సీపీఎస్ ఉద్యోగులు పాత పింఛను విధానంలోకి (OPS) మారేందుకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన అధికారిక జీవోను విడుదల చేసింది.
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
AP CPS Employees: ఏపీ ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన సీపీఎస్ ఉద్యోగులు ఓపీఎస్ లోకి మారడానికి నోటిఫికేషన్ ఇచ్చింది.

- సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఓపీఎస్ లోకి మారే అవకాశం.
- సెప్టెంబర్ 1, 2004 ముందు నోటిఫై అయినవారు, రిటైర్డ్ అర్హులు.
- అర్హులైన ఉద్యోగులు డిసెంబర్ 31లోగా తమ ఆప్షన్లు సమర్పించాలి.
- ఆర్థిక శాఖ మార్గదర్శకాలు విడుదల, ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలి.
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) కింద పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులు పాత పింఛను విధానంలోకి (OPS) మారేందుకు అవకాశం కల్పిస్తూ అధికారికంగా జీవో విడుదల చేసింది.
ఎవరెవరు అర్హులు?
- కేంద్ర ప్రభుత్వ నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
- 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైన వారికి మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుంది.
- ఉద్యోగ నోటిఫికేషన్ 2004 సెప్టెంబర్ 1కి ముందు వచ్చి, ఆ తర్వాత (2004 సెప్టెంబర్ 1 లేదా ఆ తర్వాత తేదీల్లో) అపాయింట్మెంట్ పొందిన ఉద్యోగులు కూడా ఈ పథకానికి పూర్తిగా అర్హులు.
- ప్రస్తుతం సర్వీసులో కొనసాగుతున్న వారితో పాటు, ఇప్పటికే రిటైర్ అయిన ఉద్యోగులు, ఫ్యామిలీ పెన్షనర్లు కూడా పాత పింఛను విధానాన్ని ఆప్షన్ ద్వారా ఎంచుకోవచ్చు.
గడువు
అర్హులైన ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది తమ ఆప్షన్లను సమర్పించడానికి ప్రభుత్వం గడువు నిర్దేశించింది. అర్హులైన ఉద్యోగులు డిసెంబర్ 31 లోగా తమ ఆప్షన్ డాక్యుమెంట్లు సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.
Also Read: 2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
ఆర్థిక శాఖ ఆదేశాలు
ఈ ప్రక్రియ మొత్తాన్ని అత్యంత పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేసేందుకు వీలుగా ఆర్థిక శాఖ సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉద్యోగుల నుంచి వచ్చే అప్లికేషన్లను నియామక అధికారులు పరిశీలించి, పెన్షన్ బెనిఫిట్స్‌ను వేగంగా ఖరారు చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది సీపీఎస్ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు పెద్ద ఊరట లభించినట్లైంది.
Also Read: చీరాల మున్సిపల్ షాక్ - కాంగ్రెస్ పుంజుకుందా.. ఆమంచి చాటుకున్నది సొంత బలాన్నా?
Frequently Asked Questions
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన గుడ్‌న్యూస్ ఏమిటి?
పాత పింఛను విధానంలోకి మారడానికి ఎవరు అర్హులు?
2004 సెప్టెంబర్ 1 కంటే ముందు ఉద్యోగ నోటిఫికేషన్ పొంది, ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారు, రిటైర్ అయినవారు, ఫ్యామిలీ పెన్షనర్లు అర్హులు. నోటిఫికేషన్ ముందుండి, నియామకం తర్వాత పొందినవారు కూడా అర్హులు.
పాత పింఛను విధానాన్ని ఎంచుకోవడానికి గడువు ఎప్పటి వరకు?
అర్హులైన ఉద్యోగులు డిసెంబర్ 31 లోగా తమ ఆప్షన్ డాక్యుమెంట్లను సంబంధిత అధికారులకు సమర్పించాలి. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















