అన్వేషించండి

Top 5 Affordable Motorcycles With ABS Safety Feature: సేఫ్టీ ఫస్ట్  -  డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఉన్న చౌకైన బైకుల లిస్ట్ ఇదే!

హైవేలపై ప్రయాణించేటప్పుడు బైక్ అదుపు తప్పకుండా ఉండటానికి డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ చాలా ముఖ్యం. తక్కువ బడ్జెట్‌లో ఈ ఫీచర్ ఇచ్చే ఐదు బైకుల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Top 5 Affordable Motorcycles in India  with Essential Dual Channel ABS Safety Feature: నేటి కాలంలో మోటార్ సైకిల్ ప్రయాణాల్లో భద్రత అనేది అత్యంత కీలకమైన అంశంగా మారింది. ముఖ్యంగా రోడ్లపై అకస్మాత్తు గా బ్రేకులు వేయాల్సి వచ్చినప్పుడు టైర్లు లాక్ అవ్వకుండా కాపాడే ఏబీఎస్ (ABS) ఫీచర్ ప్రాణాలను రక్షిస్తుంది. సింగిల్ ఛానల్ ఏబీఎస్ కేవలం ముందు చక్రానికి మాత్రమే రక్షణ ఇస్తే, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ రెండు చక్రాలను అదుపులో ఉంచుతుంది. తడి రోడ్ల పైన లేదా ఇసుక ఉన్న ప్రాంతాల్లో ఇది బైక్ స్కిడ్ కాకుండా చూస్తుంది. తక్కువ ధరలో ఈ అద్భుతమైన ఫీచర్‌ను అందిస్తున్న టాప్ 5 బైకుల వివరాలు ఇప్పుడు చూద్దాం.

హీరో ఎక్స్‌ట్రీమ్ 125 ఆర్ (Hero Xtreme 125R)..
ఈ జాబితాలో అత్యంత చౌకైన ఆప్షన్ హీరో ఎక్స్‌ట్రీమ్ 125 ఆర్. దీని డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వేరియంట్ ధర ఎక్స్‌షోరూమ్ వద్ద రూ. 1.07 లక్షలుగా ఉంది. 124.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్ 11.5 హెచ్‌పి పవర్ ఇస్తుంది. తక్కువ బడ్జెట్‌లో స్పోర్టీ లుక్ తో పాటు మంచి సేఫ్టీ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

 బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160)..
రెండవ స్థానంలో నిలిచిన బజాజ్ పల్సర్ ఎన్160 ధర రూ. 1.17 లక్షలు (ఎక్స్‌షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 164 సీసీ ఇంజిన్ కలదు. ఇది 15 హెచ్‌పి పవర్, 14 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్ సిటీ రైడింగ్‌కు చాలా సౌకర్యంగా ఉంటుంది.

టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 2వీ (TVS Apache RTR 160 2V)..
టీవీఎస్ నుండి వచ్చిన ఈ పాపులర్ మోడల్ ధర రూ. 1.24 లక్షలుగా ఉంది. 159 సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్ 15 హెచ్‌పి పవర్ ఇస్తుంది. ఓబీడీ-2బీ (OBD-2B) నిబంధనలకు అనుగుణంగా దీనిని రూపొందించారు. పెర్ఫార్మెన్స్‌లో దీనికి తిరుగులేదు.

బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్160 (Bajaj Pulsar NS160)..
పల్సర్ సిరీస్ లో మరో పవర్‌ఫుల్ బైక్ ఎన్‌ఎస్160. దీని డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వేరియంట్ రూ. 1.29 లక్షల ధరకు లభిస్తోంది. ఇందులో 160.3 సీసీ ఆయిల్ కూల్డ్ 4-వాల్వ్ ఇంజిన్ ఉంది. ఇది ఏకంగా 16.69 హెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తూ రైడర్‌కు అదిరిపోయే కిక్ ఇస్తుంది.

టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ (TVS Apache RTR 160 4V)..
జాబితాలో చివరిగా టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ నిలిచింది. దీని ధర రూ. 1.30 లక్షలు. ఇందులో స్పోర్ట్, అర్బన్, రైన్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉండటం విశేషం. స్పోర్ట్ మోడ్‌లో ఇది 17.6 హెచ్‌పి పవర్‌తో దూసుకుపోతుంది. రోడ్డు ప్రమాదాల నుండి తప్పించుకోవడానికి కేవలం స్కిల్స్ ఉంటే సరిపోదు, వాహనంలో ఇలాంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్లు ఉండటం కూడా చాలా అవసరం. బడ్జెట్ కొంచెం పెరిగినా సరే డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఉన్న బైక్ కొనుగోలు చేయడం ఎప్పుడూ ఉత్తమంమ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!
కారును మీ ఇష్టం వచ్చినచోట పార్క్‌ చేస్తే ఇన్సూరెన్స్‌ రాదు! ఈ నిబంధనలు తెలుసుకోండి
మీ కారు ఎక్కడంటే అక్కడ పార్క్ చేస్తున్నారా? ఈ తప్పు చేస్తే ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కష్టమే!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
Embed widget