అన్వేషించండి

Budget Cars: ఐదు లక్షల లోపు వచ్చే బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు! మధ్యతరగతి కల నెరవేర్చే టాప్ 7 మోడల్స్ ఇవే!

Budget Cars: భారత్‌లో మధ్యతరగతి కుటుంబాలకు కారు అనేది కల. అలాంటి డ్రీమ్ ఎంత తక్కువ ధరలో నెరవేరితే అంత మంచిది అనుకుంటారు. అలాంటి వారి కోసం ఐదు లక్షల్లో లభించే  హ్యాచ్‌బ్యాక్‌లు ఉన్నాయి.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఐదు లక్షల లోపు లభించే బడ్జెట్ కార్లు నగర ప్రయాణానికి అనుకూలం.
  • మారుతి ఎస్-ప్రెస్సో, ఆల్టో కే10 అత్యంత చౌకైన, మైలేజ్ కార్లు.
  • టాటా టియాగో 4-స్టార్ భద్రతతో, రెనాల్ట్ క్విడ్ స్టైలిష్ లుక్ తో లభిస్తాయి.
  • మారుతి సెలెరియో, వాగన్ ఆర్ ఎక్కువ మైలేజ్, కుటుంబ అవసరాలకు అనుకూలం.

Budget Cars: భారతీయ రహదారులపై ఎస్‌యూవీల హవా పెరుగుతున్నప్పటికీ, సామాన్యుడికి ఇప్పటికీ హ్యాచ్‌బ్యాక్ కార్లే మొదటి ఎంపిగా ఉంటోంది. ముఖ్యంగా నగరాల్లో ప్రయాణించడానికి, ఇరుకైన సందుల్లో పార్కింగ్‌ చేయడానికి, తక్కువ నిర్వహణ ఖర్చుతో కారు నడపాలనుకునే వారికి ఐదు లక్షల లోపు లభించే కార్లు వరంలాంటివి. ఈ విభాగంలో ఉన్న ఏడు బెస్ట్ కార్ల వివరాలు తెలుసుకుందాం. 

మారుతి సుజుకి ఎస్‌ప్రెస్సో:- ఈ జాబితాలో అత్యంత తక్కువ ధర కలిగిన కారు ఇదే. దీని ఎక్స్‌ షోరూమ్ ధర 3.50 లక్షల నుంచి రూ. 5.25 లక్షల వరకు ఉంటుంది. ఇది లీటర్‌కు 21.4 నుంచి 32.7 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. పెట్రోల్‌, సీఎన్జీ వేరియెంట్లలో లభిస్తుంది. 

మారుతి సుజుకి ఆల్టో కే10:- దశాబ్దాలుగా మధ్యతరగతికి నమ్మకమైన కారుగా ఉన్న ఆల్టో కే 10 ధర 3.70 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది 24.4 నుంచి 33. 9 కిలోమీటర్ల మైలేజీని ఇస్తూ అత్యంత పొదుపైన కారుగా నిలిచింది. ఇందులో ఆటోమేటిక్‌, మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి. 

రెనాల్ట్‌ క్విడ్‌:- స్టైలిష్‌ లుక్ కోరుకునే వారికి క్విడ్ మంచి ఎంపిక. 4.30 లక్షల ప్రారంభ ధరతో లభించే ఈ కారు 21. 7 నుంచి 22. 5 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్‌, ఎస్‌యూవీ వంటి రూపం దీనికి ప్రత్యేక గుర్తింపునిచ్చాయి.

టాటా టియాగో:- ఈ విభాగంలో అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు కలిగిన కారు టాటా టియాగో . దీని ధర 4.57 లక్షల నుంచి ప్రారంభమై 8.10 లక్షల వరకు ఉంటుంది. గ్లోబల్‌ ఎన్‌సీఏపీ రేటింగ్‌లో దీనికి 4 స్టార్ రేటింగ్ ఉంది. ఇది ప్రయాణికుల భద్రతకు హామీ ఇస్తుంది. 

మారుతి సుజుకి సెలెరియో: అత్యధిక మైలేజీని ఆశించే వారి కోసం సెలెరియో రూపొందించారు. ఇది లీటర్‌కు గరిష్టంగా 34.4 కిలోమీటర్లు(సీఎన్జీ) మైలేజీని అందిస్తుంది. దీని ప్రారంభ ధర 4.70లక్షలుగా ఉంది. 

సిట్రోయెన్ సీ3:- యూరోపియన్ స్టీలింగ్, సౌకర్యవంతమైన ప్రయాణం కోరుకునే వారి కోసం సిట్రోయెన్ సీ3 అందుబాటులో ఉంది. దీని ధర 4.95 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది 18.3 నుంచి 19.3 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. 

మారుతి సుజుకి వాగన్‌‌ ఆర్:- కుటుంబ అవసరాలకు ఎక్కువ స్థలం కావాలనుకునే వారికి వాగన్ ఆర్ సరైన ఎంపిక. 4.99 లక్షల ప్రారంభ ధరతో లభించే ఈ కారు 20.5 నుంచి 33. 5 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. 
  
 మీరు తక్కువ ధరకు సిటీ డ్రైవింగ్ కోసం అయితే ఎస్‌ ప్రెస్సో లేదా ఆల్టో కే 10 కొనుక్కోవచ్చు. భద్రతే ముఖ్యమనుకుంటే మాత్రం 4 స్టార్ రేటింగ్ ఉన్న టాటా టియాగోను ఎంచుకోవచ్చు. మైలేజీ కావాలనుకుంటే మారుతి సెలెరియో లేదా వాగన్ ఆర్ మంచివి.. స్లైల్, డిజైన్ కోరుకుంటే రెనాల్ట్ క్విడ్ లేదా సిట్రోయెన్ సీ3 బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. 

Frequently Asked Questions

భారతదేశంలో రూ. 5 లక్షల లోపు ఏ ఏ బడ్జెట్ కార్లు అందుబాటులో ఉన్నాయి?

మారుతి సుజుకి ఎస్‌ప్రెస్సో, ఆల్టో కే10, రెనాల్ట్‌ క్విడ్‌, టాటా టియాగో, మారుతి సుజుకి సెలెరియో, సిట్రోయెన్ సీ3, మరియు మారుతి సుజుకి వాగన్‌‌ ఆర్ వంటి కార్లు రూ. 5 లక్షల లోపు అందుబాటులో ఉన్నాయి.

నగర ప్రయాణాలకు, తక్కువ నిర్వహణ ఖర్చుతో ఏ కారు ఉత్తమమైనది?

నగర ప్రయాణాలకు, తక్కువ నిర్వహణ ఖర్చుతో ఎస్‌ప్రెస్సో లేదా ఆల్టో కే 10 వంటి కార్లు మంచి ఎంపికలు.

భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేవారికి ఏ కారు సిఫార్సు చేయబడింది?

భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేవారికి, గ్లోబల్‌ ఎన్‌సీఏపీ రేటింగ్‌లో 4 స్టార్ రేటింగ్‌తో టాటా టియాగో ఉత్తమ ఎంపిక.

అత్యధిక మైలేజీని అందించే కార్లు ఏవి?

అత్యధిక మైలేజీని అందించే కార్లలో మారుతి సుజుకి సెలెరియో (34.4 కిమీ/లీటర్ వరకు) మరియు మారుతి సుజుకి వాగన్‌‌ ఆర్ (33.5 కిమీ/లీటర్ వరకు) ముఖ్యమైనవి.

స్టైలిష్ లుక్ మరియు SUV లాంటి డిజైన్ కోరుకునే వారికి ఏ కారు మంచిది?

స్టైలిష్ లుక్ మరియు SUV లాంటి డిజైన్ కోరుకునే వారికి రెనాల్ట్‌ క్విడ్‌ మంచి ఎంపిక.

టాప్ హెడ్ లైన్స్

కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?
Ducati Monster V2 vs Triumph Street Triple 765 RS - 111hp vs 130hp.. ధర, పవర్, టార్క్‌లో ఏది బెస్ట్?
ట్రయంఫ్‌ స్ట్రీట్‌ ట్రిపుల్‌ 765 RS vs డుకాటి మాన్‌స్టర్‌ V2 - రేటు రూ.1 లక్ష తక్కువైనా 'పవర్‌'లో అదరగొడుతోంది!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget