అన్వేషించండి

Yezdi Adventure 2025: కొత్త అవతార్‌లో యెజ్డి అడ్వెంచర్ బైక్‌ - స్టైలిష్ లుక్‌, టెరిఫిక్‌ ఫీచర్లు కేకో కేక!

Yezdi Adventure 2025 Launched: యెజ్డి అడ్వెంచర్‌ బైక్‌ కొత్త అవతార్ భారతదేశంలో రూ. 2.15 లక్షలకు లాంచ్ అయింది. మారిన లుక్, కొత్త ఫీచర్లు & 334cc ఇంజిన్ గురించి వివరంగా తెలుసుకుందాం.

Yezdi Adventure 2025 Price Design and Features: క్లాసిక్ లెజెండ్స్ (Classic Legends) ఎట్టకేలకు భారతదేశంలో కొత్త "2025 యెజ్డి అడ్వెంచర్" బైక్‌ను విడుదల చేసింది. ఈ కొత్త అడ్వెంచర్ బైక్‌ను రూ. 2.15 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ ప్రీమియం సెగ్మెంట్‌, అడ్వంచరస్‌ & స్పోర్టీ లుక్‌ బైక్‌ కోసం కుర్రకారు చాలాకాలంగా పరితపిస్తున్నారు, సోషల్‌ మీడియాలో తెగ చర్చిస్తున్నారు.

"2025 యెజ్డి అడ్వెంచర్" బైక్ ఇంజిన్ & పవర్‌ట్రెయిన్‌లో ఈ కంపెనీ ఎటువంటి మార్పు చేయలేదు. కానీ... సరికొత్త లుక్ & సూపర్‌ అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లును యాడ్‌ చేసింది. లుక్‌ & ఫీచర్లు మారిన తర్వాత, ఈ కొత్త అవతార్‌ మునుపటి మోడల్ కంటే చాలా మెరుగ్గా & ఆకర్షణీయంగా మారింది.

డిజైన్‌లో వచ్చిన మార్పులేంటి?
2025 యెజ్డి అడ్వెంచర్ అవతార్‌లో అత్యంత ముఖ్యమైన మార్పు దాని హెడ్‌లైట్ సెటప్‌లో కనిపిస్తుంది. ఈ సెటప్‌లో ఒకవైపు మల్టీ-రిఫ్లెక్టర్ హెడ్‌లైట్ & మరోవైపు ప్రొజెక్టర్ లైట్ ఉన్నాయి. దీనివల్ల రాత్రిపూట ప్రయాణంలోనూ నాణ్యమైన కాంతితో రోడ్డును స్పష్టంగా చూసే వీలుంటుంది, రైడర్‌ విజన్‌ను మెరుగుపడుతుంది. ఇంకా.. బైక్‌లో ఇప్పుడు రెండు LED టెయిల్ లైట్లు ఏర్పాటు చేశారు, వెనుక వైపు నుంచి కూడా ఈ బండి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. డిజైన్‌కు ర్యాలీ-స్డైల్‌ బీక్‌ యాడ్‌ చేశారు, దీంతో ఈ బైక్‌ను చూడగానే ఒక అడ్వెంచరస్‌ ఫీల్‌ కలుగుతుంది.

2025 యెజ్డి అడ్వెంచర్ బైక్‌లో కొత్త గ్రాఫిక్స్ & డెకాల్స్‌తో ఇంధన ట్యాంక్‌ను కొత్తగా డిజైన్‌ చేశారు. దీనివల్ల, ఇది గతంలో కంటే మరింత అట్రాక్ట్‌ చేస్తోంది. యెజ్డి అడ్వెంచర్‌ 2025ను ఆరు కొత్త రంగుల్లో లాంచ్‌ చేశారు, ఫలితంగా కస్టమర్‌లకు ఎక్కువ కలర్‌ ఆప్షన్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పులన్నింటి కారణంగా ఈ బైక్ రోడ్ ప్రెజెన్స్ & విజువల్ అప్పీల్ మునుపటి కంటే చాలా బెటర్‌గా మారింది.

ఫీచర్లలో పెద్ద అప్‌గ్రేడ్
కొత్త యెజ్డి అడ్వెంచర్ టెక్నాలజీ పరంగానూ అడ్వాన్స్‌డ్‌ బైక్‌గా మారింది. దీనిలో పూర్తిగా LED లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు; హెడ్‌ల్యాంప్, టెయిల్ లైట్లు & ఇండికేటర్‌లు అన్నీ LED టెక్నాలజీతో అమర్చారు. బైక్‌లో LCD డిజిటల్ డిస్‌ప్లే కూడా ఉంది, ఇది రైడర్‌కు వేగం, గేర్ ఇండికేటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్‌ లెవెల్‌ & ఇతర ముఖ్యమైన సమాచారాన్ని స్పష్టంగా చూపిస్తుంది. దీనితో పాటు, బైక్‌లో సర్దుబాటు చేసుకోగల విండ్ వైజర్ కూడా ఉంది.

భద్రత 
యెజ్డి అడ్వెంచర్ 2025లో 'ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌' ఏర్పాటు చేశారు. ఇది బండిని ఎలాంటి జారుడు ఉపరితలంపైన అయినా జారిపోనివ్వదు & బండికి, రైడర్‌కు అదనపు నియంత్రణ అందిస్తుంది. ఈ అడ్వెంచర్‌ బైక్‌లో 'రోడ్, రెయిన్ & ఆఫ్-రోడ్' వంటి 3 ABS మోడ్‌లను కూడా అందుబాటులోకి తెచ్చారు.

ఇంజిన్ & పనితీరు
కొత్త యెజ్డి అడ్వెంచర్ బైక్‌ మునుపటి పాత 334cc లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తోనే పని చేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 29.20 bhp పవర్‌ను & 29.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానమై ఉంటుంది. ఫలితంగా.. గేర్ షిఫ్టింగ్‌ సున్నితంగా ఉంటుంది & హైవే మీద మెరుగైన వేగ నియంత్రణ, రైడ్ క్వాలిటీని అందిస్తుంది. పవర్‌ట్రెయిన్‌లో పెద్ద టెక్నికల్‌ మార్పులు చేయనప్పటికీ, ఈ బండికి రైజ్‌ ఇస్తే రోడ్డును దడదడలాడిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!
సిటీ రైడింగ్‌ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!
డెకాథ్లాన్ నుంచి 3 కొత్త సైకిళ్లు.. Rockrider సిరీస్‌లో అదిరిపోయే మోడల్స్!
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget