అన్వేషించండి

Car Wiper Maintenance: భారీ వర్షాల్లోనూ మీ కారు ప్రయాణ భద్రతను పెంచే కీలక చిట్కాలు!

Car Wiper Maintenance Tips: వర్షాకాలం ప్రయాణాల్లో కార్ వైపర్ పాత్ర చాలా కీలకం. వైపర్ ఎక్కువ కాలం చక్కగా పని చేసేలా, మీ ప్రయాణం సురక్షింతగా ఉండాలంటే అందరూ కామన్‌గా చేస్తున్న తప్పులను మీరు చేయకూడదు.

Car Wiper Maintenance Tips: భారీ వర్షాలు కురిసినప్పుడు & దారి సరిగా కనిపించనప్పుడు కారు విండ్‌షీల్డ్ వైపర్‌లు డ్రైవర్‌కు, ప్రయాణానికి చాలా ఉపయోగపడతాయి. అలాంటి కఠిన వాతావరణంలో ఇవి ఒక భద్రత కవచంలా పని చేస్తాయి. వైపర్లు విండ్‌షీల్డ్‌ను శుభ్రంగా & స్పష్టంగా ఉంచుతాయి, ఇది ప్రమాదాల అవకాశాలను తగ్గిస్తుంది. కానీ, వైపర్ల నిర్వహణలో నిర్లక్ష్యం చూపితే అవి స్నేహితుడిగా కాకుండా శత్రువుగా మారే ప్రమాదం ఉంది. 

కార్ వైపర్లను ఎంత చక్కగా చూసుకుంటే అంత ఎక్కువ కాలం మెరుగైన పనితీరును అందిస్తాయి. కారు వైపర్‌ నిర్వహణలో అందరూ సాధారణంగా చేసే తప్పులను మీరు నివారించగలిగితే... తుపాన్లు, దుమ్ము వాతావరణంలో అవి మీ ప్రయాణానికి భరోసా కల్పిస్తాయి. (Car maintenance tips)

1. కారును ఎండలో పార్క్ చేయవద్దు
కార్ వైపర్ బ్లేడ్లను సాధారణంగా రబ్బరుతో తయారు చేస్తారు. ఇవి ఎక్కువ సూర్యకాంతికి గురైనప్పుడు ఎండిపోయి గట్టిపడతాయి. మీరు మీ వాహనాన్ని ఎండలో ఎక్కువ సార్లు పార్క్ చేసినప్పుడు వైపర్ బ్లేడ్ల రబ్బరు విరిగిపోవడం ప్రారంభమవుతుంది. ఫలితంగా వాటిని ఉపయోగించే సమయంలో విండ్‌షీల్డ్‌పై గీతలు పడవచ్చు. కాబట్టి మీ వాహనాన్ని ఎప్పుడూ నీడ ఉన్న ప్రదేశంలో పార్క్ చేయండి లేదా కవర్‌తో అయినా కప్పి ఉంచండి.

2. నీరు లేకుండా వైపర్‌ను ఆపరేట్‌ చేయవద్దు
విండ్‌షీల్డ్‌పై దుమ్ము లేదా ధూళి ఉన్నప్పుడు, కొంతమంది డ్రైవర్లు వాషర్ స్ప్రేను ఉపయోగించకుండా వైపర్‌లను ఆపరేట్ చేస్తారు. దీనివల్ల వైపర్ రబ్బరు ఉపరితలం త్వరగా అరిగిపోతుంది & గాజుపై గీతలు పడటానికి కారణమవుతుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే వైపర్‌లను ఆపరేట్ చేసే ముందు ఎప్పుడూ విండ్‌షీల్డ్ వాషర్ లిక్విడ్‌ను ఉపయోగించండి.

3. వైపర్ బ్లేడ్‌లను క్రమం తప్పకుండా గమనిస్తుండాలి
వైపర్ బ్లేడ్ సగటు జీవితకాలం దాదాపు 12 నెలలు. కానీ, వాతావరణం & వినియోగంపై అది ఆధారపడి ఉంటుంది. వైపర్ నడుపుతున్నప్పుడు గీసుకుంటున్నట్లు శబ్దం వస్తే లేదా అది సరిగ్గా శుభ్రం కాకపోతే, దానిని మార్చాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోండి. వైపర్ బ్లేడ్ సగటు జీవితకాలం పెంచడానికి ఎప్పటికప్పుడు వైపర్ బ్లేడ్‌ను మృదువైన వస్త్రంతో శుభ్రం చేసి దానిపై పేరుకుపోయిన దుమ్ము & ధూళిని తొలగించండి.

4. డిటర్జెంట్ వాడేటప్పుడు జాగ్రత్త
చాలా మంది, విండ్‌షీల్డ్ శుభ్రం చేయడానికి సాధారణ డిటర్జెంట్ లేదా సబ్బును ఉపయోగిస్తారు, అలా చేయడం వల్ల వైపర్ రబ్బరు దెబ్బతింటుంది. వైపర్ రబ్బరుపై ప్రభావం చూపకుండా గాజును మాత్రమే శుభ్రపరిచే కార్ షాంపూ లేదా తేలికపాటి గ్లాస్ క్లీనర్‌ను ఉపయోగించాలి.

5. వైపర్ స్క్రూలను తనిఖీ చేయడం మర్చిపోవద్దు
సాధారణంగా, వర్షాకాలంలో మాత్రమే వైపర్ల వాడకం గుర్తుకు వస్తుంది, వాటి వినియోగం పెరుగుతుంది. వర్షాకాలానికి ముందు చాలాకాలం పాటు వాడకపోవడం వల్ల వైపర్ మౌంటింగ్స్‌ & స్క్రూలు వదులయ్యే అవకాశం ఉంటుంది. దీనిని సకాలంలో గమనించకపోతే వైపర్ సామర్థ్యం ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. కాబట్టి, ఎప్పటికప్పుడు వైపర్ స్క్రూలను సున్నితంగా బిగించి, వాటి కదలిక స్థిరంగా & సజావుగా ఉండేలా చూసుకోండి.

టాప్ హెడ్ లైన్స్

రూ.10 లక్షల బడ్జెట్‌లో లభించే Best CNG Cars ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
రూ.10 లక్షల బడ్జెట్‌లో లభించే Best CNG Cars ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Maruti Baleno కంటే Toyota Glanza రేటు ఎందుకు ఎక్కువ? ధర, ఫీచర్లు, మైలేజీలో అసలు తేడాలివే!
టయోటా గ్లాంజా vs మారుతి బలెనో.. ఈ ట్విన్‌ కార్స్‌లోనూ తేడాలున్నాయ్‌?, కొనే ముందే తెలుసుకోండి
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Embed widget