అన్వేషించండి

Fortuner Price Hike: టయోటా ఫార్చ్యూనర్ SUV ధరల్లో పెరుగుదల! కొత్త టెక్నాలజీతో మార్పులు!

Toyota Fortuner SUV Price Hike:టయోటా ఫార్చ్యూనర్ ధరలను భారీగా పెంచేసింది. సెలెక్టెడ్‌ వేరియెంట్స్‌ ఇప్పుడు కొనాలంటే రూ. 36.05 లక్షల నుంచి రూ. 52.34 లక్షల వరకు ఖర్చు పెట్టాలి.

Toyota Fortuner SUV Price Hike:టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తన SUV టయోటా ఫార్చ్యూనర్‌ ధరలను మరోసారి పెంచింది. ఇవాళ్టి (జూన్ 9, 2025) నుంచి ఈ ధరలు అమలులోకి వచ్చాయి. ఎంపిక చేసిన వేరియెంట్స్‌లో మాత్రమే ఈ ధరలు పెంచుతున్నట్టు సంస్థ ప్రకటించింది. హై ఎండ్‌ సెక్యూరిటీ, పవర్‌ఫుల్ ఇంజిన్, సౌకర్యవంతమైన ప్రయాణం ఇష్టపడేవాళ్లంతా ఎక్కువగా మొగ్గు చూపేది ఫార్చ్యూనర్ SUVవైపే. అందుకే భారతీయ మార్కెట్‌లో ఈ కార్లకు ప్రత్యేక స్థానం ఉంది. 

ఫార్చ్యూనర్ SUV ధర ఎంత పెరిగింది?
టయోటా ఫార్చ్యూనర్‌లో ఎంపిక చేసిన వేరియంట్ల ధరలను మాత్రమే టయోటా పెంచింది. ఈ మధ్యే ఆ సంస్థ నుంచి మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్ విడుదలైంది. ధరలు పెరుగుదలకు ఇదే కారణమని సంస్థ చెబుతోంది. ఫార్చ్యూనర్ 4x2 పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్‌పై 68,000 రూపాయలు పెరుగింది. 4x2 డీజల్ మాన్యువల్, 4x2 డీజల్ ఆటోమేటిక్, 4x4 డీజల్ మాన్యువల్, GR-S పెర్ఫార్మెన్స్ వేరియంట్, లెజెండర్ వేరియంట్‌లు (4x4 డీజల్ మాన్యువల్ అండ్‌ 4x4 డీజల్ ఆటోమేటిక్) రూ. 40,000 చొప్పున పెంచింది. ఇప్పుడు చెప్పినవి కేవలం ఎక్స్-షోరూ ధరలు మాత్రమే. రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఫీజులు కలిపితే ఈ కారు కొనుగోలు ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫార్చ్యూనర్ ధరలు రూ. 36.05 లక్షల నుంచి రూ. 52.34 లక్షల మధ్య ఉన్నాయి.  

ధరలు పెంచడానికి కారణం ఏంటీ?
కొత్తగా అప్‌డేట్ చేసిన మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ వేరియంట్‌ కోసం ధరలు పెంచుతున్నట్టు టయోటా ప్రకటించింది. ఈ కొత్త వేరియంట్‌లో 2.8-లీటర్ టర్బో-డీజల్ ఇంజిన్‌తో 48-వోల్ట్ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. ఇది మైలేజ్‌ పెంచేందుకు దోహదపడుతుంది. మరిన్ని ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ సిస్టమ్ కోసం టయోటా డిజైన్, తయారీపై ఎక్కువ దృష్టి పెట్టింది. డబ్బులు కూడా ఖర్చు పెట్టింది. అందుకే ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వీటితోపాటు ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న తీరును కూడా టయోటా వివరించింది. ఎక్కువ ధర పెడుతున్న వినియోగదారులు కచ్చితంగా అందుకు తగ్గ సౌకర్యం అందుతుందని టయోటా కంపెనీ ప్రకటించింది. వారి డబ్బులకు పూర్తి న్యాయం జరుగుతుందని అభిప్రాయపడుతోంది.  

కొత్త ధరల లిస్ట్ ఇదే
కొత్తగా పెరిగిన ధరలతో కలుపుకుంటే ఫార్చ్యూనర్‌ వాహనల ధరలు ఇలా మారాయి 

4x2 పెట్రోల్ ఆటోమేటిక్ వాహనం ధర: రూ. 68,000 పెరిగి ధర రూ. 36.73 లక్షల నుంచి మొదలు కానుంది.  

4x2 డీజల్ మాన్యువల్: ఈ వాహనంపై రూ. 40,000 పెరిగింది. దీంతో ఈ వాహనం కొనాలంటే రూ. 37.13 లక్షలు ఖర్చు పెట్టాలి. 

4x2 డీజల్ ఆటోమేటిక్: దీనిపై కూడా రూ. 40,000 టయోటా పెంచింది. దీంతో ఈ వాహనం కొనాలంటే  రూ. 39.54 లక్షలు చెల్లించాలి. 

4x4 డీజల్ మాన్యువల్: దీనిపై కూడా రూ. 40,000 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ వాహనం కొనాలంటే రూ. 42.89 లక్షలు మీ చేతిలో ఉండాలి. 

GR-S పెర్ఫార్మెన్స్: ఈ బండిపై కూడా రూ. 40,000 పెంచడంతో ధర రూ. 52.34 లక్షలకు చేరింది. 

లెజెండర్ 4x4 డీజల్ మాన్యువల్: దీనిపై కూడా రూ. 40,000 పెంచారు. ఫలితంగా ఈ వాహనం కొనుగోలుకు రూ. 50.09 లక్షలు ఖర్చు చేయాలి. 

లెజెండర్ 4x4 డీజల్ ఆటోమేటిక్: దీనిపై కూడా రూ. 40,000 పెరగడంతో రూ. 51.44 లక్షలు చెల్లించాలి. 

ఇప్పుడు చెప్పిన ధరుల అన్నీ కూడా ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. మీరు వాహనం కొనుగోలు చేస్తే రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఫీజులు కలుపుతారు. ఆయా రాష్ట్రాల రూల్స ప్రకారం ఇవి మారుతూ ఉంటాయి. వీటిపై పూర్తి వివరాలు కావాలంటే మీకు దగ్గరలోని టయోటా డీలర్‌ను అడిగితే పూర్తి సమాచారం మీకు అందిస్తారు.  

ఇంధన ఎఫిషియన్సీ, ఫీచర్లు
కొత్త మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్ డీజల్ ఇంజిన్‌తో వస్తుంది, ఇది 14.2 నుంచి 14.4 కి.మీ./లీటర్ మైలేజ్ ఇస్తుంది. ఇది పెట్రోల్ వేరియంట్‌ల కన్నా ఎక్కువ ఇంధన ఆదా కలిగిస్తుంది. పెట్రోల్ వేరియంట్ 10.3 కి.మీ. మాత్రమే మైలేజీ ఇస్తుంది. ఈ కొత్త వేరియంట్‌లో 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు కలిగి ఉంది. ఇవి డ్రైవింగ్‌ను మరింత సౌకర్యలవంతం చేస్తాయి. సెక్యూరిటీ ఫీచర్స్‌ను పెంచారు.  అందుకే ధర పెరిగిందని కంపెనీ చెబుతోంది.  

టాప్ హెడ్ లైన్స్

Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు
కేవలం రూ.10,000 మీ దగ్గర ఉంటే చాలు, రూ.2 లక్షల Yamaha R2 మీ సొంతం!
Mahindra XUV700 Price on Road: మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు
రూ.1.10 లక్షలకే ఆంపియర్‌ మాగ్నస్‌ G మ్యాక్స్‌.. ఇంతకుముందులా లేదు, 30కి పైగా కొత్త ఫీచర్లు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
Embed widget