అన్వేషించండి

New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!

Maruti Dzire GNCAP Rating: మారుతి సుజుకి త్వరలో తీసుకురానున్న కారు డిజైర్ గ్లోబల్ ఎన్‌సీఏపీ రేటింగ్‌లో ఫైవ్ స్టార్ రేటింగ్‌ను పొందింది. ఈ రేటింగ్ పొందిన మొదటి మారుతి బ్రాండెడ్ కారు ఇదే.

Maruti Dzire Safety Rating: మారుతి సుజుకి కొత్త కారు క్రాష్ టెస్ట్‌లలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. మారుతి సుజుకి ఇప్పటి వరకు లాంచ్ చేసిన అన్ని కార్లలో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన మొదటి కారు ఇదే. క్రాష్ టెస్ట్‌లో పాస్ అయిన మొదటి మారుతి కారుగా ఇది నిలిచింది. గ్లోబల్ ఎన్‌సీఏపీ నుంచి మారుతి డిజైర్ 5 స్టార్ రేటింగ్‌ను పొందడం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఇండియా ఎన్‌సీఏపీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం కంటే గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించడం చాలా కష్టం. ఇంతకుముందు మారుతి కార్లు క్రాష్ టెస్ట్‌లలో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్‌లను పొందాయి.

మారుతి డిజైర్ కొత్త తరం మోడల్ అడల్ట్ ఆక్యుపెంట్ సెక్యూరిటీలో ఐదు స్టార్లను పొందింది. ఈ కారు పిల్లల సెక్యూరిటీలో నాలుగు స్టార్లను పొందింది. క్రాష్ టెస్ట్‌లో ఈ కారు స్కోర్ గురించి చెప్పాలంటే కొత్త డిజైర్ అడల్ట్ ఆక్యుపెంట్ సేఫ్టీలో 34 మార్కులకు 31.24 మార్కులు సాధించింది. ఇది మారుతికి మంచి స్కోర్. పిల్లల సెక్యూరిటీ విషయంలో ఈ కారు 42 మార్కులకు 39.2 మార్కులు తెచ్చుకుంది.

Also Read: రెండు 650 సీసీ బైక్‌లు లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - ఇండియాని ఊపేయడం ఖాయం!

మారుతి డిజైర్ సేఫ్టీ ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మారుతి డిజైర్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందడం వెనుక ఉన్న అతి పెద్ద కారణం ఏమిటంటే కంపెనీ ఈ కారులో సెక్యూరిటీ ఫీచర్లను పెంచింది. ఈ కారు ప్రామాణిక మోడల్ ఈఎస్సీ, పెడేస్ట్రియన్ సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ కారు క్రాష్ టెస్ట్ సమయంలో కారు స్ట్రక్చర్, ఫుట్‌వెల్ ఏరియా స్థిరంగా ఉన్నాయి. ఈ కారులో అన్ని సీట్లకు 3 పాయింట్ సీట్ బెల్ట్ సెక్యూరిటీ ఫీచర్ కూడా ఉంది. గ్లోబల్ ఎన్‌సీఏపీ మారుతి డిజైర్‌పై పోల్ టెస్టింగ్‌ను నిర్వహించింది. ఇందులో ఫుల్ హెడ్ ప్రొటెక్షన్ కూడా ఉంది. అలాగే కారు సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో కూడా పాస్ అయింది.

మారుతి డిజైర్ మునుపటి మోడల్ క్రాష్ టెస్ట్‌లో అడల్ట్ ఆక్యుపెంట్ సేఫ్టీ, చైల్డ్ ఆక్యుపెంట్ సేఫ్టీ రెండింటిలోనూ ఒక్కొక్కటి రెండు స్టార్‌లను పొందింది. పాత డిజైర్‌లో భద్రత కోసం ముందు భాగంలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే అందించారు. కొత్త తరం డిజైర్ మోడల్‌లో సెక్యూరిటీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

కొత్త మారుతి డిజైర్ ఎప్పుడు లాంచ్ అవుతుంది?
భారత మార్కెట్లోకి విడుదల చేయనున్న మోడల్‌నే గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో ఉపయోగించారు. మారుతి సుజుకి కొత్త డిజైర్‌ను చాలా మంచి పద్ధతిలో సిద్ధం చేసింది. మారుతి ఇప్పుడు ఈ కారుతో సెక్యూరిటీ టెన్షన్‌ను ముగించింది. మారుతి డిజైర్ ఐదో తరం మోడల్ నవంబర్ 11వ తేదీన భారత మార్కెట్లో విడుదల కానుంది. ఈ కారులో 1.2 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అందించారు.

Also Read: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? - ఈ టిప్స్ పాటించకపోతే దెబ్బ అయిపోతారు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget