అన్వేషించండి

MG Electric Car: ఈ EV కొంటే ఐదేళ్లలో రూ.10 లక్షలు ఆదా - మీ డబ్బు మొత్తం తిరిగొస్తుంది, కారు మిగులుతుంది!

MG Windsor EV: ఎంజీ విండ్‌సోర్‌ ఈవీ నడపడానికి కిలోమీటరుకు అయ్యే ధరను కాంపాక్ట్ ICE SUV & మిడ్ ICE SUVతో పోల్చి చూస్తే, ఇంత డబ్బు మిగులుతుందా అని మీరు ఆశ్చర్యపోతారు.

MG Windsor EV Maintenance Cost: భారతీయ మార్కెట్లో అత్యుత్తమ ఎలక్ట్రిక్‌ కార్‌ల గురించి చర్చ వచ్చినప్పుడు MG విండ్‌సోర్‌ EV గురించి కూడా తప్పక చెప్పుకోవాలి. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న EVల్లో ఇది ఒకటి. బడ్జెట్‌ రేటులోనే ప్రీమియం ఫీచర్లను ఈ ఎలక్ట్రిక్‌ కారు ఇస్తోంది.

MG విండ్‌సోర్‌ EV ప్రత్యేకత ఏంటంటే.. పెట్రోల్ వెర్షన్‌తో పోలిస్తే ఈ EV 5 సంవత్సరాలలో మీకు పూర్తిగా 10 లక్షలు ఆదా చేయగలదు. ఇప్పుడు ఇది ఎలా జరుగుతుందా అనే సందేహం వద్దు, ఇప్పుడు చెప్పబోయే గణాంకాలతో మీరూ దీనిని ఒప్పుకుంటారుప.

MG విండ్‌సోర్‌ EVని EMI ఆప్షన్‌లో కొనవచ్చా?
బ్యాటరీ రెంటల్‌ ప్లాన్‌లో (BaaS) MG Windsor EV ఎక్స్‌-షోరూమ్‌ ప్రారంభ ధర రూ. 9 లక్షల 99 వేలు కాగా (దాదాపు రూ.10 లక్షలు), ఈ సెగ్మెంట్‌లో దీనితో పోటీపడే కార్ల ఎక్స్‌-షోరూమ్‌ రేటు రూ. 15 లక్షల నుం ప్రారంభం అవువుంది. Windsor EV కోసం రిజిస్ట్రేషన్/TCS/బీమా ఛార్జీలు రూ. 75,000 వరకు అవుతాయి. ఈ EVని కొనడానికి బ్యాంక్‌ లేదా ఫైనాన్స్‌ కంపెనీ మీకు లోన్‌ ఇస్తుంది. మీరు ఈ కారును రూ. 1.80 లక్షల డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేస్తే రూ. 8.94 లక్షల రుణం తీసుకోవాలి. వార్షిక వడ్డీ రేటు 9 శాతం అనుకుంటే, రుణం తిరిగి చెల్లించడానికి 36 నెలల కాల గడువు పెట్టుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 28,429 EMI చెల్లించాలి. 

ఇప్పుడు, కాంపాక్ట్ సైజ్‌ SUV విషయానికి వద్దాం. ఈ బండి రిజిస్ట్రేషన్/TCS/బీమా ఛార్జీలు రూ. 1.60 లక్షలు. రూ. 1.80 లక్షల డౌన్ పేమెంట్‌ చేసి కొనుగోలు చేస్తే మీరు రూ. 9.78 లక్షల కార్ లోన్ తీసుకోవాలి. ఒకవేళ మిడ్-సైజ్ SUV తీసుకుని అదే డౌన్‌ పేమెంట్‌ చేస్తే, ఈ కార్ లోన్ రూ. 14.58 లక్షలు అవుతుంది. 9 శాతం వార్షిక వడ్డీ రేటు, 36 నెలల టెన్యూర్‌లో - కాంపాక్ట్ సైజ్‌ SUV కోసం నెలకు రూ. 31,127 EMIని బ్యంక్‌లో జమ చేయాలి, మిడ్ సైజ్‌ SUV కోసం రూ. 46,364 EMI చెల్లించాలి.

కిలోమీటరుకు ఎంత ఖర్చవుతుంది? 
MG విండ్‌సోర్‌ EV కిలోమీటరు ఖర్చును కాంపాక్ట్ సైజ్‌ SUV & మిడ్ సైజ్‌ SUV తో పోల్చి చూస్తే ఆశ్చర్యపోయే గణాంకాలు కనిపిస్తాయి. MG విండ్‌సోర్‌ EV విషయంలో బ్యాటరీ అద్దె కిలోమీటరుకు రూ. 3.50 & ఛార్జింగ్ ఖర్చు 1 రూపాయి అవుతుంది. కాంపాక్ట్ సైజ్‌ SUV & మిడ్ సైజ్‌ SUV విషయంలో కిలోమీటరు ఖర్చు 8 రూపాయలు అవుతుంది.

మీరు, కారు ప్రతి నెలా సగటను 1500 కి.మీ. నడిపితే, విండ్‌సోర్‌ EV కోసం అయ్యే ఖర్చు నెలకు రూ. 6,750 అవుతుంది. కాంపాక్ట్ సైజ్‌ SUV & మిడ్ సైజ్‌ SUV విషయంలో ఇదే వ్యయం రూ. 12,000 అవుతుంది.

5 సంవత్సరాలలో రూ.10 లక్షలు ఎలా ఆదా అవుతాయి? 
EMI & కిలోమీటరు ఖర్చు కలిపిన తర్వాత, MG విండ్‌సోర్‌ EV కోసం నెలకు రూ. 35,179 చెల్లించాలి. కాంపాక్ట్ సైజ్‌ SUV & మిడ్ సైజ్‌ SUV కోసం వరుసగా రూ. 43,127 & రూ. 58,364 చెల్లించాలి. కాంపాక్ట్ సైజ్‌ SUVతో పోలిస్తే, MG విండ్‌సోర్‌ SUVని కొనుగోలు చేయడం వల్ల 5 సంవత్సరాలలో రూ. 4.20 లక్షలు ఆదా అవుతుంది. మరోవైపు, మిడ్ సైజ్‌ SUVతో పోలిస్తే రూ. 10.17 లక్షలు ఆదా చేస్తారు. మొదట చెప్పుకున్నట్లు, MG Windsor EV ఎక్స్‌-షోరూమ్‌ ప్రారంభ ధర దాదాపు రూ. 10 లక్షలు. అంటే, విండ్‌సోర్‌ EV కొనడం ఐదేళ్లలో మీ పెట్టుబడి  మొత్తం తిరిగి వచ్చినట్లవుతుంది. ఈ లెక్కన, ఐదేళ్ల తర్వాత ఈ ఎలక్ట్రిక్‌ కారు మీకు పూర్తిగా ఉచితంగా మిగిలినట్లే లెక్క.

టాప్ హెడ్ లైన్స్

17 వేల EMIపై Hyundai Creta కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి
17 వేల EMIపై Hyundai Creta కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి
Maruti Dzireకు ప్రత్యామ్నాయంగా Honda Amaze కొనబోతున్నారా? ముందు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోండి
కొత్త Honda Amaze కొనేవాళ్లకు అలెర్ట్‌! ఈ సెడాన్‌లో మీకు తెలియాల్సిన 3 ప్లస్‌లు, 3 మైనస్‌లు!
Ethanol: పెట్రోల్ తర్వాత డీజిల్‌పైనా ప్రయోగం.. ఇథనాల్‌పై కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గింది?
డీజిల్‌లో ఇథనాల్ కలపడం కుదరదు.. అసలు కారణం ఇదే!
బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget