అన్వేషించండి

Hyundai Creta Summer Edition: మార్కెట్లోకి హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్ - మధ్యతరగతి బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు!

హ్యుందాయ్ ఇండియా తన పాపులర్ ఎస్‌యూవీ క్రెటాలో 'సమ్మర్ ఎడిషన్'ను విడుదల చేసింది. తక్కువ ధర వేరియంట్లలో కూడా డ్యాష్‌క్యామ్ వంటి ప్రీమియం ఫీచర్లు అందించడమే దీని ప్రత్యేకత.

Hyundai Launches Creta Summer Edition News: ఇండియ‌న్ ఎస్‌యూవీ (SUV) మార్కెట్లో తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు సరికొత్త 'సమ్మర్ ఎడిషన్' (Summer Edition) రూపంలో మన ముందుకు వచ్చింది. సాధారణంగా ఖరీదైన టాప్ వేరియంట్లలో మాత్రమే ఉండే ప్రీమియం ఫీచర్లను, ఇప్పుడు తక్కువ ధర కలిగిన బేస్, మిడ్-లెవల్ ట్రిమ్స్‌లో కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ఎడిషన్ ప్రారంభ ధర ఎక్స్‌షోరూమ్ వద్ద రూ. 12.05 లక్షలుగా ఉండగా, టాప్ మోడల్ ధర రూ. 17.88 లక్షల వరకు ఉంటుంది. హ్యుందాయ్ వెబ్‌సైట్ ద్వారా లేదా దగ్గరలోని డీలర్‌షిప్‌ల వద్ద ఈ కారును బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి.

ఏ వేరియంట్‌లో మార్పులు ..?
హ్యుందాయ్ ఈ సమ్మర్ ఎడిషన్‌ను ఆరు వేరియంట్లలో ఆఫర్ చేస్తోంది. EX వేరియంట్ లో స్మార్ట్ కీ, పుష్-బటన్ స్టార్ట్ సదుపాయాన్ని కొత్తగా చేర్చారు. EX(O) వేరియంట్ లో క్వాడ్-బీమ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టైల్ ల్యాంప్స్, డీఆర్ఎల్స్ (DRLs), రియర్ విండో సన్‌షేడ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. S(O) & SX వేరియంట్ లో భద్రత కోసం ఈ వేరియంట్లలో ఇన్-బిల్ట్ 'డ్యాష్‌క్యామ్' (Dashcam) అమర్చారు. SX Premium వేరియంట్ లో  10.25-అంగుళాల డిజిటల్ క్లస్టర్, సరౌండ్ వ్యూ మానిటర్, బ్లైండ్-స్పాట్ వ్యూ మానిటర్ వంటి హై-ఎండ్ టెక్నాలజీని అందించారు.

డ్యాష్‌క్యామ్ ప్రత్యేకతలు..
ఈ సమ్మర్ ఎడిషన్‌లో ప్రధాన ఆకర్షణ డ్యాష్‌క్యామ్. ఇది నిరంతరం రికార్డింగ్ చేయడమే కాకుండా, ఎమర్జెన్సీ సమయంలో ఆటోమేటిక్‌గా వీడియోలను సేవ్ చేస్తుంది. వెకేషన్ మోడ్ ద్వారా జ‌ర్నీ సీన్ల‌ను బంధించవచ్చు. ప్రత్యేకమైన యాప్ సహాయంతో ఈ వీడియోలను నేరుగా స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకునే వీలుంది. కస్టమర్ల సేఫ్టీ, కన్వీనియన్స్ దృష్టిలో ఉంచుకుని హ్యుందాయ్ ఈ అప్‌డేట్స్ ఇచ్చింది.

ఇంజిన్ సామర్థ్యం - పర్ఫార్మెన్స్..
ఈ సమ్మర్ ఎడిషన్ కేవలం 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. టర్బో-పెట్రోల్ ఇంజిన్ కావాలనుకునే వారికి ఈ వెర్షన్ అందుబాటులో లేదు. పెట్రోల్ ఇంజిన్ 115 హెచ్‌పి పవర్ ఇస్తుండగా, డీజిల్ ఇంజిన్ 118 హెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2 లక్షలకు పైగా క్రెటా కార్లు అమ్ముడయ్యాయని, ఈ కొత్త వేరియంట్లు క్రెటా ఆధిపత్యాన్ని మరింత పెంచుతాయని హ్యుందాయ్ నేషనల్ సేల్స్ హెడ్ సునీల్ మూల్‌చందాని ఆశాభావం వ్యక్తం చేశారు.

మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో క్రెటా క్రేజ్ ఈ అప్‌డేట్స్‌తో మరో స్థాయికి చేరనుందని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా మధ్య తరగతి పవర్ఫుల్ ఎస్ యూవీ స్థాయిలోని అందించడంపై విశ్లేషకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sachin Tendulkar Car Collection: సచిన్ సూప‌ర్బ్ కార్ క‌లెక్ష‌న్: క్రికెట్ గాడ్ లగ్జరీ గ్యారేజ్ లోని టాప్ కార్ల కలెక్షన్ పై ఒక లుక్
సచిన్ సూప‌ర్బ్ కార్ క‌లెక్ష‌న్: క్రికెట్ గాడ్ లగ్జరీ గ్యారేజ్ లోని టాప్ కార్ల కలెక్షన్ పై ఒక లుక్
India Vehicle Sales Record: ఇండియ‌న్ ఆటోమొబైల్ రికార్డుల జోరు: నిమిషానికి 54 వాహనాల అమ్మకాలతో దూసుకెళ్తున్న డొమెస్టిక్ మార్కెట్
ఇండియ‌న్ ఆటోమొబైల్ రికార్డుల జోరు: నిమిషానికి 54 వాహనాల అమ్మకాలతో దూసుకెళ్తున్న డొమెస్టిక్ మార్కెట్
New Ethanol Blending Standards: ఇండియాలో ఇంధన విప్లవం - కొత్త ఇథనాల్ బ్లెండింగ్ ప్రమాణాలను నోటిఫై చేసిన కేంద్రం
ఇండియాలో ఇంధన విప్లవం - కొత్త ఇథనాల్ బ్లెండింగ్ ప్రమాణాలను నోటిఫై చేసిన కేంద్రం
Tata Sierra SUVకు గట్టి పోటీ ఇవ్వనున్న Jeep Renegade.. దీని ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Tata Sierra SUVకు గట్టి పోటీ ఇవ్వనున్న Jeep Renegade.. దీని ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Advertisement

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Review : పెద్దిపై రామ్ చరణ్ ఫస్ట్ రివ్యూ - ఉప్పెన క్లైమాక్స్‌కు 100 రెట్లు బిగ్ ట్విస్ట్... అసలేంటీ స్టోరీ!
పెద్దిపై రామ్ చరణ్ ఫస్ట్ రివ్యూ - ఉప్పెన క్లైమాక్స్‌కు 100 రెట్లు బిగ్ ట్విస్ట్... అసలేంటీ స్టోరీ!
Minimum Wages in Telangana: తెలంగాణలో కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయం! జూన్ నుంచి అమలు!
తెలంగాణలో కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయం! జూన్ నుంచి అమలు!
TMC Political Crisis: చీలిక దిశగా తృణమూల్ కాంగ్రెస్‌! మమత, అభిషేక్‌ వర్గాలుగా విడిపోయిన నేతలు! 
చీలిక దిశగా తృణమూల్ కాంగ్రెస్‌! మమత, అభిషేక్‌ వర్గాలుగా విడిపోయిన నేతలు! 
Tamil Nadu Chief Minister Vijay Cabinet Expansion: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ క్యాబినెట్‌లో చేరిన 23 మంది!  కొత్తగా ప్రమాణం చేసిన మంత్రుల జాబితా ఇదే!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ క్యాబినెట్‌లో చేరిన 23 మంది!  కొత్తగా ప్రమాణం చేసిన మంత్రుల జాబితా ఇదే!
Andhra Pradesh and Telangana Weather Updates: ఎండ దాటికి తెలుగు రాష్ట్రాల్లో పగులుతున్న రోళ్లు! రికార్డు స్థాయిలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు!
ఎండ దాటికి తెలుగు రాష్ట్రాల్లో పగులుతున్న రోళ్లు! రికార్డు స్థాయిలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు!
Kara OTT : ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
New Ethanol Blending Standards: ఇండియాలో ఇంధన విప్లవం - కొత్త ఇథనాల్ బ్లెండింగ్ ప్రమాణాలను నోటిఫై చేసిన కేంద్రం
ఇండియాలో ఇంధన విప్లవం - కొత్త ఇథనాల్ బ్లెండింగ్ ప్రమాణాలను నోటిఫై చేసిన కేంద్రం
Mega 158 Movie : చిరు మెగా 158 మూవీ లాంచ్ - అన్నయ్యకు క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
చిరు మెగా 158 మూవీ లాంచ్ - అన్నయ్యకు క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
Embed widget