Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Royal Enfield First Electric Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. అదే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6. ఇది మార్కెట్లోకి త్వరలో ఎంట్రీ ఇవ్వనుంది.
Royal Enfield Electric: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్రిటిష్ వాహన కంపెనీ తమ మొదటి ఈవీని ప్రజలకు పరిచయం చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేసిన ఈ మొదటి ఎలక్ట్రిక్ బైక్ పేరు ఫ్లయింగ్ ఫ్లీ ఎఫ్ఎఫ్-సీ6. ఈ మోటార్‌సైకిల్‌ను పూర్తిగా కొత్త బ్రాండింగ్‌తో భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ధృవీకరించింది. దీనితో పాటు రానున్న కాలంలో మరిన్ని కొత్త బైక్‌లను రాయల్ ఎన్‌ఫీల్డ్ మార్కెట్‌లోకి విడుదల చేయనుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్
రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రాంబ్లర్ ఎలక్ట్రిక్ బైక్‌ను సీ6 ఆధారంగా రూపొందించారు. కానీ కంపెనీ ఈ బైక్‌లో అనేక కొత్త భాగాలను చేర్చింది. ఈ మోటార్‌సైకిల్‌లో మడ్‌గార్డ్‌ను టైర్ కంటే కొంచెం ఎత్తులో ఉంచారు. దీని ఫ్యూయల్ ట్యాంక్ షేప్ మునుపటి బైక్‌ను పోలి ఉంటుంది. దీంతో పాటు ఈ బైక్‌లో కొత్త సెంటర్ ప్యానెల్ కూడా చూడవచ్చు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ స్టాండర్డ్ మోడల్‌లో ఒకే సీటు ఉంది. అలాగే ఈ బైక్‌లో పెద్ద, పొడవైన సీటు ఆప్షన్ కూడా ఉంది.
Also Read: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? - ఈ టిప్స్ పాటించకపోతే దెబ్బ అయిపోతారు!
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌లో కూడా కంపెనీ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. అందుకే కంపెనీ ఫ్లైయింగ్ ఫ్లీ ఎఫ్ఎఫ్ సీ6 డిజైన్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. ఈ రెట్రో డిజైన్‌తో వచ్చిన బైక్‌లో సర్క్యులర్ హెడ్‌ల్యాంప్, రియర్ వ్యూ మిర్రర్‌లను అమర్చారు. దీంతో పాటు టీఎఫ్‌టీ డాష్‌బోర్డ్ కూడా సర్క్యులర్ షేప్‌తో వచ్చింది.
ఫ్లయింగ్ ఫ్లీ సీ6 రేంజ్ ఎంత?
ఫ్లయింగ్ ఫ్లీ సీ6 బ్యాటరీ ప్యాక్, రేంజ్, ఛార్జింగ్ టైమ్‌కి సంబంధించిన అధికారిక సమాచారాన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంకా వెల్లడించలేదు. కానీ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇవ్వగలదని అంచనా. ఈ బైక్‌తో పాటు స్క్రాంబ్లర్ తరహాలో ఎఫ్ఎఫ్ ఎస్6ని కూడా ప్రజలకు పరిచయం చేసింది.
Also Read: రెండు 650 సీసీ బైక్‌లు లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - ఇండియాని ఊపేయడం ఖాయం!
An exciting unveil of the newest additions to our fleet.
— Royal Enfield (@royalenfield) November 5, 2024
⚡ Flying Flea
💪 Bear 650
💣 Classic 650
Tune in for the EICMA Unveil Premiere at 🕗 8 PM IST tonight.
Visit: https://t.co/q91zmAgpTF#LiveLightly #FeelFree #Bear650 #InGutWeTrust #Classic650 #RoyalEnfield pic.twitter.com/YksOdTY6Lm
Introducing the Fuel x Royal Enfield Collection!
— Royal Enfield (@royalenfield) November 7, 2024
We are proud to launch a Limited Collection for the New Royal Enfield Bear 650, inspired by racing legend Eddie Mulder.
Shop now at the Fuel Motorcycles' website!#Bear650 #InGutWeTrust#RoyalEnfield #RidePure #PureMotorcycling pic.twitter.com/DUMlXRgRQr