అన్వేషించండి

Sunshade Traffic Challan: కారుకు సన్‌షేడ్‌ ఉన్నందుకు ట్రాఫిక్‌ చలాన్‌ - కంపెనీ ఇచ్చిన సన్‌షేడ్‌ కూడా చట్టవిరుద్ధమా?

Challan On Kia SUV: కియా SUVకి సన్‌షేడ్ ఉన్నందుకు ఒక ట్రాఫిక్‌ పోలీసు చలాన్ విధించారు. సన్‌షేడ్‌ విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది & పోలీసులు ఈ చర్య ఎందుకు తీసుకున్నారు?.

Challan On Kia SUV For Having Sunshade: కారు లోపలకు ఎండ రాకుండా వాహనం విండో గ్లాస్‌కు సన్‌షేడ్‌ను అమర్చుకోవడం సర్వసాధారణంగా చూస్తుంటాం. ఇప్పుడు చాలా ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్ల విండో అద్దాలకు సన్‌షేడ్‌ను డిఫాల్ట్ ఫీచర్‌గా అందిస్తున్నాయి. అయితే, ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక కేసు ఈ ఫెసిలిటీ గురించి మళ్లీ ప్రశ్నలు లేవనెత్తింది.

అసలు ఏం జరిగింది?
ప్రస్తుతం, సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో, ఒక కారు యజమాని తన KIA కారు రియర్‌ వ్యూ మిర్రర్ & సైడ్ విండోకు సన్‌షేడ్ అమర్చినందుకు ట్రాఫిక్‌ పోలీసులు ఆ కారును ఆపారు. అద్దాలకు సన్‌షేడ్‌ ఎందుకు పెట్టుకున్నావని ప్రశ్నించారు. ఆ సన్‌షేడ్‌ను కియా కంపెనీ పర్మినెంట్‌గా ఇన్‌స్టాల్ చేసిందని & దానిని తొలగించడం సాధ్యం కాదని కారు యజమాని చెప్పాడు. అయినప్పటికీ, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించాడని పేర్కొంటూ పోలీసులు ఆ కారుకు చలాన్ జారీ చేశారు. ఈ సంఘటన ఛండీఘర్‌లో జరిగినప్పటికీ, ట్రాఫిక్‌ రూల్స్‌ గురించి దేశవ్యాప్తంగా గందరగోళం సృష్టించింది. ఈ వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్లు తమకు తోచినట్లు స్పందిస్తున్నారు, అభిప్రాయాలు చెబుతున్నారు.

చట్టం ఏం చెబుతోంది?
2012లో సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం - భారతదేశంలోని ఏదైనా కారు కిటికీ లేదా అద్దంపై సన్‌షేడ్ లేదా టింట్ అమర్చుకుంటే, ఆ సన్‌షేడ్ లేదా టింట్ 'VLT' (విజిబుల్ లైట్ ట్రాన్స్‌మిషన్) ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే (అది కంపెనీ అమర్చినా లేదా కారు యజమాని/డ్రైవర్‌ సొంతంగా ఇన్‌స్టాల్ చేసుకున్నా), దానిని చట్టవిరుద్ధంగా పరిగణించాలి. ఆ కారుపై చట్టపరంగా చర్యలు (జరిమానా వంటివి) తీసుకోవచ్చు.

కంపెనీ అమర్చిన సన్‌షేడ్‌లు చెల్లుబాటు అవుతాయా, లేదా?
ఇప్పుడు, Kia, Hyundai, Toyota వంటి చాలా కార్‌ కంపెనీలు తమ వాహనాలకు ఫ్యాక్టరీ-ఫిటెడ్‌ సన్‌షేడ్‌ లేదా గ్లాస్ టింట్‌ను స్టాండర్డ్‌ ఫీచర్‌గా అందిస్తున్నాయి. అయితే, కంపెనీ ఏర్పాటు చేసినంత మాత్రాన అవన్నీ చట్ట సమ్మతమే అని పరిగణించకూడదు. సాధారణంగా, కార్‌ కంపెనీలు ట్రాఫిక్‌ రూల్స్‌కు విరుద్ధంగా ఉండే ఎలాంటి ఉపకరాణాలను బిగించవు. ఒకవేళ, కంపెనీ అమర్చిన సన్‌షేడ్‌ లేదా టింట్‌ 'VLT' ప్రమాణాలకు అనుగుణంగా లేకుంటే, దానిని చట్టవిరుద్ధమైదివిగా పరిగణించాలి. దీని అర్థం, అలాంటి సన్‌షేడ్‌ లేదా టింట్‌ను కంపెనీ ఇన్‌స్టాల్ చేసినప్పటికీ చలాన్ జారీ చేయవచ్చు.

అలాంటి పరిస్థితిలో ఇబ్బంది ఎందుకు వస్తుంది?
ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ, ప్రతి పోలీసు వద్దా VLTని కొలిచే పరికరం (మీటర్) ఉండదు. ఈ కారణంగా, కారుకు 'కంపెనీ అమర్చిన సన్‌షేడ్' ఉన్నప్పటికీ ట్రాఫిక్‌ పోలీసులు చలాన్ జారీ చేస్తున్నారు. దీనివల్ల సామాన్య పౌరులకు అనవసరమైన ఇబ్బందికి & గందరగోళానికి గురవుతున్నారు.

మీ కారుకు కూడా సన్‌షేడ్ లేదా టింట్‌ ఉంటే ఏం చేయాలి?
మీ కారుకు కంపెనీ సన్‌షేడ్ ఇన్‌స్టాల్ చేసి ఉంటే, ఆ సన్‌షేడ్‌ను కంపెనీ ఫ్యాక్టరీలో అమర్చిందని ధృవీకరించే కారు బిల్లు & వారంటీ పత్రాన్ని ఎప్పుడూ మీ వద్ద ఉంచుకోండి. వీలైతే, VLT సర్టిఫికేట్‌ను మీ వద్ద ఉంచుకుని అవసరమైనప్పుడు ట్రాఫిక్ పోలీసులకు చూపించండి. అయినా మీ కారుపై చలాన్‌ రాస్తే స్థానిక ట్రాఫిక్ విభాగంలో లేదా కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

సీరియస్‌ రైడర్లకు బెస్ట్ బడ్జెట్ ఆప్షన్‌! రైడా రోవర్ రైడింగ్ ప్యాంట్స్ పూర్తి రివ్యూ
రైడా రోవర్ రైడింగ్ ప్యాంట్స్ - డైలీ జర్నీ, లాంగ్‌ టూరింగ్‌ కోసం ప్రత్యేకంగా డిజైనింగ్‌, ధర ఎంతంటే?
రెనాల్ట్ డస్టర్ 1.0 Vs 1.3 టర్బో పెట్రోల్ - పవర్‌ ఎంత, టార్క్‌ ఎంత, మైలేజ్‌లో ఏది బెస్ట్?
పవర్ ఎక్కువైతే మైలేజ్ తగ్గుతుందా? రెనాల్ట్ డస్టర్ 1.0 - 1.3 రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ ఫలితాలు ఇవే!
E20తో మైలేజ్‌ 5 శాతం వరకు తగ్గొచ్చని ఒప్పుకున్న కేంద్రం, కానీ ప్రయోజనాలే ఎక్కువని స్పష్టీకరణ
E20తో మైలేజ్ 5 శాతం వరకు తగ్గొచ్చు - అంగీకరించిన కేంద్రం, కానీ..!
Nissan Tekton: నిస్సాన్ టెక్టన్ కొనడానికి మీరు ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి? EMI ఎంత ఉంటుంది?
నిస్సాన్ టెక్టన్ కొనడానికి మీరు ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి? EMI ఎంత ఉంటుంది?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Embed widget