అన్వేషించండి

Maruti Suzuki Price Hike: మారుతి సుజుకి కార్ల ధరల పెంపు: వచ్చే నెల నుండి భారీగా పెరగనున్న వాహనాల రేట్లు

Maruti Suzuki Announces Price Hike:పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా జూన్ 2026 నుండి అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు మారుతి సుజుకి ప్రకటించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మారుతి సుజుకి వాహనాల ధరలు రూ. 30,000 వరకు పెంచుతుంది.
  • పెరిగిన ఉత్పత్తి వ్యయాలు, ద్రవ్యోల్బణం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
  • జూన్ 2026 నుండి అన్ని మోడళ్లపై ఈ ధరల పెంపు అమల్లోకి వస్తుంది.
  • కొత్త ధరల వివరాలు జూన్ మొదటి వారంలో అందుబాటులోకి రానున్నాయి.

Maruti Suzuki Announces Price Hike: ఇండియా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. కంపెనీ తన మొత్తం మోడల్ శ్రేణిపై రూ. 30,000 వరకు ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త రేట్లు జూన్ 2026 నుండి అమల్లోకి రానున్నాయి. ఆటోమొబైల్ రంగాన్ని దెబ్బతీస్తున్న ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల, నిరంతర ద్రవ్యోల్బణ ఒత్తిళ్లే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని కంపెనీ స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన పెంపు తర్వాత మారుతి సుజుకి కార్ల ధరలను సవరించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

Read Also: Honda Activa e vs TVS iQube: యాక్టివా ఇ స్కూటర్‌ వర్సెస్‌ టీవీఎస్‌ ఐక్యూబ్, ధర,మైలేజీలో ఏద బెస్ట్? పూర్తి పోలిక ఇక్కడ!

పెంపుపై క్లారిటీ..

ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మారుతి సుజుకి ఈ ధరల పెంపుపై క్లారిటీ ఇచ్చింది. గత కొన్ని నెలలుగా అంతర్గత చర్యల ద్వారా వ్యయాల పెరుగుదలను అరికట్టడానికి ప్రయత్నించినట్లు పేర్కొంది. అయితే కమోడిటీ ధరలు, లాజిస్టిక్స్ ఖర్చులు, మొత్తం ఇన్‌పుట్ వ్యయాలు గరిష్ట స్థాయిలోనే కొనసాగుతుండటంతో ఆ భారంలో కొంత భాగాన్ని కస్టమర్లపై మోపక తప్పలేదని వెల్లడించింది. కార్ల మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ ధరల పెంపు మారుతూ ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు జూన్ మొదటి వారంలో అందుబాటులోకి రానున్నాయి.

Read Also: Sachin Tendulkar Car Collection: సచిన్ సూప‌ర్బ్ కార్ క‌లెక్ష‌న్: క్రికెట్ గాడ్ లగ్జరీ గ్యారేజ్ లోని టాప్ కార్ల కలెక్షన్ పై ఒక లుక్ 

ఆల్టో నుండి ఇన్విక్టో వరకు ..

ఈ తాజా నిర్ణయం మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియోలోని అన్ని వాహనాలపై పడనుంది. బడ్జెట్ రేంజ్ హ్యాచ్‌బ్యాక్స్ అయిన ఆల్టో కే10, ఎస్-ప్రెస్సోలతో పాటు భారీ డిమాండ్ ఉన్న వ్యాగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్ కార్ల రేట్లు పెరగనున్నాయి. అలాగే ప్రీమియం మోడళ్లయిన బాలెనో, ఫ్రాంక్స్, బ్రెజ్జా, గ్రాండ్ విటారా, హై-ఎండ్ మోడల్ ఇన్విక్టో కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం మారుతి సుజుకి శ్రేణిలో ఆల్టో కే10 ప్రారంభ ధర రూ. 3.70 లక్షలు కాగా, ఇన్విక్టో టాప్ ఎండ్ ధర రూ. 28.61 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా వస్తున్న సీఎన్‌జీ, హైబ్రిడ్ వెహికల్స్ ధరలు కూడా ఈ మార్పుతో అప్‌డేట్ కానున్నాయి.

మారుతున్న సమీకరణాలు

ప్రస్తుతం భారతీయ ఆటోమొబైల్ రంగంలో ముడిసరుకు ఖర్చులు పెరగడం, కొత్త నిబంధనల అమలు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఇంటెగ్రేషన్ కారణంగా దాదాపు అన్ని కంపెనీలు ధరలను క్ర‌మంగా సవరిస్తున్నాయి. ఆటోమేకర్లు ఒకవైపు పెరిగిన ఉత్పత్తి వ్యయాలను బ్యాలెన్స్ చేస్తూనే, మరోవైపు మార్కెట్ డిమాండ్ తగ్గకుండా చూసుకోవడానికి కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ కస్టమర్లు ఉండే ప్రైస్ సెన్సిటివ్ సెగ్మెంట్లలో అమ్మకాలను కాపాడుకోవడం కంపెనీలకు ఇప్పుడు సవాలుగా మారింది. జూన్ నుండి అమల్లోకి రాబోయే ఈ రేట్ల మార్పు కొత్త కారు కొనాలనుకునే వారి బడ్జెట్‌పై ప్రభావం చూపనుంది.

Frequently Asked Questions

మారుతి సుజుకి కార్ల ధరలను ఎంత వరకు పెంచుతోంది?

మారుతి సుజుకి తన మొత్తం మోడల్ శ్రేణిపై రూ. 30,000 వరకు ధరలను పెంచుతోంది. ఈ కొత్త ధరలు జూన్ 2026 నుండి అమల్లోకి వస్తాయి.

మారుతి సుజుకి కార్ల ధరల పెంపునకు కారణమేమిటి?

ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల, నిరంతర ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కమోడిటీ ధరలు, లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడమే ధరల పెంపునకు ప్రధాన కారణాలు.

ఏయే మారుతి సుజుకి కార్ల ధరలు పెరుగుతాయి?

ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్, బాలెనో, ఫ్రాంక్స్, బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఇన్విక్టో వంటి అన్ని మోడల్స్ ధరలు పెరుగుతాయి.

ధరల పెంపు వివరాలు ఎప్పుడు తెలుస్తాయి?

కార్ల మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెంపు మారుతూ ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు జూన్ మొదటి వారంలో అందుబాటులోకి వస్తాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maruti Dzireకు ప్రత్యామ్నాయంగా Honda Amaze కొనబోతున్నారా? ముందు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోండి
కొత్త Honda Amaze కొనేవాళ్లకు అలెర్ట్‌! ఈ సెడాన్‌లో మీకు తెలియాల్సిన 3 ప్లస్‌లు, 3 మైనస్‌లు!
Ethanol: పెట్రోల్ తర్వాత డీజిల్‌పైనా ప్రయోగం.. ఇథనాల్‌పై కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గింది?
డీజిల్‌లో ఇథనాల్ కలపడం కుదరదు.. అసలు కారణం ఇదే!
బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?
ఎలక్ట్రిక్‌ బైక్‌ లేదా స్కూటర్‌ కొనేవాళ్లకు పెద్ద శుభవార్త.. రాయితీ గడువు పొడిగించిన కేంద్రం
ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనేవాళ్ల కోసం బిగ్‌ న్యూస్‌.. సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget