అన్వేషించండి

Bikes With ABS Feature: 1 లక్ష రూపాయల బడ్జెట్‌లోనే ABS ఫీచర్‌ - ఇండియాలో టాప్ 5 సేఫ్టీ బైక్‌లు ఇవే

Affordable Bikes With ABS: తక్కువ బడ్జెట్‌లో సురక్షితమైన బైక్ కోసం చూస్తుంటే, ABS టెక్నాలజీతో మీ కోసం కొన్ని గొప్ప ఆప్షన్లు సిద్ధంగా ఉన్నాయి.

Top 5 Safety Bikes In India In 2025: వాహన రంగంలో వేగంగా మారుతున్న సాంకేతికత కారణంగా, ఇప్పుడు బైక్‌ల్లోనూ అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు కనిపిస్తున్నాయి. రైడర్‌ సేఫ్టీని స్పెషల్‌గా పరిగణనలోకి తీసుకుని, ఇప్పుడు బడ్జెట్ రేంజ్‌ బైక్‌ల్లో కూడా సింగిల్-ఛానల్ ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) సాంకేతికతను యాడ్‌ చేస్తున్నారు. ఈ టెక్నాలజీ, కీలక సమయాల్లో ముందు చక్రం లాక్ అవ్వకుండా కాపాడుతుంది, తద్వారా బ్రేకులు వేసినప్పుడు బైక్‌ను జారిపోదు. ఈ వ్యవస్థ అటు0 రైడర్‌ను, ఇటు బండినీ కాపాడుతుంది & సురక్షితమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

ఇప్పుడు రూ. 1 లక్ష లోపు బడ్జెట్‌లోనూ సురక్షితమైన & సూపర్‌ పెర్ఫార్మ్‌ చేసే బైక్‌లు మార్కెట్‌లో ఉన్నాయి. భారతదేశంలోని టాప్ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ ABS బైక్‌లు ఇవే...

1. Bajaj Pulsar NS125
బజాజ్‌ కంపెనీ లాంచ్‌ చేసిన చవకైన ABS-ఎక్విప్డ్ బైక్‌ బజాజ్ పల్సర్ NS125. ఇది 124.45 cc 4-వాల్వ్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ ఇంజిన్‌ 11.8 bhp పవర్ & 11 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ మోటర్‌ సైకిల్‌లో 5-స్పీడ్ గేర్‌ బాక్స్, 17-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు & 240 mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో CBS (కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్) కూడా ఉన్నాయి. స్టైలిష్ డిజైన్ & బెటర్‌ బ్రేకింగ్ కారణంగా ఇది ఈ లిస్ట్‌లో ఫస్ట్‌ ప్లేస్‌లోకి వచ్చింది.

2. Hero Xtreme 125R (Single Seat)  
హీరో ఎక్స్‌ట్రీమ్ 125R కొత్త & అట్రాక్టివ్‌ ప్రొడక్ట్‌. ఇది 124.7cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో 11.4 bhp పవర్ & 10.5 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. 276mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్ & 130mm రియర్‌ డ్రమ్ బ్రేక్‌తో ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌ బాక్స్ & సాధారణ ప్రజలు కొనగలిగే ధరతో, ఈ బైక్ హీరో నుంచి చవకైన ABS బైక్‌గా అవతరించింది.

3. Hero Xtreme 160R 2V (2024)
ఈ లిస్ట్‌లో ఉన్న మరో హీరో బ్రాండ్‌ బైక్ Xtreme 160R 2V. ఈ టూవీలర్‌లో శక్తిమంతమైన 163.2 cc ఇంజిన్‌ ఉంది, ఇది 14.7 bhp పవర్ & 14 Nm టార్క్‌ను ఇస్తుంది. OBD2B వేరియంట్‌లో వెనుక డిస్క్ బ్రేక్ (220mm) ఉంది & స్టాండర్డ్ వేరియంట్‌లో డ్రమ్ బ్రేక్ ఉంది. ఈ బైక్ రబ్బర్‌ అండర్‌బోన్ డైమండ్ ఫ్రేమ్ & 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో డిజైన్‌ అయింది. ఫలితంగా.. పనితీరు & స్థిరత్వం రెండింటిలోనూ ఇది అద్భుతంగా ఉంటుంది.

4. Bajaj Pulsar 150
పల్సర్ 150లో 149.5cc ఇంజిన్ ఉంది, ఇది 13.8 bhp శక్తిని & 13.25 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 260mm ఫ్రంట్ డిస్క్ & 130mm వెనుక డ్రమ్ బ్రేక్, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు దీనిలో ఉన్నాయి. బజాజ్ నమ్మకమైన ఇంజినీరింగ్‌ వర్క్‌ & ABS వంటివి ఈ బండిని సేఫ్టీ ఆప్షన్‌గా మారుస్తాయి.

5. Yamaha FZ-S Fi (2025)
యమహా FZ-S Fi 149 cc 2-వాల్వ్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పవర్‌ తీసుకుంటుంది, ఇది 12.2 bhp పవర్‌ను & 13.3 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ మోటారు బండికి ముందు 282mm & వెనుక 220mm డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి, ఇది ఈ విభాగంలో అత్యుత్తమ బ్రేకింగ్ పెర్ఫార్మర్‌. ఈ బండిలో 5-స్పీడ్ గేర్‌ బాక్స్‌ ఉంది. YZF సిరీస్ స్టైలిష్ లుక్ దీనికి మరొక ప్లస్‌ పాయింట్‌.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
The Paradise : నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
Premante OTT : ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Abhishek Sharma to Break Virat Record | కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
India vs South Africa 3rd T20 | భారత్ x సౌతాఫ్రికా మూడో టీ20
Robin Uthappa on Gambhir Ind vs SA | గంభీర్ పై ఉత్తప్ప కామెంట్స్
Suryakumar Yadav Form in SA T20 Series | సూర్య కుమార్ యాదవ్ పై ట్రోల్స్
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
The Paradise : నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
Premante OTT : ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Top Mileage Cars in India: వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
Maruti Brezza లేదా Nissan Magnite లలో ఏ SUV బెటర్- ధర, ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Maruti Brezza లేదా Nissan Magnite లలో ఏ SUV బెటర్- ధర, ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Shocking News: పాఠాలు వింటూ కుప్పకూలిన విద్యార్ధిని.. కోన‌సీమ జిల్లా రామ‌చంద్ర‌పురంలో విషాదం
పాఠాలు వింటూ కుప్పకూలిన విద్యార్ధిని.. కోన‌సీమ జిల్లా రామ‌చంద్ర‌పురంలో విషాదం
Masaka Masaka Song : ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
Embed widget