అన్వేషించండి

Car Body Types : కార్లలో ఎన్ని రకాల బాడీలు ఉన్నాయి? వాటిలో ఉన్న తేడాలు ఏంటీ? మీ అవసరాలకు తగ్గ కారును ఎంచుకోవడం ఎలా?

Car Body Types : కొత్తగా కారు కొనాలనుకునే వారు బాడీ టైపుల మధ్య ఉన్న వ్యత్యాసాలను గుర్తించడం అవసరం. హ్యాచ్‌బ్యాక్, సెడాన్, ఎస్‌యూవీ, తర బాడీ స్టైల్‌ ప్రత్యేకతలు తెలుసుకోవడం ముఖ్యం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సిటీ ప్రయాణాలకు హ్యాచ్‌బ్యాక్ కార్లు, చిన్న కుటుంబాలకు సరైనవి.
  • సెడాన్‌లు స్థిరత్వం, సౌకర్యవంతమైన హైవే ప్రయాణాలకు అనుకూలం.
  • SUVలు ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, శక్తివంతమైన ఇంజిన్‌లతో వస్తాయి.
  • MPVలు పెద్ద కుటుంబాలకు, ఎక్కువ మంది ప్రయాణానికి ఉత్తమమైనవి.

Car Body Types : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌ ప్రస్తుతం ఒక కీలకమైన దశలో ఉంది. ఒకప్పుడు కారు అంటే కేవలం రవాణా సాధనం మాత్రమే. కానీ నేడు అది ఒక హోదాకు, లైఫ్‌స్టైల్‌కు ప్రతిరూపంగా మారింది. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు,  పెరుగుతున్న ఇంధన ధరలు, విభిన్నమైన రోడ్లు దృష్ట్యా, వాహనదారులు తమ అవసరాలకు తగ్గట్టుగా సరైన బాడీ టైప్ ఎంచుకోవడం ఒక సవాల్‌గా మారింది. అసలు హ్యాచ్‌బ్యాక్ అంటే ఏంటీ సెడాన్ ఎందుకు ప్రత్యేకం, ఎస్యూవీలు ఎందుకు ట్రెండింగ్‌లో ఉన్నాయి. వంటి వివరాలు చూద్దాం. 

సిటీ లైఫ్‌కు హ్యాచ్‌బ్యాక్‌ స్మార్ట్ ఛాయిస్

హ్యాచ్‌బ్యాక్ కార్లు భారతీయ మధ్యతరగతి ప్రజలు అత్యంత ఇష్టమైన వాహనాలు ఇవి కాంపా్ట్ సైజులో ఉండి, సాధారణంగా నాలుపగు నుంచి ఐదు డోర్‌లు కలిగి ఉంటాయి. వీటి వెనుక భాగంపైకి తెరుచుకుంటుంది. అందుకే వీటిని హ్యాచ్ బ్యాక్ అని పిలుస్తారు. 

ఇవి చిన్న పరిమాణంలో ఉండి, పార్కింగ్‌ చేయడానికి, ట్రాఫిక్‌లో నడపడానికి చాలా సులభంహగా ఉంటాయి. వీటిలో లగేజ్ స్పేస్‌ ప్యాసింజర్ ఏరియాతో ముడిపడి ఉంటుంది. మొదటిసారి కారు కొనేవారు, చిన్న కుటుంబాలకు, ఆఫీస్ కమ్యూటర్‌లకు ఇది మంచి ఆప్షన్. హైదరాబాద్ వంటి రద్దీ నగరాల్లో సులభంగా ప్రయాణించడానికి ఇవి అనుకూలం. 

కంఫర్ట్, క్లాస్ కలయిక సెడాన్‌

సెడాన్‌లు వాటి విలక్షణమైన త్రి బాక్స్ డిజైన్‌కు ప్రసిద్ధి. అంటే ఇంజిన్, క్యాబిన్, బూట్‌ విడివిడిగా మూడు భాగాలుగా ఉంటాయి. ఇవి సాధారణంగా నాలుగు డోర్‌లు కలిగి ఉంటాయి. వేరుగా ట్రంక్‌ స్పేస్‌ ఉంటుంది. సెడాన్‌లు తక్కువ గ్రౌండ్‌ క్లియరెన్స్ కలిగి ఉన్నప్పటికీ, హైవేలపై  ప్రయాణించేటప్పుడు అద్భుతమైన స్థిరత్వాన్ని, స్మూత్‌ రైడ్‌ను అందిస్తాయి. లాంగ్‌ డ్రైవ్‌లు ఎక్కువ చేసి వారు, ఎగ్జిక్యూటివ్స్‌, కంఫర్ట్‌కు ప్రాధాన్యత ఇచ్చే కుటుంబాలకు సెడాన్ సరైంది. 

పవర్‌, అడ్వెంచర్‌ ఎస్‌యూవీ

ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో ఎస్‌యూవీల హవా నడుస్తోంది. ఇవి ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్‌, పవర్‌ఫుల్ ఇంజిన్, స్ట్రాంగ్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఇవి రఫ్ రోడ్లు, ఆఫ్‌రోడ్‌ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. హ్యాచ్‌బ్యాక్ కంటే ఎక్కువ స్థలం, ఎత్తైన సీటింగ్ పొటిషన్ వీటి ప్రత్యేకత. అడ్వెంచర్ లవర్స్‌, పెద్ద కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాల్లో, రఫ్‌ రోడ్లపై ప్రయాణించే వాళ్లకు మంచి ఆప్షన్. 

పెద్ద కుటుంబాల నేస్తం ఎంపీవీ

వీటిని మల్టీ పర్పస్‌ వెహికల్స్ అని కూడా అంటారు. పేరుకు తగ్గట్టుగానే ఇవి ఎక్కువ మంది ప్రయాణించడానికి, ఎక్కువ సామాను మోయడానికి ఉపయోగపడుతుంది. సాధారణంగా ఆరు నుంచి 8 సీటింగ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. విశాలమైన స్పేస్‌  అందిస్తాయి. ప్యాసింజర్ కంఫ్ట్‌ విషయంలో ఇవి ఒక మెట్టు పైనే ఉంటాయి. ఉమ్మడి కుటుంబాలు, ట్రావెల్స్ గ్రూప్‌, టూర్స్ అండ్ ట్రావెల్స్ వ్యాపారం చేసే వారికి ఇవి బెస్ట్ ఛాయిస్. 

కోపే, కన్వర్టెబుల్, పికప్‌ మోడల్స్ ఎలా యూజ్ అవుతాయి?

కూపే: సాధారణంగా రెండు డోర్‌లతో వస్తుంది. స్లోపింగ్ రూఫ్‌ లైన్‌తో స్పోర్టీగా కనిపిస్తాయి. ఇవి స్పీడ్‌, స్టైల్‌ ఇష్టపడే యువతకు సరిపోతాయి. 

కన్వర్టబుల్‌:  పై కప్పును ఓపెన్ లేదా క్లోజ్ చేయగలిగే సౌకర్యం ఉన్న కార్లు. విలాసవంతమైన జీవశైలని ఇష్టపడేవారికి ఇవి అనుకూలంగా ఉంటాయి. 

పికప్‌ ట్రక్: వెనుక భాగంలో ఓపెన్‌ కార్గో బెట్ ఉంటుంది. ఇవి ప్రధానంగా లోడింగ్, బిజినెస్‌, ఫార్మింగ్‌ అవసరాలకు ఉపయోగపడతాయి. 

మీరు ఏ బాడి కారును ఎలా ఎంచుకోవాలి?

కారు కొనడం అనేది వ్యక్తిగత విషయం, నిర్ణయం. మీ ఎంపిక సరిగా ఉండాలంటే చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. మీరు కేవలం సిటీలో ఆఫీస్‌ కోసం కారు వాడుతున్నట్టు అయితే హ్యాచ్‌బ్యాక్ బెస్ట్. మీది పెద్ద కుుటంబం యితే ఎంపీవీ లేదా ఎస్‌యూవీనీ ఎంచుకోండి. మీరు వెళ్లే రోడ్డులో గుంతలు ఎక్కువగా ఉంటే గ్రౌండ్ క్లియరెన్స్‌ ఉన్న ఎస్‌యూవీ తీసుకోండి. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజీ కావాలంటే హ్యాచ్‌బ్యాక్‌లు సరైనవి. 

Frequently Asked Questions

హ్యాచ్‌బ్యాక్ కార్లు ఎవరికి అనుకూలం?

హ్యాచ్‌బ్యాక్ కార్లు కాంపాక్ట్ సైజులో ఉండి, పార్కింగ్ మరియు ట్రాఫిక్ లో నడపడానికి సులభంగా ఉంటాయి. మొదటిసారి కారు కొనేవారు, చిన్న కుటుంబాలకు, ఆఫీస్ కమ్యూటర్లకు ఇవి మంచి ఆప్షన్.

సెడాన్ కార్లు ఏ రకమైన ప్రయాణాలకు ఉత్తమమైనవి?

సెడాన్లు హైవేలపై ప్రయాణించేటప్పుడు అద్భుతమైన స్థిరత్వాన్ని, స్మూత్ రైడ్ ను అందిస్తాయి. లాంగ్ డ్రైవ్ లు ఎక్కువ చేసేవారు, ఎగ్జిక్యూటివ్ లకు ఇవి సరైనవి.

ఎస్ యూవీ కార్లను ఎందుకు ఎంచుకోవాలి?

ఎస్ యూవీలు ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, పవర్ఫుల్ ఇంజిన్, స్ట్రాంగ్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. రఫ్ రోడ్లు, ఆఫ్-రోడ్ ప్రయాణాలకు ఇవి అనుకూలంగా ఉంటాయి.

పెద్ద కుటుంబాలకు ఏ రకం వాహనం సరైనది?

పెద్ద కుటుంబాలు, ఎక్కువ మంది ప్రయాణించడానికి, ఎక్కువ సామాను మోయడానికి ఎంపీవీలు (మల్టీ పర్పస్ వెహికల్స్) ఉపయోగపడతాయి. ఇవి 6 నుండి 8 సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

టాప్ హెడ్ లైన్స్

గత నెలలో ప్రజలు ఈ కార్ల కోసమే షోరూమ్‌ల ముందు క్యూ కట్టారు.. టాప్‌-10 కార్ల లిస్ట్‌
ఆగస్టులో దేశవ్యాప్తంగా ఈ కార్లకు ఫుల్ డిమాండ్.. టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ లిస్ట్‌ మీ కోసం
బ్రేక్ వేయడం నుంచి లేన్ మార్చే వరకు.. కారులో ADAS ఉంటే భద్రత మరింత పెరుగుతుందా?
కార్లలో ADAS ఉంటే ప్రమాదాల ముప్పు తగ్గుతుందా? అసలు ADAS అంటే ఏంటి?
OTT లాగే కొత్త కార్లనీ సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు, కొనకుండానే దర్జాగా తిరగొచ్చు, బోర్‌ కొడితే మార్చేయొచ్చు
కారు కొనాల్సిన పని లేదు.. సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే చాలు, కొత్త మోడల్‌ మీ ఇంటి ముందు ఉంటుంది
నెలకు రూ.12,000 EMIతోనూ మారుతి బ్రెజ్జా మీ ఇంటికొస్తుంది, లోన్‌ ఎంత తీసుకోవాలంటే?
కేవలం రూ.లక్షన్నరతో Maruti Brezzaను మీ ఇంటికి తెచ్చుకోవచ్చు! నెలకు ఎంత చెల్లించాలంటే?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
OTT లాగే కొత్త కార్లనీ సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు, కొనకుండానే దర్జాగా తిరగొచ్చు, బోర్‌ కొడితే మార్చేయొచ్చు
కారు కొనాల్సిన పని లేదు.. సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే చాలు, కొత్త మోడల్‌ మీ ఇంటి ముందు ఉంటుంది
AP Fake Liquor Case: ములకలచెరువు నకిలీ మద్యం కేసు.. కోర్టులో లొంగిపోయిన జయచంద్రారెడ్డి, గిరిధర్‌ రెడ్డి
AP Fake Liquor Case: ములకలచెరువు నకిలీ మద్యం కేసు.. కోర్టులో లొంగిపోయిన జయచంద్రారెడ్డి, గిరిధర్‌ రెడ్డి
Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
Top Automatic Cars: ఆటోమేటిక్ కార్ కోసం చూస్తున్నారా? రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్లు ఇవే
ఆటోమేటిక్ కార్ కోసం చూస్తున్నారా? రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్లు ఇవే
Embed widget