అన్వేషించండి

Honda Activa February Sales: స్కూటర్ల అమ్మకాల్లో హోండా యాక్టివా జోరు – ఫిబ్రవరి 2026 టాప్ మోడల్స్ ఇవే!

Honda Activa February Sales: ఇండియాలో స్కూటర్లకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఫిబ్రవరి 2026 సేల్స్ రిపోర్ట్ ప్రకారం హోండా యాక్టివా మరోసారి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఫిబ్రవరి 2026లో హోండా యాక్టివా 2,54,449 యూనిట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
  • టీవీఎస్ జూపిటర్ 1,27,089 యూనిట్లతో రెండో స్థానం, సుజుకి యాక్సెస్ 70,137 యూనిట్లతో మూడో స్థానం.
  • టీవీఎస్ ఐక్యూబ్ 38,054 యూనిట్లతో ఎలక్ట్రిక్ విభాగంలో దూసుకుపోయింది.
  • టీవీఎస్ ఎన్‌టార్క్ 125 31,955 యూనిట్లతో యువతను ఆకట్టుకుంది.

Honda Activa February Sales: సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఇండియ‌న్ మార్కెట్లో స్కూటర్లకు భారీ డిమాండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఫిబ్రవరి 2026 నెలలో ఐదు మోడళ్లు కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ లిస్టులో ఉన్న స్కూటర్ల వివరాలు ఒకసారి పరిశీలిద్దాం.

హోండా యాక్టివా (Honda Activa)

స్కూటర్ల సెగ్మెంట్‌లో హోండా యాక్టివా తన మెరుగైన‌ రికార్డును కొనసాగిస్తోంది. ఫిబ్రవరి 2026లో ఏకంగా 2,54,449 యూనిట్ల విక్రయాలతో యాక్టివా అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో యాక్టివా 110 సీసీ, 125 సీసీ మోడళ్లు ఉన్నాయి. గత ఏడాది ఫిబ్రవరి (1,74,009 యూనిట్లు) తో పోలిస్తే అమ్మకాలు భారీగా పెరిగాయి. నమ్మకమైన ఇంజిన్, తక్కువ మెయింటెనెన్స్, సింపుల్ లుక్ దీని విజయానికి ప్రధాన కారణం.

టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter)

అమ్మకాల్లో రెండో స్థానాన్ని టీవీఎస్ జూపిటర్ దక్కించుకుంది. ఫిబ్రవరి 2026లో 1,27,089 యూనిట్లు అమ్ముడయ్యాయి. జూపిటర్ 110, 125 వేరియంట్లు కస్టమర్లకు మంచి కంఫర్ట్, మైలేజీని అందిస్తాయి. గత ఏడాదితో పోలిస్తే సేల్స్ 22.7 శాతం వృద్ధి చెందాయి. కానీ జనవరితో పోలిస్తే అమ్మకాలు స్వల్పంగా 2.04 శాతం తగ్గాయి.

సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125)

రిఫైన్డ్ ఇంజిన్, అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో సుజుకి యాక్సెస్ 125 మూడో స్థానంలో ఉంది. ఈ మోడల్ ఫిబ్రవరిలో 70,137 యూనిట్ల విక్రయాలను సాధించింది. జనవరిలో 69,042 యూనిట్లు అమ్ముడవగా, ఈ నెలలో స్వల్ప పురోగతి కనిపించింది. క్లాసిక్ స్టైలింగ్ ఇష్టపడే వారికి ఇది ఫేవరెట్ ఛాయిస్.

టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)

ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్ దూసుకుపోతోంది. ఫిబ్రవరి 2026లో 38,054 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో ఐక్యూబ్, ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ ఎస్టీ అనే మూడు వేరియంట్లు ఉన్నాయి. గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే అమ్మకాల్లో 61.3 శాతం భారీ పెరుగుదల నమోదైంది. ఈవీ రంగంలో టీవీఎస్ తన పట్టును బలపరుచుకుంటోంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 (TVS Ntorq 125)

స్పోర్టీ లుక్, పవర్‌ఫుల్ ఎగ్జాస్ట్ సౌండ్‌తో యువతను ఆకట్టుకునే టీవీఎస్ ఎన్‌టార్క్ ఐదో స్థానంలో నిలిచింది. ఫిబ్రవరిలో 31,955 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 52.2 శాతం ఇంప్రూవ్‌మెంట్ కనిపించినా, జనవరి నెలతో పోలిస్తే సేల్స్ 12.6 శాతం మేర తగ్గాయి. స్పోర్టీ రైడింగ్ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Frequently Asked Questions

ఫిబ్రవరి 2026లో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్ ఏది?

ఫిబ్రవరి 2026లో హోండా యాక్టివా అత్యధికంగా 2,54,449 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచింది.

టీవీఎస్ జూపిటర్ అమ్మకాలు ఎలా ఉన్నాయి?

ఫిబ్రవరి 2026లో టీవీఎస్ జూపిటర్ 1,27,089 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 22.7 శాతం పెరిగాయి.

ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది ముందుంది?

ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్ దూసుకుపోతోంది. ఫిబ్రవరి 2026లో 38,054 యూనిట్లు అమ్ముడయ్యాయి, గత ఏడాదితో పోలిస్తే 61.3 శాతం పెరుగుదల నమోదైంది.

సుజుకి యాక్సెస్ 125 అమ్మకాలు మరియు దీని ప్రత్యేకతలు ఏమిటి?

సుజుకి యాక్సెస్ 125 ఫిబ్రవరిలో 70,137 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో ఉంది. దీని రిఫైన్డ్ ఇంజిన్, పర్ఫార్మెన్స్, మరియు క్లాసిక్ స్టైలింగ్ దీని ప్రత్యేకతలు.

టాప్ హెడ్ లైన్స్

లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు
పెట్రోల్‌కు బలెనో.. CNGకి డిజైర్.. EVల్లో విండ్సర్ - 2026లో టాప్ సెల్లింగ్‌ కార్లు ఇవే!
టాటా నెక్సాన్ కామో ఎడిషన్‌లో ఆశ్చర్యపరిచే మార్పులు.. కొత్త రంగులు, 12.3 అంగుళాల స్క్రీన్, మరెన్నో!
టాటా నెక్సాన్‌ కామో ఎడిషన్ లాంచ్ - రూ.9.99 లక్షలే! ఏంటి దీని స్పెషాలిటీ?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Embed widget