Maruti Suzuki eWX: మారుతి సుజుకి ఈడబ్ల్యూఎక్స్ వచ్చేస్తుంది - త్వరలో లాంచ్ చేయనున్న కంపెనీ!
Maruti Suzuki New Car: మారుతి సుజుకి కొత్త ఎలక్ట్రిక్ కారుపై పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
Maruti Electric Sedan: మారుతి సుజుకి భారతీయ మార్కెట్ కోసం అనేక ఈవీలను రూపొందిస్తుంది. వీటిలో ఈవీఎక్స్ ఎస్‌యూవీ భారతీయ మార్కెట్‌లో విడుదల కానున్న మొట్టమొదటి మారుతి ఎలక్ట్రిక్ కారు. 2024 చివరిలో ఈ కారు విడుదలయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఎంట్రీ లెవల్ ఆల్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌పై కూడా పని చేస్తుంది. ఇది 2026-27 నాటికి భారతీయ మార్కెట్లోకి విడుదల కానుంది.
మారుతి సుజుకి ఈడబ్ల్యూఎక్స్
కొత్త ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ 2023లో జపాన్ మొబిలిటీ షోలో సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రదర్శించిన ఈడబ్ల్యూఎక్స్ కాన్సెప్ట్‌పై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. మారుతి సుజుకి ఈడబ్ల్యూఎక్స్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ లీడర్ టాటా టియాగో ఈవీతో పోటీపడుతుంది. మొట్టమొదటిగా ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుల్లో టియాగో ఈవీ బాగా ప్రాచుర్యం పొందింది.
మారుతీ వ్యాగన్ఆర్ ఈవీ
ఇది మాత్రమే కాకుండా మారుతి సుజుకి వాగన్ ఆర్ ఈవీని ఇండియన్ రోడ్లపై కూడా పరీక్షిస్తుంది. అయితే ఖర్చులను అదుపులో ఉంచుకోవడంలో ఎంఎస్ఐఎల్ విఫలమవడంతో ఈ ప్లాన్ రద్దు అయింది. కంపెనీ కే-ఈవీ అనే కోడ్ నేమ్ కలిగిన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్త, గ్రౌండ్ అప్ ఈవీ ఆర్కిటెక్చర్‌పై పని చేయడం ప్రారంభించింది. దీన్ని టయోటా 40 పీఎల్ గ్లోబల్ ప్లాట్‌ఫారమ్ నుంచి తీసుకున్నారు.
ఎంఎస్ఐఎల్ తన ఎలక్ట్రిక్ వాహనాలన్నీ బోర్న్ ఈవీ ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉంటాయని, ఐసీఈల ఎలక్ట్రిక్ వెర్షన్‌లు కాదని వెరిఫై చేసింది. ప్లాట్‌ఫారమ్‌తో పాటు బ్యాటరీ ప్యాక్‌ను కూడా స్థానికంగా తయారు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. మారుతి సుజుకి తను త్వరలో లాంచ్ చేయనున్న ఈవీఎక్స్ మిడ్ రేంజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం బ్లేడ్ సెల్స్‌ను సరఫరా చేయడానికి బీవైడీతో జతకట్టింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్థానిక తయారీ కోసం కంపెనీ ఇప్పటికే 10,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడిని ప్రకటించింది. వాహనాల తయారీ, బ్యాటరీ సెల్‌ల లోకలైజేషన్ రెండింటికీ ఈ పెట్టుబడి పెట్టనున్నారు. ఈ దశాబ్దం చివరి నాటికి దాదాపు ఆరు ఎలక్ట్రిక్ కార్లను భారత మార్కెట్లోకి విడుదల చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
సుజుకి ఈడబ్ల్యూఎక్స్ ఇంటీరియర్
సుజుకి ఈడబ్ల్యూఎక్స్ కాన్సెప్ట్ పొడవు 3.4 మీటర్లుగా ఉంది. ఇది భారతీయ మార్కెట్లో విక్రయానికి అందుబాటులో ఉన్న ఎస్ ప్రెస్సో కంటే కూడా చిన్నది. దీని పొడవు 3395 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 1475 మిల్లీమీటర్లుగానూ, ఎత్తు 1620 మిల్లీమీటర్లుగానూ ఉంది. ఈడబ్ల్యూఎక్స్‌కు సంబంధించి ఖచ్చితమైన వివరాలు, బ్యాటరీ స్పెసిఫికేషన్‌లను కంపెనీ వెల్లడించలేదు. అయితే ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 230 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందిస్తుందని కంపెనీ అంటోంది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో సుజుకీ బ్రాండ్ మార్కెట్ లీడర్‌గా ఉంది.
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!