Victoris, Creta, Seltos, Kushaq - రూ.15 లక్షల్లో వీకెండ్ డ్రైవింగ్‌కి బెస్ట్ కారు ఏది?
Turbo Petrol SUV: రూ.15 లక్షల బడ్జెట్‌లో వీకెండ్ డ్రైవింగ్‌కి సరైన కారును వెతుకుతున్నారా? స్కోడా కుషాక్ ఫన్, కంఫర్ట్ డ్రైవ్‌తో యూత్‌కి పర్ఫెక్ట్ ఛాయిస్‌గా పేరు తెచ్చుకుంది.

Best weekend car budget under Rs 15 lakh: ఆఫీస్ లేదా బిజినెస్ బిజీ కారణంగా చాలా మంది వీక్ డేస్‌లో బయట సరదాగా తిరగలేదు. వీకెండ్ రోజుల్లో ఆ లోటును భర్తీ చేసుకుంటారు. వీకెండ్ రాగానే, ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్‌తో సైలెంట్‌గా ఒక ట్రిప్‌కి వెళ్లాలనుకునే వారికి ఒక శక్తిమంతమైన, కంఫర్టబుల్, స్టైలిష్ కారు కావాలి. వీకెండ్ ఫన్ కోసం Maruti Suzuki Victoris, Hyundai Creta, Kia Seltos, Skoda Kushaq అద్భుతమైన ఆప్షన్లు. వీటి నుంచి ఒకటి ఎంచుకోవాలనుకున్నప్పుడు, రూ. 15 లక్షల బడ్జెట్‌లో, స్కోడా కుషాక్ ఇప్పుడు యూత్‌లో టాప్ చాయిస్‌గా నిలుస్తోంది.
హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి విక్టోరిస్ వంటి కాంపిటీటర్ల మధ్య.. స్కోడా కుషాక్ తన యునిక్ డ్రైవింగ్ ఫీల్, ప్రీమియం ఇన్‌టీరియర్‌లతో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ కారు ప్రధాన ఆకర్షణ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 115 హార్స్‌పవర్, 178 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రోడ్డుపైన ఈ కారును నడపడం అంటే ఒక స్మూత్ & పవర్‌ఫుల్ అనుభవం.
వీకెండ్ మాత్రమే ప్రధాన డ్రైవ్‌గా ఉండే యూజర్లకు మైలేజ్ అంత ముఖ్యమైన అంశం కాదు. కాబట్టి కుషాక్ ఇంజిన్ ఫన్ డ్రైవింగ్‌ను అందిస్తుంది. రోడ్ హ్యాండ్లింగ్, సస్పెన్షన్ బ్యాలెన్స్, స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ వంటి అంశాలు ఈ సెగ్మెంట్‌లో బాగా సెట్ అయ్యాయి. ఇవి ప్రత్యేకంగా హైవే డ్రైవ్‌లను ఎంజాయ్ చేయించేలా ఉంటాయి.
కుషాక్ ఇంటీరియర్స్
ఇంటీరియర్స్ విషయానికి వస్తే, కుషాక్ యూరోపియన్ క్లాస్ ఫినిష్‌తో వస్తుంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంట్‌స్కూలింగ్, హై క్వాలిటీ ప్లాస్టిక్స్, బటన్స్ ఫీల్ అంతా ప్రీమియం అనిపిస్తాయి. బూట్ స్పేస్ విషయానికి వస్తే, 385 లీటర్ల విస్తీర్ణం ఉంది. ఇది వీకెండ్ ట్రావెల్ లేదా లైట్ లగేజ్‌కి సరిపోతుంది. ఈ కారులో 6 ఎయిర్ బ్యాగ్స్, స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఇచ్చారు - ఇవన్నీ సేఫ్టీ స్టాండర్డ్స్‌లో బలమైన విషయాలు కాబట్టి యూత్ కూడా ఈ కారును ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు.
కియా సెల్టోస్ & హ్యుందాయ్ క్రెటా ఫీచర్స్‌తో పోలిస్తే స్కోడా కుషాక్ కొంచెం పరిమితమైన ఫీచర్లతో ఉన్నప్పటికీ, డ్రైవింగ్ అనుభవం మాత్రం ఆకట్టుకుంటుంది. మారుతి విక్టోరిస్ లగ్జరీ వైపు మొగ్గుతుంటే, కుషాక్ యూత్ బాగా సరిపోయే ప్రాక్టికల్ స్పోర్టీ ఫీలింగ్ ఇస్తుంది.
మైలేజ్ గురించి వదిలేయండి
రూ. 15 లక్షల బడ్జెట్‌లో మీరు ఎక్కువగా వీకెండ్ డ్రైవింగ్ కోసం SUV తీసుకోవాలనుకుంటే, మైలేజ్ గురించి ఎక్కువ ఆలోచన అవసరం లేదు. ఇక్కడ ఫన్, రిఫైన్డ్ డ్రైవ్, స్మార్ట్ లుక్ ముఖ్యమైన విషయాలు. ఈ మూడు కలిసినప్పుడు కుషాక్ సరైన ప్యాకేజ్ అవుతుంది.
కాబట్టి, మీ మనస్సులో హ్యుందాయ్ క్రెటా లేదా కియా సెల్టోస్‌ని అనుకుంటున్నా, ఒకసారి కుషాక్‌ని టెస్ట్ డ్రైవ్ చేయండి - దాని డ్రైవింగ్ ఫీల్ మిమ్మల్ని ఆకట్టుకోవచ్చు. ఫ్యామిలీ ట్రిప్స్‌లో సేఫ్టీ & కంఫర్ట్ ఉంటుంది; ఫ్రెండ్స్‌తో వీకెండ్ ఔటింగ్‌లో పవర్ కూడా ఉంటుంది.
ఫ్యామిలీతో కలిసి వెళ్లేప్పుడు సేఫ్టీ చూసుకున్నా, యూత్ మైండ్‌సెట్‌తో ఫన్‌కి ప్రాధాన్యత ఇచ్చినా - స్కోడా కుషాక్ మీ బడ్జెట్‌కి సరైన ఛాయిస్. ఒకసారి డ్రైవ్ చేసి మీరు సంతృప్తి చెందాకే ఈ కారును కొనమని సలహా.





















