రూ.లక్షన్నరలో మంచి ఎలక్ట్రిక్ స్కూటీ - సింగిల్ ఛార్జ్‌లో ఎన్ని కిలోమీటర్లు? ప్రస్తుతం మనదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. మనదేశంలో ఇటీవలే రగ్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి లాంచ్ అయింది. అదే బీగాస్ ఆర్‌యూవీ 350. ఈ స్కూటీ మనదేశంలో 2024 జూన్‌లో లాంచ్ అయింది. మూడు మోడల్స్‌లో ఈ స్కూటీ మనదేశంలో అందుబాటులో ఉంది. మొత్తం ఐదు కలర్ ఆప్షన్లలో ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇన్ వీల్ హైపర్ డ్రైవ్ మోటార్‌ను ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అందించారు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 135 కిలోమీటర్లు ప్రయాణించనుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 75 కిలోమీటర్ల వరకు ఉంది. దీని ధర రూ.1.09 లక్షల నుంచి రూ.1.34 లక్షల వరకు ఉంది.