Hyundai Aura స్పెషల్ ఫెస్టివ్ ఆఫర్ - Maruti Dzire, Honda Amaze రేట్లు కూడా తగ్గాయి
GST Reforms 2025: పాత GST స్థానంలో కొత్త GST 2025 ను అమలు చేసిన తర్వాత, Hyundai Aura రేటు చకగ్గా మారింది. Maruti Dzire, Honda Amaze రేట్లు కూడా తగ్గాయి.

Hyundai Aura Diwali 2025 Offer - New GST Price: మన తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవరాల్ ఇండియన్ మార్కెట్‌లో, సెడాన్ విభాగంలో Maruti Dzire తో Hyundai Aura బలంగా పోటీ పడుతోంది. డిజైర్ తర్వాత, అత్యధికంగా అమ్ముడైన రెండో కారుగా ఇది నిలిచింది. గత కొన్ని నెలల్లో ఆరా అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. GST 2.0 తర్వాత, ఈ కారు ధర రూ. 76,316 తగ్గింది, దీనిని కొనుగోలు చేయడం మరింత ఈజీగా మారింది.
లుక్ & ఇంటీరియర్
హ్యుందాయ్ ఆరా లేటెస్ట్ మోడల్ ఇప్పుడు మరింత స్టైలిష్‌గా కనిపిస్తోంది. కొత్త LED డేటైమ్ రన్నింగ్ లైట్స్, షార్ప్ హెడ్‌ల్యాంప్స్, అగ్రెసివ్ ఫ్రంట్ గ్రిల్, స్లీక్ బంపర్ డిజైన్ దీన్ని మరింత ఆధునికంగా మార్చాయి. సైడ్ ప్రొఫైల్‌లో ఉండే డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ & స్మూత్ బాడీ లైన్స్ కారుకు ప్రీమియం అప్పీల్ తెచ్చాయి. వెనుక భాగంలో కొత్త LED టెయిల్‌ల్యాంప్స్ కూడా ఆరాకు ప్రత్యేక గుర్తింపును ఇస్తున్నాయి.
ఇంటీరియర్ విషయానికి వస్తే, కంఫర్ట్ & ప్రీమియం ఫీల్ కలగలిపిన డ్యాష్‌బోర్డ్ డిజైన్ ఆకట్టుకుంటుంది. సీటింగ్ కంఫర్ట్ మరింత మెరుగుపడింది. 8-ఇంచుల టచ్‌స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు డ్రైవింగ్ అనుభవాన్ని ఇంకా ఆహ్లాదకరంగా మారుస్తున్నాయి.
హ్యుందాయ్ ఆరా ధర ఎంత?
GST 2.0 కు ముందు, తెలుగు రాష్ట్రాల్లో హ్యుందాయ్ ఆరా E వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.54 లక్షలు. కొత్త GST తర్వాత ఇది రూ. 55,780 తగ్గి రూ. 5.98 లక్షలకు పడిపోయింది. ఇంకా, కంపెనీ ఈ కారుపై రూ. 38,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. దీంతో ఈ కారుపై మొత్తం దీపావళి ప్రయోజనాలు దాదాపు రూ. 1.14 లక్షలకు చేరాయి.
Hyundai Aura SX+ వేరియంట్ అతి పెద్ద ప్రైస్ డిస్కౌంట్ చూసింది. ఇంతకు ముందు దీని రేటు రూ. 8,94,900 (ఎక్స్-షోరూమ్)గా ఉండేది, ఇప్పుడు ఈ ధర రూ. 8,18,584 (ఎక్స్-షోరూమ్)కు తగ్గింది. అంటే, ఈ వేరియంట్ రేటు ఏకంగా రూ. 76,316 పతనమైంది. GST కాకుండా కంపెనీ ఇచ్చే ఆఫర్లు దీనికి అదనపు ప్రయోజనాన్ని అందిస్తున్నాయి.
మారుతి డిజైర్, హోండా అమేజ్ ధరలు కూడా తగ్గుదల
Maruti Dzire ఇప్పుడు రూ. 6.26 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది. GST సంస్కరణళ తర్వాత దీని ధర రూ. 87,700 తగ్గింది. ఈ కారుకు GNCAP భద్రతా రేటింగ్, ప్రాక్టికాలిటీ & ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇవన్నీ కలిసి, డబ్బుకు తగిన విలువను అందించడంలో ఈ కారును అద్భుతమైన ఎంపికగా నిలబెట్టాయి.
Honda Amaze కొత్త ధరలు ఇప్పుడు వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటాయి. రెండో తరం అమేజ్ ధర రూ. 72,800 వరకు తగ్గింది. మూడో తరం అమేజ్ ధర కూడా రూ. 95,500 వరకు తగ్గింది.





















