అన్వేషించండి

Handbrake Tips: హ్యాండ్ బ్రేక్ వేసినా మీ కారు వాలు ప్రదేశంలో జారుతుందా? అందుకు కారణాలు ఇవే

హ్యాండ్ బ్రేక్ వేసినా కారు జారుతుందా? అయితే ఈ విషయాలు తెలుసుకోకపోతే మీరు ప్రమాదానికి గురవ్వొచ్చు. కనున ఈ విషయాలపై అశ్రద్ధ చేయవద్దు అని నిపుణులు సూచిస్తున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హ్యాండ్‌బ్రేక్ వేసినా కొన్నిసార్లు కారు జారే ప్రమాదం ఉంది.
  • వదులైన కేబుల్, అరిగిపోయిన బ్రేక్ షూ కారణం కావచ్చు.
  • వాలుగా ఉన్న చోట గేర్‌తో పాటు హ్యాండ్‌బ్రేక్ వాడండి.
  • సమస్య ఉంటే వెంటనే మెకానిక్‌తో వాహనాన్ని చెక్ చేయించండి.

Car Slips Even After Applying Handbrake | చాలా మంది కార్లలో హ్యాండ్‌బ్రేక్ వేస్తే కారు పూర్తిగా సేఫ్ అని భావిస్తారు. కానీ కొన్నిసార్లు కొంచెం వాలుగా ఉన్న ప్రదేశంలో పార్క్ చేసిన తర్వాత కారు నెమ్మదిగా జారుతుంటాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాలు లేదా రద్దీగా ఉండే ప్రదేశాలలో ఇది చాలా ప్రమాదకరంగా మారవచ్చు. వాస్తవానికి, దీని వెనుక ఒక కారణం మాత్రమే కాదు, చాలా కారణాలు ఉన్నాయి. చాలాసార్లు ప్రజలు హ్యాండ్‌బ్రేక్‌ను పూర్తిగా లాగరు. కొన్నిసార్లు హ్యాండ్‌బ్రేక్ సిస్టమ్‌లో టెక్నికల్ ప్రాబ్లం ఏర్పడుతుంది.

పాత బ్రేక్ షూ, వదులుగా ఉండే కేబుల్ లేదా రాంగ్ పార్కింగ్ కూడా అందుకు కారణం కావచ్చు. మీ కారు కూడా వాలుగా ఉన్న ప్రదేశంలో నిలిపిన తర్వాత కొద్దిగా కదులుతుంటే, వెంటనే స్పందించకపోతే చాలా ప్రమాదకరం. సరైన సమాచారం, కొంచెం జాగ్రత్త మిమ్మల్ని పెద్ద సమస్యల నుండి కాపాడుతుంది. కనుక హ్యాండ్‌బ్రేక్ వేసిన తర్వాత కూడా కారు ఎందుకు జారుతుందో, అలా జరగకుండా ఏం చేయాలో   అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

Also Read: Best CNG SUVs Under 10 Lakhs: 10 లక్షల బడ్జెట్లో బెస్ట్ సీఎన్‌జీ ఎస్‌యూవీలు - పెట్రోల్ భారం తగ్గించే టాప్ కార్ల లిస్ట్ ఇదే

హ్యాండ్‌బ్రేక్ వీక్‌గా ఉంటే మరింత ప్రమాదం  

మీ కారు హ్యాండ్‌బ్రేక్ నేరుగా వెనుక చక్రాలను లాక్ చేసేలా వర్క్ చేస్తుంది. కానీ కాలక్రమేణా, దాని కేబుల్ వదులుగా అవుతుంది. లేదా బ్రేక్ షూ అరిగిపోతుంది. అలాంటి పరిస్థితిలో హ్యాండ్‌బ్రేక్ పూర్తి కంట్రోల్ చేయకపోవచ్చు. కారు వాలుగా నెమ్మదిగా జారే అవకాశం ఉంటుంది. చాలా మంది తొందరపడి హ్యాండ్‌బ్రేక్‌ను ఒకటి లేదా రెండు క్లిక్‌ల వరకు మాత్రమే లాగుతారు, దాంతో బ్రేక్ పూర్తిగా యాక్టివేట్ కాదు.

కారు పాతదైతే, ఎక్కువ కాలం బ్రేక్ సర్వీసి చేయకపోతే సమస్య మరింత పెరుగుతుంది. ఎప్పటికప్పుడు హ్యాండ్‌బ్రేక్ కేబుల్, బ్రేక్ సిస్టమ్‌ను చెక్ చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. చిన్న నిర్లక్ష్యం కొన్నిసార్లు పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. అందువల్ల కారును పార్క్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. 

Read Also: Skoda Epiq Electric SUV Unveiled: స్కోడా ఎపిక్ ఈవీ అన్‌వీల్: 440 కిలోమీటర్ల రేంజ్ తో రాబోతున్న స్కోడా చీపెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 

వాలుగా ఉన్న చోట పార్క్ చేసేటప్పుడు ఇవి గుర్తించుకోండి

మీరు వాలుగా ఉన్న ప్రదేశంలో మీ కారును పార్క్ చేస్తుంటే, హ్యాండ్‌బ్రేక్‌పై మాత్రమే డిపెండ్ కావడం సరికాదు. మాన్యువల్ కారులో, కారును మొదట గేర్ లేదా రివర్స్ గేర్‌లో ఉంచాలి. మరోవైపు ఆటోమేటిక్ కారులో పార్కింగ్ చేసేటప్పుడు P (పార్క్) మోడ్‌ను ఉపయోగించాలి. మీరు హ్యాండ్‌బ్రేక్‌ను కూడా ఉపయోగించాలి. దాంతోపాటు వీల్స్ రోడ్డు వైపునకు తిప్పి పార్క్ చేయడం మరింత సురక్షితంగా భావిస్తారు. ఇది కారు అకస్మాత్తుగా జారే ప్రమాదాన్ని కొంతమేర తగ్గిస్తుంది.

చాలా మంది కారును స్టార్ట్ చేయడానికి ముందు హ్యాండ్‌బ్రేక్‌ను తీయడం మర్చిపోతారు. దీని వలన బ్రేక్ సిస్టమ్ త్వరగా చెడిపోతుంది. అందువల్ల, హ్యాండ్‌బ్రేక్‌ను సరిగ్గా ఉపయోగించడం తప్పనిసరి. అయితే హ్యాండ్‌బ్రేక్ వేసిన తర్వాత కూడా కారు పదేపదే జారుతుంటే, వెంటనే మెకానిక్‌తో చెక్ చేయించాలి. సమస్యను సకాలంలో గుర్తిస్తే కనుక పెద్ద నష్టం, ప్రమాదం రెండూ నివారించవచ్చు.

 

Frequently Asked Questions

హ్యాండ్‌బ్రేక్ వేసిన తర్వాత కూడా కారు ఎందుకు జారుతుంది?

హ్యాండ్‌బ్రేక్ కేబుల్ వదులుగా మారడం, బ్రేక్ షూ అరిగిపోవడం, లేదా హ్యాండ్‌బ్రేక్‌ను పూర్తిగా లాగకపోవడం వంటి కారణాల వల్ల కారు జారవచ్చు. పాత కార్లలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.

వాలు ప్రదేశాలలో కారును సురక్షితంగా పార్క్ చేయడానికి ఏమి చేయాలి?

హ్యాండ్‌బ్రేక్‌తో పాటు, మాన్యువల్ కార్లలో గేర్ లేదా రివర్స్ గేర్‌లో, ఆటోమేటిక్ కార్లలో పార్క్ మోడ్‌లో ఉంచాలి. వీల్స్ రోడ్డు వైపునకు తిప్పి పార్క్ చేయడం మరింత సురక్షితం.

హ్యాండ్‌బ్రేక్ సరిగ్గా పనిచేయకపోతే ఏమి చేయాలి?

హ్యాండ్‌బ్రేక్ వేసిన తర్వాత కూడా కారు పదేపదే జారుతుంటే, వెంటనే మెకానిక్‌తో తనిఖీ చేయించుకోవాలి. సరైన సమయంలో సమస్యను గుర్తించడం ప్రమాదాలను నివారిస్తుంది.

హ్యాండ్‌బ్రేక్‌ను పూర్తిగా లాగడం ఎందుకు ముఖ్యం?

కొన్నిసార్లు ఒకటి లేదా రెండు క్లిక్‌ల వరకు మాత్రమే హ్యాండ్‌బ్రేక్‌ను లాగితే, బ్రేక్ పూర్తిగా యాక్టివేట్ కాదు. ఇది కారు వాలుగా జారడానికి కారణమవుతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget