రూ.250 కోట్ల రోల్స్ రాయిస్ - స్పెషాలిటీలు ఇవే - తయారీకే మూడేళ్ల వరకు!

Published by: ABP Desam
Image Source: Rolls Royce

లగ్జరీ అంటే ముందుగా గుర్తొచ్చే కార్ల కంపెనీ రోల్స్ రాయిస్ మాత్రమే.

Image Source: Rolls Royce

రోల్స్ రాయిస్ కార్ల ధరలు కూడా రూ.కోట్లలో ఉంటాయి. వీటిలో కొన్ని కార్లు ఇండియాలో కూడా చూడవచ్చు.

Image Source: Rolls Royce

రోల్స్ రాయిస్ లాంచ్ చేసిన అత్యంత ఖరీదైన కారు ‘రోల్స్ రాయిస్ ల రోజ్ నాయిర్ డ్రాప్ టెయిల్’.

Image Source: Rolls Royce

దీని ధర ఏకంగా రూ.249.48 కోట్లుగా ఉంది. అంటే దాదాపు రూ.250 కోట్లు అనుకోవచ్చు.

Image Source: Rolls Royce

ఈ రూ.250 కోట్ల రోల్స్ రాయిస్‌లో కేవలం ఇద్దరు మాత్రమే కూర్చోగలరు.

Image Source: Rolls Royce

ఈ కారు పొడవు ఏకంగా 5.3 మీటర్లుగా ఉంది. కార్బన్, స్టీల్, అల్యూమినియం కార్లతో దీన్ని రూపొందించారు.

Image Source: Rolls Royce

కేవలం ఫ్రాన్స్‌లో మాత్రమే లభించే బ్లాక్ బకారా రోజ్ అనే పువ్వు రేకులను కూడా ఈ కారు తయారీలో వాడతారట.

Image Source: Rolls Royce

ఈ కారుకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక్కో కోణం నుంచి ఒక్కో రంగులో కనిపిస్తుంది.

Image Source: Rolls Royce

దీన్ని తయారు చేయడానికి ఏకంగా రెండు సంవత్సరాల తొమ్మిది నెలలు పడుతుంది.

Image Source: Rolls Royce