్ని కార్రలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను కచ్చితంగా ఇస్తోంది. 

అరీనా, నెక్సా రెండు విభిన్న ప్రపంచాలు 

మారుతీ సుజుకి తన వినియోగదారులను రెండు విభిన్న రిటైల్ నెట్‌వర్క్‌ల ద్వాార చేరుకుంటోంది. మారుతీ సుజుకీ అరీనా ప్రధానంగా బడ్జెట్‌ , మధ్య తరగతి కొనుగోలుదారులను టార్గెట్ చేసింది. ప్రస్తుతం ఇందులో పది మోడళ్లు ఉన్నాయి. ఆల్టో కే 10, ఎస్‌ప్రెస్స వ్యాగన్ ఆర్, సెలెరియో, స్విప్ఠ్, డిజైర్‌, బ్రెజ్జా, ఈకో, ఎర్టిగా కొత్త విక్టోరిస్. ప్రస్తుతం మారుతీలో అత్యంత చౌకైన ధర కలిగింది ఎస్‌ ప్రెస్సో, దీని ర 3.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మైలేజీ కోరుకునే వారికి  ఆల్టో కే10 సీఎన్జీ 4.81 లక్షల ధరతో అందుబాటులో ఉంది. 

ప్రీమియం అనుభవాన్ని కోరుకునే వాళ్లకు నెక్సా నెట్‌వర్క్ పని చేస్తుంది. ఇందులో ఇగ్నిస్, బలెనో, ఫ్రాంక్స్, ఎక్స్‌ఎల్‌ 6, జిమ్మి, గ్రాండ్ విటారా, ఇన్విక్టో వంటి ఏడు మోడళ్లు ఉన్నాయి. ఇందులో అత్యంత ఖరీదనదిగా ఇన్విక్టో ఉంది. దీని ధర 24. 97 నుంచి 28. 6 లక్షల వరకు ఉంటుంది. 

2026 మార్చి ఎక్స్ షోరూమ్‌ ధరల ప్రకారం 

మోడల్‌  ధర 
ఆల్టో K10 ₹3.70 - ₹5.45
వ్యాగన్ ఆర్ ₹4.99 - ₹6.84
స్విఫ్ట్ ₹5.79 - ₹8.65
బలెనో ₹5.99 - ₹9.10
బ్రెజ్జా ₹8.26 - ₹12.86
గ్రాండ్ విటారా ₹10.77 - ₹19.64
జిమ్నీ ₹12.31 - ₹14.29

 టెక్నాలజీ- పనితీరులో మారుతీ వ్యూహం 

మారుతీ సుజుకీ కేవలం పెట్లోల్ ఇంజినన్లకే పరిమితం కాకుండా హైబ్రీడ్‌, సీఎన్జీ విభాగాల్లోనూ అగ్రగామిగా ఉంది. స్ట్రాంగ్ హైబ్రీడ్‌ విభాగంలో విక్టోరిస్‌, గ్రాండ్ విటారా ఉన్నాయి. ఇవీ లీటర్‌కు 25-28 కిలోమీటర్ల మైలేజీ ఇస్తున్నాయి. 

నిపుణుల సూచనలు 

మారుతి కార్ల ఎంపికలో కస్టమర్లు తమ అవసరాలను అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సిటీ డ్రైవింగ్ కోసం ఫ్రాంక్స్ ఏఎంటీ, స్విఫ్ట్ మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు. కుటుంబ అవసరాల కోసం బడ్జెట్‌లో ఎర్టిగా, ప్రీమియం కావాలనుకుంటే ఎక్స్‌ఎల్ 6, ఇన్విక్టోను ట్రై చేయవచ్చు. మౌంటైన్ రైడ్స్, హార్ట్ రోడ్ల కోసం జిమ్మి మంచిదని చెబుతున్నారు. 

Frequently Asked Questions

మారుతీ సుజుకి వినియోగదారులను ఏ రెండు రిటైల్ నెట్వర్క్ల ద్వారా చేరుకుంటోంది?

మారుతీ సుజుకి తమ వినియోగదారులను రెండు విభిన్న రిటైల్ నెట్వర్క్ల ద్వారా చేరుకుంటోంది: అరీనా (బడ్జెట్, మధ్య తరగతి కొనుగోలుదారుల కోసం) మరియు నెక్సా (ప్రీమియం అనుభవం కోరుకునే వారి కోసం).

టాప్ హెడ్ లైన్స్

Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Ethanol EV Charger: ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
ఫుల్ ఛార్జ్‌పై 421 కి.మీ రేంజ్.. Tata Punch EVపై రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్
ఫుల్ ఛార్జ్‌పై 421 కి.మీ రేంజ్.. Tata Punch EVపై రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్
Tata Curvv EVలో ప్లస్‌ పాయింట్లతో పాటు కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయి! కొనే ముందు ఓసారి ఆలోచించండి
Tata Curvv EV కొనడం తెలివైన పనేనా? ఈ కారులో ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి?

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Embed widget