Fortuner Mild Hybrid: ఫార్చ్యూనర్ కొత్త వేరియంట్ కొనడం మంచిదేనా?, పాత-కొత్త మోడళ్ల మధ్య తేడాలేంటి?
Fortuner Mild Hybrid vs Standard: టయోటా ఫార్చ్యూనర్ నియో డ్రైవ్ మైల్డ్ హైబ్రిడ్ మోడల్ - స్టాండర్డ్ మోడల్ మధ్య తేడా ఏంటి?, రూ.2 లక్షలు ఎక్కువ చెల్లించడం తెలివైన పనేనా?

Fortuner Mild Hybrid vs Fortuner Standard Features: టయోటా, తన మోస్ట్ పాపులర్ SUV 'ఫార్చ్యూనర్ సిరీస్'లో కొత్త వేరియంట్ 'ఫార్చ్యూనర్ నియో డ్రైవ్ మైల్డ్ హైబ్రిడ్' (Fortuner Neo Drive Mild Hybrid) మోడల్‌ను కొత్తగా విడుదల చేసింది. ఈ SUV ఇప్పుడు లెజెండ్ & స్టాండర్డ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఫార్చ్యూనర్ పవర్‌ట్రెయిన్‌లో కొత్తగా 48V మైల్డ్ హైబ్రిడ్ వ్యవస్థను జోడించారు. ఈ కొత్త హైబ్రిడ్ సిస్టమ్ కోసం అదనంగా రూ.2 లక్షలు చెల్లించాలి. ఇలా ఎక్కువ ధర పెట్టడం సరైన పనేనా?.
పవర్‌ట్రెయిన్‌లో మార్పు ఏమిటి?
స్టాండర్డ్ ఫార్చ్యూనర్ 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పవర్ తీసుకుంటుంది, నియో డ్రైవ్ మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్‌లో, పూర్వపు ఇంజిన్‌కే 48V లిథియం-అయాన్ బ్యాటరీ & ఎలక్ట్రిక్ మోటార్ జనరేటర్ జత చేశారు. ఈ మార్పుతో, తక్కువ వేగంలోనూ వాహనానికి మెరుగైన డ్రైవింగ్ ప్యూరిఫికేషన్ & స్మూత్‌నెస్‌ను ఇస్తుంది. మైలేజీలో స్వల్ప మెరుగుదల ఉన్నప్పటికీ, కేవలం ఈ కారణంతోనే ఫార్చ్యూనర్‌ను కొనుగోలు చేయడం సరికాదు.
అదనపు ఫీచర్లు
టయోటా, నియో డ్రైవ్ వేరియంట్‌లో ఇంజిన్‌లో మార్పుతో పాటు కొన్ని ముఖ్యమైన భద్రత & సౌకర్యవంతమైన లక్షణాలను కూడా యాడ్ చేసింది. ఈ వేరియంట్‌లో 7 ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీల కెమెరా, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS) & ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇవి లేకపోవడం వల్ల స్టాండర్డ్ ఫార్చ్యూనర్ తన పోటీ కార్ల కంటే వెనుకబడి ఉంది. ముఖ్యంగా, ఇతర కంపెనీలు అదే రేటు లేదా అంతకంటే తక్కువ రేటుుకు ఎక్కువ సాంకేతికతలు అందిస్తున్నాయి.
ఎక్కువ ధర పెట్టడం సమర్థనీయమేనా?
నియో డ్రైవ్ మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్ స్టాండర్డ్ ఫార్చ్యూనర్ కంటే దాదాపు రూ.2 లక్షలు ఎక్కువ ఖరీదైనది. ఈ అదనపు ఖర్చు సమర్థనీయమేనా అని ప్రశ్నించుకున్నప్పుడు: మైల్డ్ హైబ్రిడ్ వ్యవస్థ డ్రైవింగ్ & ఇంజిన్ రిఫైన్‌మెంట్‌ను గణనీయంగా మెరుగుపరుస్తుంది. నగరాల్లో డ్రైవింగ్ అనుభవం గతంలో కంటే మరింత స్మూత్ & రెస్పాన్సివ్‌గా ఉంటుంది. ఈ వేరియంట్ ఫ్యూచర్ రెడీ టెక్నాలజీతో లాంచ్ అయింది, ఎలక్ట్రిఫికేషన్ దిశగా మైలురాయిగా నిలుస్తుంది.
అదనపు భద్రత ఫీచర్లు
48V మైల్డ్ హైబ్రిడ్ వ్యవస్థ వల్ల మైలేజీలో పెద్దగా మార్పు లేదు. ఎక్కువగా హైవేలపై డ్రైవ్ చేసే వాళ్లకు ఈ టెక్నాలజీ పెద్దగా ప్రయోజనం కలిగించకపోవచ్చు. కాబట్టి, అదనపు రూ.2 లక్షల ధర అందరు కస్టమర్లకు, ముఖ్యంగా బడ్జెట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకునేవాళ్లకు సరిపోకపోవచ్చు.
భవిష్యత్తులో మరిన్ని హైబ్రిడ్ డీజిల్ SUVలు వస్తాయా?
టయోటా తీసుకొచ్చిన ఈ కొత్త వ్యవస్థ ఫార్చ్యూనర్ ఎలక్ట్రిఫికేషన్ దిశగా ఒక పెద్ద హింట్‌గా తీసుకోవాలి. భవిష్యత్తులో, ఇతర కార్ కంపెనీలు కూడా డీజిల్ SUVలను తేలికపాటి హైబ్రిడ్ వ్యవస్థలతో విడుదల చేస్తాయని ఆశించవచ్చు, ముఖ్యంగా, ఇప్పటికే ప్రజాదరణ పొందిన డీజిల్ బండ్లను మార్చవచ్చు.





















