అన్వేషించండి

Car Tyre Puncture Tips: కారు టైర్ పంక్చర్ అయితే కంగారు పడకండి! మీరే రిపేర్ చేసుకోవడానికి సులభమైన చిట్కాలు

Car Tyre Puncture Fixing Tips: మీ కారు టైర్ పంక్చర్ అయిందా? భయపడకండి. మెకానిక్‌తో అవసరం లేకుండా, మీరే ఈజీగా టైర్ పంక్చర్‌ సమస్యను పరిష్కరించే వీలుంది.

Punctured Car Tyre Fixing Tips: కారు టైర్ పంక్చర్ కావడం సాధారణమైన విషయమే అయినప్పటికీ, అత్యవసర పరిస్థితుల్లో టైర్‌ పంక్చర్‌ అయితే ఇక ఆ టెన్షన్‌ వర్ణనాతీతం. ప్రయాణ సమయంలో, ఊరికి దూరంగా ఉన్నప్పుడు ఈ సమస్య వస్తే కంగారు పడడం సహజం. ఆ సమయంలో మీ టెన్షన్‌ తీసి గట్టు మీద పెడితే, మీరే స్వయంగా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. దీనికోసం మీకు కొన్ని పరికరాలు సాధనాలు, కొంత జ్ఞానం, కొద్దిపాటి సాధన అవసరం. తద్వారా, టైరు పంక్చర్‌ను నిమిషాల్లో సరిచేయవచ్చు..

కారును సురక్షిత స్థలంలో పార్క్ చేయండి
ప్రయాణంలో ఉన్న సమయంలో టైర్ పంక్చర్ అయితే, మొదట చేయవలసిన పని - మీ కారును ట్రాఫిక్ నుంచి దూరంగా సురక్షితమైన & చదునైన ప్రదేశానికి తీసుకెళ్లడం. అనుకూల ప్రాంతానికి చేరుకున్న తర్వాత హ్యాండ్‌బ్రేక్‌ వేయండి. ఇతర వాహనాలను హెచ్చరించేలా హజార్డ్‌ లైట్స్‌ ఆన్ చేయండి. వీలైతే మీ వాహనం చుట్టూ హెచ్చరిక సంకేతాలు ఏర్పాటు చేయండి. 

పంక్చర్ రిపేర్ చేయడానికి అవసరమైన సాధనాలు
పంక్చర్‌ రిపేర్ చేయడానికి.. జాక్, లగ్ రెంచ్ (నట్‌లు తెరవడానికి), స్పేర్ టైర్ & రబ్బరు ప్యాచ్‌లు, గ్లూ లేదా రబ్బర్‌ సిమెంట్‌, శాండ్‌ పేపర్‌తో కూడిన టైర్ రిపేర్ కిట్ & ట్యూబ్‌లెస్ టైర్‌ల కోసం రబ్బరు స్ట్రిప్‌లు వంటి కొన్ని ముఖ్యమైన సాధనాలు అవసరం. టైర్ ప్రెజర్ గేజ్ & టైర్ ఇన్‌ఫ్లేటర్ (టైర్ పంప్) కూడా ఉండాలి. ఈ సాధనాలన్నింటినీ ఎల్లప్పుడూ కారులో ఒక చిన్న బ్యాగ్‌లో దగ్గర పెట్టుకోవడం మంచిది, తద్వారా అత్యవసర పరిస్థితుల్లో మీకు చాలా ఉపయోగపడతాయి.

పంక్చర్‌ స్పాట్‌ గుర్తించండి
టైరును వేరు చేయడానికి, ముందుగా జాక్‌ను ఉపయోగించి కారును జాగ్రత్తగా పైకి ఎత్తండి. జాక్‌ ఉపయోగించే ముందు, అది కారు చాసిస్ పాయింట్ కిందే ఉండేలా చూసుకోండి. ఆ తర్వాత, లగ్ రెంచ్ తో టైర్ నట్స్ తెరిచి టైరును కారు నుంచి వేరు చేయండి. ఇప్పుడు టైరు నుంచి గాలి పూర్తిగా తీసేసి, ట్యూబ్‌ను వేరు చేయండి. ఇప్పుడు మళ్లీ ట్యూబ్‌లో గాలి కొట్టి, నీటిలో ముంచడం ద్వారా లేదా దానిపై సబ్బు నీళ్లు చల్లడం ద్వారా పంక్చర్ పడిన ప్రదేశాన్ని కనిపెట్టవచ్చు. ట్యూబ్‌ను నీటిలో ముంచినప్పుడు లేదా నీళ్లు చల్లినప్పుడు ఎక్కడ బుడగలు వస్తే అదే పంక్చర్ స్పాట్. ఆ స్పాట్ ను మార్కర్ లేదా సుద్దతో మార్క్‌ చేయండి.

పంక్చర్‌ రిపేర్
ఇప్పుడు, ట్యూబ్‌ నుంచి గాలి తీసేసి, పంక్చర్‌ గుర్తించిన ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేసి ఆరబెట్టండి. తర్వాత ఆ ప్రాంతాన్ని శాండ్‌ పేపర్‌తో పైపైన రుద్దండి, తద్వారా ప్యాచ్ బాగా అంటుకుంటుంది. ఆ ప్రదేశంలో రబ్బరు సిమెంట్ లేదా గ్లూ పూయండి & రబ్బరు ప్యాచ్‌ను దానిపై గట్టిగా అతికించండి. ప్యాచ్‌ను కొన్ని నిమిషాలు ఆరనివ్వండి. ఆ తర్వాత ట్యూబ్‌ను తిరిగి టైరులోకి ఎక్కించి గాలితో నింపండి. మీ బండి టైర్ ట్యూబ్‌లెస్‌ అయితే, రబ్బరు స్ట్రిప్‌ను పంక్చర్ స్పాట్‌ లోపలికి చొప్పించండి. చాలా కొద్దిపాటి సాధనతో, ఈ ప్రక్రియ చాలా సులభంగా అలవడుతుంది. 

టైర్‌ను బిగించి, పరిశీలించండి
మరమ్మత్తు పూర్తయిన తర్వాత ఆ టైర్‌ను తిరిగి రిమ్‌పై ఉంచి నట్‌లను సరిగ్గా బిగించండి. ఆ తర్వాత జాక్‌ తీసేసి కారును కిందకు దించండి. ఇప్పుడు, టైర్ ప్రెజర్ గేజ్‌తో గాలి పీడనాన్ని చెక్‌ చేయండి & అవసరమైతే టైర్ పంపుతో మళ్లీ గాలిని నింపండి. ఆ తర్వాత కారును కొద్ది దూరం నడపండి & టైర్‌లో ఇంకెక్కడి నుంచయినా గాలి బయటకు పోతుందేమో చూసుకోండి. ఇంతే, మీ కార్‌ టైర్‌ పంక్చర్‌ ప్రాబ్లెమ్‌ను ఎవరి సాయం లేకుండా మీరే సాల్వ్‌ చేయవచ్చు. మీకు అలవాటైతే, ఈ ప్రక్రియ మొత్తాన్ని నిమిషాల్లోనే పూర్తి చేయొచ్చు.

అత్యవసర పరిస్థితుల్లో మీరు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే మీ కారు ఎప్పుడూ స్పేర్ టైర్ & అవసరమైన పనిముట్లను ఉంచుకోండి. రాత్రి సమయంలో లేదా హైవేలో టైర్ పంక్చర్ అయితే ఎక్కువ జాగ్రత్తగా ఉండండి & టార్చ్ లేదా ఫ్లాష్‌లైట్‌ను మీతో ఉంచుకోండి.

టాప్ హెడ్ లైన్స్

కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?
Ducati Monster V2 vs Triumph Street Triple 765 RS - 111hp vs 130hp.. ధర, పవర్, టార్క్‌లో ఏది బెస్ట్?
ట్రయంఫ్‌ స్ట్రీట్‌ ట్రిపుల్‌ 765 RS vs డుకాటి మాన్‌స్టర్‌ V2 - రేటు రూ.1 లక్ష తక్కువైనా 'పవర్‌'లో అదరగొడుతోంది!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget