అన్వేషించండి

Bajaj Pulsar 180 Vs Apache 180 Bikes: 180 సీసీ సెగ్మెంట్‌లో మళ్ళీ మొదలైన పోరు - పల్సర్ రీ-ఎంట్రీతో అపాచీకి చెక్!

బజాజ్ పల్సర్ 180 మళ్ళీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180తో దీనికి గట్టి పోటీ ఎదురవుతోంది. ఫీచర్లు, ధరల పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం.

Bajaj Pulsar 180 VS Apache 180 News: బజాజ్ ఆటో తన పవర్‌ఫుల్ కమ్యూటర్ లైనప్‌లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన 'పల్సర్ 180'ని మళ్ళీ ఇండియ‌న్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 2022లో నిలిపివేసిన ఈ మోడల్‌ను రూ. 1.22 లక్షల (ఎక్స్‌షోరూమ్) ధరతో రీ-లాంచ్ చేయడం విశేషం. ఈ బైక్ రాకతో 180 సీసీ విభాగంలో ఎప్పటినుండో రారాజుగా ఉన్న టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180కి గట్టి సవాలు ఎదురుకానుంది. మీరు కూడా మంచి 180 సీసీ బైక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ రెండింటిలో ఏది మీకు సెట్ అవుతుందో  తెలుసుకుందాం.

ఇంజిన్ - పర్ఫార్మెన్స్..
బజాజ్ పల్సర్ 180 లో 178.6 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 17 హెచ్‌పి పవర్, 15 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. మరోవైపు టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180 లో 177.4 సీసీ ఆయిల్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 17 హెచ్‌పి పవర్ తో పాటు 15.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండింటిలోనూ 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. అపాచీ ఇంజిన్ కొంచెం ఎక్కువ టార్క్‌తో స్పోర్టీగా అనిపిస్తే, పల్సర్ ఇంజిన్ డైలీ డ్రైవింగ్‌కు చాలా కంఫర్ట్‌గా, స్మూత్‌గా ఉంటుంది.

బరువు - కొలతలు..
ఇక్కడ టీవీఎస్ అపాచీ తన సత్తా చాటుతోంది. అపాచీ బరువు కేవలం 140 కేజీలు మాత్రమే. పల్సర్ 180 బరువు 156 కేజీలతో పోలిస్తే ఇది 16 కేజీలు తక్కువ. బరువు తక్కువ ఉండటం వల్ల ట్రాఫిక్‌లో అపాచీని నడపడం చాలా సులభం. అపాచీ గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీ ఉండగా, పల్సర్ కి 165 మిమీ మాత్రమే ఉంది. అయితే పల్సర్‌లో 15 లీటర్ల పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఉండటం వల్ల లాంగ్ రైడ్స్ చేసే వారికి పెట్రోల్ టెన్షన్ తక్కువగా ఉంటుంది. అపాచీలో ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్లు మాత్రమే.

ఫీచర్లు - హార్డ్‌వేర్:
రెండు బైకుల్లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, ట్విన్ రియర్ షాక్స్ ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే పల్సర్‌లో 280 మిమీ ఫ్రంట్ డిస్క్ ఉంటే, అపాచీలో 270 మిమీ ఉంది. పల్సర్ .. డిజిటల్ కన్సోల్, ఎల్ఈడీ లైటింగ్‌తో మోడ్రన్ గా కనిపిస్తోంది. అపాచీలో మాత్రం స్పోర్ట్, అర్బన్, రైన్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇవి వాతావరణాన్ని బట్టి బైక్ పర్ఫార్మెన్స్‌ను మారుస్తాయి. అపాచీలో స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ (SmartXConnect) బ్లూటూత్ ఫీచర్ ద్వారా నావిగేషన్, కాల్ అలర్ట్స్ కూడా పొందవచ్చు. ట్రాఫిక్‌లో క్లచ్ వాడకుండానే బైక్ ముందుకు కదిలేలా చేసే 'గ్లైడ్ త్రూ టెక్నాలజీ' (GTT) అపాచీలో అదనపు ఆకర్షణ అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏది కొనాలి?
ధర పరంగా చూస్తే బజాజ్ పల్సర్ 180 (రూ. 1.22 లక్షలు) అపాచీ (రూ. 1.26 లక్షలు) కంటే కొంచెం తక్కువ. మీకు మంచి కంఫర్ట్, పెద్ద ట్యాంక్, తక్కువ ధర కావాలంటే పల్సర్ 180 బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మీకు ఎక్కువ ఫీచర్లు, అదిరిపోయే స్పీడ్, లేటెస్ట్ టెక్నాలజీ కావాలనుకుంటే టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180 స్మార్ట్ ఛాయిస్ అవుతుంది. వాల్యూ ఫర్ మనీ (VFM) పరంగా చూస్తే అపాచీ కొంచెం ముందంజలో ఉంద‌ని విశ్లేష‌కులు పేర్కొన్నారు.

 

టాప్ హెడ్ లైన్స్

హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: మోడ్రన్‌ ఫీచర్లు ఉన్న ఈ కారు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది?
Honda Elevate Facelift డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిజమైన రోడ్డుపై ఎలా ఉంది? కొనవచ్చా?
మారుతి బలెనోకు పోటీగా 2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్‌తో మైలేజీ పెరుగుతుందా?
అక్టోబర్ 14న వస్తున్న టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌.. కొత్తగా ఏం ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు?
39hp పవర్‌తో కవాసాకి కొత్త బైక్‌ Kawasaki Z300.. రూ.3 లక్షల లోపే! ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే?
నింజా 300 ఇంజిన్‌తో కొత్త స్ట్రీట్ ఫైటర్.. Kawasaki Z300 లుక్‌ ఇదే - KTM డ్యూక్‌కు గట్టి పోటీ!
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Hyderabad PRT: హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
AP Coalition MLAs Controversies: ఎన్ని సార్లు చెప్పినా మారని కూటమి ఎమ్మెల్యేలు - చంద్రబాబు, పవన్ ఇక చర్యలు ప్రారంభించబోతున్నారా?
ఎన్ని సార్లు చెప్పినా మారని కూటమి ఎమ్మెల్యేలు - చంద్రబాబు, పవన్ ఇక చర్యలు ప్రారంభించబోతున్నారా?
Embed widget