అన్వేషించండి

Honda Shine 125 EMI Calculator: మధ్యతరగతి మెచ్చిన హోండా షైన్ 125 కొనాల‌నుకుంటున్నారా..! ఈఎంఐ వివ‌రాలు ఇవిగో! 

హోండా షైన్ 125 బైక్ ఫీచర్లు, ధర అలాగే ఈఎంఐ ఆప్షన్ల గురించి వివ‌రంగా తెలుసుకుందాం . అలాగే తక్కువ వడ్డీతో సులభంగా మీ డ్రీమ్ బైక్ సొంతం చేసుకునే అవకాశం గురించిన వివ‌రాలు..

Honda Shine 125 EMI Calculator Update: ఇండియ‌న్ టూ-వీలర్ మార్కెట్‌లో కమ్యూటర్ మోటార్ సైకిళ్ల హవా ఎప్పుడూ ఉంటుంది. ఒకప్పుడు 100-110 సీసీ బైక్‌లు ఎక్కువగా అమ్ముడయ్యేవి. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని 125 సీసీ బైకులు ఆక్రమించాయి. ఈ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన పేరు 'హోండా షైన్ 125'. తన స్మూత్ ఇంజిన్ పర్ఫార్మెన్స్, కంఫర్ట్ రైడ్, నమ్మకానికి ఇది కేరాఫ్ అడ్రస్. ప్రస్తుతం ఈ బైక్ డ్రమ్ (Drum), డిస్క్ (Disc) అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 81,502 నుండి రూ. 85,862 మధ్య ఉంది. ఇటీవలే కంపెనీ ఇందులో ఒక లిమిటెడ్ ఎడిషన్‌ను కూడా ప్రవేశపెట్టింది.

ఇంజిన్ సామర్థ్యం - పవర్..
హోండా షైన్ 125 లో 123.94 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 7,500 ఆర్పీఎమ్ వద్ద 10.6 బిహెచ్‌పి పవర్, 6,000 ఆర్పీఎమ్ వద్ద 11 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో దూసుకుపోవడానికి, మైలేజ్ ఇవ్వడానికి ఈ ఇంజిన్ చాలా పక్కాగా సెట్ అవుతుందని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

నెలకు ఎంత ఈఎంఐ కట్టాలి?
మీరు హోండా షైన్ 125 కొనాలని ప్లాన్ చేస్తూ, నెలకు ఎంత ఈఎంఐ (EMI) పడుతుందో అని ఆలోచిస్తున్నారా? మీ కోసం ఒక చిన్న లెక్క ఇక్కడ ఉంది. ఈ లెక్క కోసం మనం డిస్క్ వేరియంట్‌ను తీసుకుందాం. దీని ధర రూ. 85,862 అనుకుంటే, పూర్తి మొత్తం అంటే 100 శాతం లోన్ తీసుకున్నట్లు భావిద్దాం. వడ్డీ రేటు 9.5 శాతంగా తీసుకుంటే మీరు ఎంచుకునే కాలపరిమితిని బట్టి ఈఎంఐ మారుతుంది.

12 నెలల కాలపరిమితి  లోన్ తీసుకుంటే, నెలకు సుమారు రూ. 7,548 ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. దీనివల్ల మీరు అదనంగా చెల్లించే మొత్తం వడ్డీ రూ. 4,717 అవుతుంది. అదే 24 నెలల కాలపరిమితికి  ఒకవేళ మీరు లోన్ తీసుకుంటే, నెలకు కట్టాల్సిన ఈఎంఐ రూ. 3,962 కి తగ్గుతుంది. అయితే ఇక్కడ మీరు చెల్లించే మొత్తం వడ్డీ రూ. 9,219 కి పెరుగుతుంది.

గ‌మనించాల్సిన‌వి..
పైన చెప్పిన ఈఎంఐ లెక్కలు కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. మీరు కట్టే డౌన్ పేమెంట్ (Down Payment), తీసుకునే లోన్ మొత్తం, బ్యాంకు వారు ఆఫర్ చేసే వడ్డీ రేటును బట్టి ఈ అంకెలు మారవచ్చు. మనం చెల్లించే వడ్డీ అమౌంట్ పై దానితో ముడిపడి ఉంటాయి.  అందుకే బైక్ కొనే ముందు ఒకసారి దగ్గరలోని హోండా షోరూమ్ కు వెళ్లి తాజా ఫైనాన్స్ ఆఫర్ల గురించి ఎంక్వైరీ చేయడం ఉత్తమమ‌ని నిపుణులు పేర్కొంటున్నారు. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ వంటి ఇతర బైక్‌లతో పోలిస్తే, హోండా షైన్ ఇచ్చే ప్రీమియం ఫీల్, ఇంజిన్ స్మూత్‌నెస్ కోసం కొంచెం ఎక్కువ ఖర్చు చేయడానికి వాహనదారులు మొగ్గు చూపుతున్నారని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఏదేమైనా సాధ్యమైనంత ఎక్కువ డౌన్ పేమెంట్ ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చని, అలాగే రుణ కాలాన్ని తక్కువ నెలలు పెట్టుకుంటే కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్తుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

RE Hunter 350 ఫైనాన్స్‌ ఆప్షన్లు - తెలుగు రాష్ట్రాల్లో హంటర్ 350 ధర, బెస్ట్‌ EMI ప్లాన్స్ ఇవే!
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హంటర్‌ 350 EMI ఆప్షన్లు - తక్కువ EMI కోసం ఏ ప్లాన్‌ ఎంచుకోవాలి?
Triumph Speed 400 కోసం కనీసం ఎంత డౌన్‌పేమెంట్‌ కట్టాలి? ప్రతి నెలా EMI ఎంత పడుతుంది?
కేవలం రూ.29,000కే ట్రయంఫ్ స్పీడ్ 400 మీ సొంతం - ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్లు ఉన్నాయ్‌!
సుజుకి e-యాక్సెస్ రోడ్ టెస్ట్: రేంజ్, స్పీడ్, స్టోరేజ్‌ వంటివన్నీ రూ.1.92 లక్షల ధరకు తగ్గట్లుగానే ఉన్నాయా?
సుజుకి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. రూ.1.92 లక్షల పెట్టి కొనడం సరైన నిర్ణయమేనా?
ఫాసినో 125 కొనబోతున్నారా? రూ.78,000-రూ.99,000 రేంజ్‌లో మారే ఫీచర్లు ఏంటో తెలుసా?
యమహా ఫాసినో 125లో 3 వేరియంట్లు - కేవలం రూ.21,000 వ్యత్యాసంలో ఏది బెస్ట్‌ ఆప్షన్‌?

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram AE Nookaraju Case: ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఎపిసోడ్‌పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు! సోషల్ మీడియాలో సౌజన్య లేఖ వైరల్‌!
ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఎపిసోడ్‌పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు! సోషల్ మీడియాలో సౌజన్య లేఖ వైరల్‌!
Janasena in Telangana MLC Elections: తెలంగాణలో జనసేన పొలిటికల్ యాక్టివిటీస్ షురూ! యువతను టార్గెట్ చేస్తూ కీలక నిర్ణయం!
తెలంగాణలో జనసేన పొలిటికల్ యాక్టివిటీస్ షురూ! యువతను టార్గెట్ చేస్తూ కీలక నిర్ణయం!
"నా గొంతు నొక్కేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు" కుటుంబ వివాదాలపై స్పందించిన జోగి రమేష్‌ 
Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
Chennai Suitcase Murder Case: చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
Mahakali Glimpse : పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
Triumph Speed 400 కోసం కనీసం ఎంత డౌన్‌పేమెంట్‌ కట్టాలి? ప్రతి నెలా EMI ఎంత పడుతుంది?
కేవలం రూ.29,000కే ట్రయంఫ్ స్పీడ్ 400 మీ సొంతం - ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్లు ఉన్నాయ్‌!
Brydon Carse Arrest: నైట్‌క్లబ్‌లో రచ్చతో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండ‌ర్ అరెస్ట్.. చేతులకు బేడీలతో దొరికిన ప్లేయర్
నైట్‌క్లబ్‌లో రచ్చతో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండ‌ర్ అరెస్ట్.. చేతులకు బేడీలతో దొరికిన ప్లేయర్
Embed widget