అన్వేషించండి

Affordable Touchscreen EVs: తక్కువ బడ్జెట్‌లో ఈవీలు ! టచ్‌స్క్రీన్‌తో 5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, వాటి ధరలివే

Touchscreen EV scooters: మీరు స్మార్ట్ ఫీచర్లు, టచ్‌స్క్రీన్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా.. టీవీఎస్ iQube, ఏథర్ 450X, ఓలా S1 ప్రో టాప్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు హవా కొనసాగుతోంది. వీటిని కేవలం ప్రయాణానికి మాత్రమే కాదు, ఇతర స్మార్ట్ ఫీచర్లను సైతం ఉపయోగిస్తున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్లలో కూడా టచ్‌స్క్రీన్ డిస్ప్లేలు అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా మీరు గూగుల్ మ్యాప్స్, ఫోన్ కాల్స్, మ్యూజిక్‌ను సైతం ఆపరేట్ చేయవచ్చు. మీరు స్టైలిష్, స్మార్ట్ స్కూటర్ కొనాలనుకుంటే, మార్కెట్లో మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్లలో మంచి ఫీచర్లతో పాటు ఎక్కువ రేంజ్ కూడా లభించే వాటిని తీసుకుంటే రోజువారీ జర్నీ చేసు వారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. 

సింపుల్ వన్ (Simple One)
Simple One ఎలక్ట్రిక్ స్కూటర్ లాంగ్ రేంజ్ (ఎక్కువ దూరం ప్రయాణించే సౌకర్యం)తో పేరుగాంచిన ఈవీ. ఇందులో 7 ఇంచుల టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఇందులో గూగుల్ మ్యాప్స్, ఫోన్ కాల్, సౌండ్, మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇచ్చారు. ఈ స్కూటర్ స్మార్ట్‌వాచ్‌తో కూడా కనెక్ట్ అవుతుంది. ఈవీ చోరీ జరిగినప్పుడు మీకు అలర్ట్ పంపిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 1.69 లక్షలు. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లలో మార్కెట్లోకి వచ్చింది. ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 265 కి.మీ వరకు ప్రయాణించడం దీని ప్రత్యేకత అని కంపెనీ చెబుతోంది. 

Ather 450X
Ather 450X ఎలక్ట్రిక్ స్కూటర్ తన అద్భుతమైన డిజైన్‌తో పాటు టెక్నాలజీతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ వస్తుంది. దీనిని మీరు మొబైల్ లాగా ఉపయోగించవచ్చు. ఇందులో గూగుల్ మ్యాప్స్, కాల్ -మ్యూజిక్ కంట్రోల్, అలెక్సా సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 1.46 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 161 కిమీ వరకు నడుస్తుంది. ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారికి ఈ స్కూటర్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 

 

ఓలా ఎస్1 ప్రో జెన్ 3 (Ola S1 Pro Gen 3)
Ola S1 Pro Gen 3 తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ప్రారంభ ధర రూ. 1.02 లక్షలు. ధర ద్వారా ఇది చాలా మందికి అందుబాటులో ఉండే వాటిలో ఒకటిగా నిలిచింది. అందులో కొత్త సాఫ్ట్‌వేర్‌తో నడిచే 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇచ్చారు. ఇందులో మ్యాప్స్, కాల్, మ్యూజిక్ కంట్రోల్ సౌకర్యం ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 242 కిమీ రేంజ్ వెళ్తుంది. ఓలా ఎస్1 ప్రో జెన్3 రోజువారీ వాడకానికి బెటర్ ఆప్షన్. 

టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube ST), Ather Rizta
TVS iQube ST అనేది ఒక బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇచ్చారు. ఇందులో మ్యాప్స్, కాల్- మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లతో కస్టమర్లకు ప్రయోజనం. 2 బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. దీని పెద్ద మోడల్ 212 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. దీని ధర 1.71 లక్షలు.

ఇక Ather Rizta ధర రూ. 1.30 లక్షలు. ఇందులో కూడా 7 ఇంచుల స్మార్ట్ డిస్ప్లే వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 159 కిమీ వరకు వెళ్తుంది. నమ్మకమైన ఈవీలలో ఇది ఒకటి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Renault Kiger, Triber, Kwidపై అద్భుతమైన ఆఫర్లు - వేల రూపాయలు ఆదా, ఇది పరిమిత కాల ఆఫర్‌
కొత్త కారు కొనేవాళ్లకు గుడ్‌న్యూస్‌ - రూ.68,000 వరకు డిస్కౌంట్లు ప్రకటించిన రెనాల్ట్‌
Maruti Suzuki Celerio EMI Calculator: 50వేల రూపాయల డౌన్‌పేమెంట్‌తో మారుతి సెలెరియో సొంతం చేసుకునే EMI ప్లాన్ ఇదే! 
50వేల రూపాయల డౌన్‌పేమెంట్‌తో మారుతి సెలెరియో సొంతం చేసుకునే EMI ప్లాన్ ఇదే! 
రేస్‌ బైక్‌ తరహాలో Yamaha R15 V4, MT-15 MotoGP ఎడిషన్లు లాంచ్‌ - FZ-S సిరీస్‌కు కొత్త రంగులు
యమహా R15 V4, MT-15 మోటోజీపీ ఎడిషన్లు లాంచ్‌.. అచ్చం 'రేస్‌ బైక్‌'ను చూసినట్లే ఉంది
TVS స్కూటర్ల ధరలు పెంపు.. పాపులర్‌ మోడళ్ల రేట్లు ఏకంగా రూ.11,000 వరకు హైక్‌, ఇదిగో లిస్ట్‌
TVS స్కూటర్‌ కొనేవాళ్లకు షాక్‌! iQube నుంచి Jupiter వరకు వేలల్లో పెరిగిన ధరలు - కొత్త రేట్లు ఇవే

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Embed widget