అన్వేషించండి

Petrol and Diesel Price Hike? ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?

మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో, భారత్ లో పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది.

Petrol and Diesel Price Hike Imminent in India: మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న అస్థిరత ఇప్పుడు భారతీయ వాహనదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 50 శాతం మేర పెరిగినప్పటికీ, మన దేశంలో పెట్రోల్ రూ. 94.77, డీజిల్ రూ. 87.67 వద్దే కొనసాగుతున్నాయి. అయితే, ఈ ధరలను ఇలాగే కొనసాగించడం ప్రభుత్వ చమురు సంస్థలకు తలకు మించిన భారంగా మారుతోంది. ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఇంధనాన్ని ఆదా చేయాలని కోరడం, రాబోయే భారీ ధరల పెంపునకు సంకేతమని నిపుణులు భావిస్తున్నారు.

రూ. 1 లక్ష కోట్ల భారీ నష్టం..
గత 10 వారాలుగా ఐఓసీ (IOC), బీపీసీఎల్ (BPCL), హెచ్‌పీసీఎల్ (HPCL) వంటి ప్రభుత్వ రంగ సంస్థలు అంతర్జాతీయ ధరల షాక్ నుంచి భారతీయులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు అప్పటికే 30 శాతం వరకు ధరలు పెంచినప్పటికీ, మన దగ్గర పాత రేట్లే అమలవుతున్నాయి. దీనివల్ల ఈ సంస్థలకు రోజుకు రూ. 1,600 నుంచి రూ. 1,700 కోట్ల వరకు నష్టం (Under-recovery) వస్తోంది. ఇప్పటివరకు ఈ మొత్తం నష్టం రూ. 1 లక్ష కోట్లు దాటిపోయింది. చమురు సంస్థల దగ్గర ఉన్న నిధులు తగ్గిపోతుండటంతో, ఇకపై పాత ధరలకే ఇంధనాన్ని విక్రయించడం అసాధ్యమని తెలుస్తోంది.

ప్రభుత్వ జోక్యం , ఎక్సైజ్ డ్యూటీ కోత..
చమురు ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అప్పటికే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. పెట్రోల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీని రూ. 13 నుంచి రూ. 3 కి, డీజిల్‌పై రూ. 10 నుంచి సున్నాకు తగ్గించడం వల్ల నెలకు ప్రభుత్వానికి రూ. 14,000 కోట్ల ఆదాయం తగ్గుతోంది. ఇంత చేస్తున్నా కూడా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (CAD) సమస్య తలెత్తుతోంది. దీనివల్ల దేశ ఆర్థిక భద్రతను కాపాడటం కోసం ధరల పెంపు అనేది ఇప్పుడు కేవలం ఒక పొలిటికల్ నిర్ణయంగా మాత్రమే మిగిలింది. ప్రభుత్వం ఎప్పుడు పచ్చజెండా ఊపితే అప్పుడు ధరలు పెరగడం ఖాయం. దీంతో అన్ని రకాల రంగాలపై ఈ ప్రభావం కనపడే అవకాశముందని తెలుస్తోంది.

రాబోయే సవాళ్లు..
చమురు సంస్థల ఆర్థిక స్థితి దెబ్బతింటే అది భవిష్యత్ పెట్టుబడులపై ప్రభావం చూపుతుంది. రిఫైనరీల విస్తరణ, ఇథనాల్ బ్లెండింగ్, బయో ఫ్యూయల్స్ వంటి క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు నిధుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. జపాన్, బ్రిటన్ వంటి దేశాలు ఇప్పటికే ధరలను భారీగా పెంచాయి. భారత్ లో ఇప్పటివరకు నియంత్రణలో ఉన్నా, ముడిచమురు దిగుమతుల్లో 40 శాతం ఈ సంక్షోభం వల్ల ప్రభావితం అవుతుండటంతో పరిస్థితి సీరియస్ గా ఉంది. వాహనదారులు ఇకపై పెరిగే ధరలకు సిద్ధంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్టార్ట్ చేసిన గల్ఫ్ వార్.. ఇప్పుడు ప్రపంచ దేశాలపై ప్రభావం చూపించే అవకాశముంది.  ఇంధన పొదుపు పాటించడం ద్వారా మాత్రమే ఈ సంక్షోభం నుంచి కొంతవరకు గట్టెక్కే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు
పెట్రోల్‌కు బలెనో.. CNGకి డిజైర్.. EVల్లో విండ్సర్ - 2026లో టాప్ సెల్లింగ్‌ కార్లు ఇవే!
టాటా నెక్సాన్ కామో ఎడిషన్‌లో ఆశ్చర్యపరిచే మార్పులు.. కొత్త రంగులు, 12.3 అంగుళాల స్క్రీన్, మరెన్నో!
టాటా నెక్సాన్‌ కామో ఎడిషన్ లాంచ్ - రూ.9.99 లక్షలే! ఏంటి దీని స్పెషాలిటీ?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Embed widget