Maruti Suzuki Alto Sales: భారీగా పడిపోయిన మారుతి సుజుకి ఆల్టో సేల్స్ - కారణం ఏంటి?
Maruti Suzuki Sales: ఒకప్పుడు భారతదేశంలో మారుతి సుజుకి కారు బెస్ట్ సెల్లింగ్ కారుగా ఉండేది. కానీ ఇప్పుడు దానికి సంబంధించిన సేల్స్ బాగా పడిపోయాయి. దీనికి గత కారణాలు ఏంటి?
Maruti Suzuki Alto: ప్రస్తుతం మనదేశంలో మారుతి సుజుకి ఎక్కువ కార్లు విక్రయిస్తుంది. ప్యాసింజర్ వెహికిల్ విభాగంలో 40 శాతం మార్కెట్ షేర్ మారుతి సుజుకిదే కావడం విశేషం. మనదేశంలో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లలో మారుతి సుజుకి కార్లు సగం వరకు ఉంటాయి. స్విఫ్ట్, ఎర్టిగా, బ్రెజా, ఫ్రాంక్స్, బలెనో ఇలా చాలా బెస్ట్ సెల్లింగ్ కార్లను కంపెనీ లాంచ్ చేసింది. ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్ కారు ఆల్టో... కంపెనీ తీసుకువచ్చిన బెస్ట్ కార్లలో ఒకటి. కానీ ఈ మధ్య ఆల్టో కారు సేల్స్ బాగా పడిపోయాయి. ఒకప్పుడు మనదేశంలో ఇది సేల్స్ పరంగా నంబర్ వన్‌గా ఉండేది. ప్రతి నెలా దాదాపు 18 వేలకు పైగా యూనిట్లు అమ్ముడు పోయేవి. కానీ దీని సేల్స్ ఇప్పుడు అందులో సగానికి పడిపోయాయి.
ఆల్టో సేల్స్ ఎందుకు పడిపోయాయి?
టైమ్స్ నౌ కథనం ప్రకారం... దీని సేల్స్ పడిపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. వినియోగదారుల ఛాయిస్ మారడం, ధరలు పెరగడం. ప్రస్తుతం మనదేశంలో కార్లు కొనుగోలు చేసేవారు ప్రీమియం మోడల్స్ కొనడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ ఆల్టో ఎంట్రీ లెవల్ కారు అన్న ఇమేజ్ ఉంది. ఇది గొప్ప కారు అయినప్పటికీ వినియోగదారుల అంచనాలను అందుకోవడంలో విఫలం అవుతుంది. దీని కారణంగా వినియోగదారులు స్విఫ్ట్, బలెనో, ఫ్రాంక్స్ కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.
మనదేశంలో ఎమిషన్ స్టాండర్డ్స్, సేఫ్టీ ఫీచర్లు మెరుగవడం కారణంగా కార్ల ధరలు బాగా పెరిగాయి. ఆల్టోకు, మిగతా కార్లకు ధరలో ఉన్న తేడా తగ్గిపోవడంతో వినియోగదారులు మరింత ప్రీమియం కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. లేకపోతే కొత్త ఆల్టోకు పెట్టే ధరతో మంచి సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారు.
Also Read: రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!
మారుతి సుజుకి ఆల్టో పడిపోతున్నాయంటే దానికి అర్థం ఇది మంచి కారు కాదని కాదు. వినియోగదారుల అవసరాలు, అంచనాలు పెరగడమే దీనికి కారణం. ఆల్టో విషయంలో సరిగ్గా అదే జరుగుతోంది. మారుతి సుజుకి ఆల్టో కే10 ప్రస్తుతం ఎంట్రీ లెవల్‌లో ఉన్న బెస్ట్ కారు. ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.3.99 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.5.8 లక్షలుగా ఉంది.
మారుతి సుజుకి ఆల్టో కే10లో 1.0 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది. ఇది 65 హెచ్‌పీ, 89 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేయనున్నాయి. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఏఎంటీ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇది సీఎన్‌జీ వేరియంట్లో కూడా అందుబాటులో ఉంది. మారుతి సుజుకి పెట్రోల్ వేరియంట్ 24.9 కిలోమీటర్లు, సీఎన్‌జీ వేరియంట్ 33.85 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది.
పెద్ద బ్రాండ్ల కంటే ఎక్కువ సేల్స్
మారుతి సుజుకి ఆల్టో కే10 సేల్స్ తగ్గిపోయినా మంచి సేల్స్‌ను సాధిస్తుంది. 2024 అక్టోబర్‌లో దీనికి సంబంధించి 8,548 యూనిట్లు అమ్ముడు పోయాయి. కొన్ని సంవత్సరాల క్రితం 18 వేలకు పైగా యూనిట్లు అమ్ముడు పోయిన కారు ఇప్పుడు 8 వేలకు పడిపోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఇప్పటికీ హోండా, స్కోడా, ఎంజీ, ఫోక్స్‌వ్యాగన్ కార్ల కంటే ఎక్కువ సేల్స్‌ను సాధిస్తుంది.
ఉదాహరణకు చెప్పాలంటే హోండా... 2024 అక్టోబర్‌లో 5,546 కార్లను విక్రయించింది. మరోవైపు ఎంజీ సేల్స్ 7,045 గానూ, స్కోడా సేల్స్ 4,079 గానూ, ఫోక్స్ వ్యాగన్ సేల్స్ 4,458 గానూ ఉన్నాయి. దీన్ని బట్టి ఆల్టో సేల్స్ ఎంత ఎక్కువో ఊహించవచ్చు.
Also Read: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?