అన్వేషించండి

Maruti Fronx Vs Kia Sonet: ఏ SUV మీ డబ్బుకు ఎక్కువ విలువను ఇస్తుంది? తేడాను నిమిషాల్లో అర్థం చేసుకోండి

Best SUV under 12 lakh: కాంపాక్ట్ SUV విభాగంలో, మారుతి బ్రాండ్‌ నుంచి ఫ్రాంక్స్ & కియా నుంచి సోనెట్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ రెండు SUVల్లో మంచి ఫీచర్లు & పవర్‌ఫుల్‌ ఇంజిన్‌లు ఉన్నాయి.

Maruti Fronx vs Kia Sonet Comparison: మన దేశంలో ఇప్పుడు కాంపాక్ట్ SUV ట్రెండ్‌ నడుస్తోంది, ప్రతి నెలా ఈ విభాగంలోని వెహికల్స్‌ వేల సంఖ్యలో వాహనాలు అమ్ముడవుతున్నాయి. కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లోనే మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఉంది, కియా బ్రాండ్‌లోని సోనెట్ ఉంది.  కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌ వైపు చూస్తున్న కస్టమర్లను ఆకర్షించడానికి ఈ రెండు కంపెనీలు పవర్‌ఫుల్‌ ఫీచర్లు, విభిన్న ఇంజిన్ ఆప్షన్స్‌ & అందుబాటు ధరలతో ఊరిస్తున్నాయి. ఇక్కడొచ్చే ప్రశ్న ఏమిటంటే, ఫీచర్లు, మైలేజ్ & ధర పరంగా ఏ కారు కొనడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది?. 

మారుతి సుజుకీ ఫ్రాంక్స్ ఫీచర్లు
Maruti Fronx లో కంపెనీ చాలా ప్రీమియం ఫీచర్లను అందించింది. వాటిలో... LED హెడ్‌లైట్లు, DRLs, ఆటో హెడ్‌ల్యాంప్, LED కనెక్టెడ్‌ టెయిల్‌లైట్, వెనుక వైపర్ & వాషర్, షార్క్ ఫిన్ యాంటెన్నా & స్కిడ్ ప్లేట్ వంటి ఎక్స్‌టీరియర్‌ కాంపొనెంట్స్‌ ఉన్నాయి. ఇంటీరియర్‌లో - డ్యూయల్ టోన్ డిజైన్, ఫాబ్రిక్ సీట్లు, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ & ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు ఉన్నాయి. ఇంకా.. 22.86 సెం.మీ. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అర్కామిస్ ఆడియో సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, హెడ్-అప్ డిస్‌ప్లే & 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఈ కారును చాలా ఆకర్షణీయంగా మార్చాయి.

కియా సోనెట్ ఫీచర్లు
Kia Sonet ఫీచర్ల పరంగా మరింత ప్రీమియం కారు. ఇందులో LED లైట్లు, డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్‌ & 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇంటీరియర్‌లో 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, BOSE ఆడియో సిస్టమ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్ & ఎయిర్ ప్యూరిఫైయర్ ఉన్నాయి. వీటితో పాటు, రియర్ AC వెంట్లు & ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ వంటివి ఈ ఫోర్‌వీలర్‌ ప్రయాణీకులకు మరింత విలాసవంతమైన అనుభూతిని ఇస్తాయి.

ఇంజిన్ & మైలేజ్
మారుతి ఫ్రాంక్స్ మూడు ఇంజిన్ ఆప్షన్స్‌లో దొరుకుతుంది, అవి - 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2-లీటర్ CNG & 1.0-లీటర్ టర్బో పెట్రోల్. ఇది మాన్యువల్ & AMT ట్రాన్స్‌మిషన్లతో పని చేస్తుంది. మారుతి ఫ్రాంక్స్ మైలేజ్ విషయానికి వస్తే.. ఇది 20.02 kmpl నుంచి 22.89 kmpl వరకు ఇస్తుంది. 

కియా సోనెట్‌ పవర్‌ట్రెయిన్స్‌ను చూస్తే.. ఇది 1.2-లీటర్ స్మార్ట్‌స్ట్రీమ్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ & 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికల్లో అందుబాటులో ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ iMT, 7-స్పీడ్ DCT & 6-స్పీడ్ ఆటోమేటిక్ వంటి అనేక ట్రాన్స్‌మిషన్‌ ఎంపికలను కలిగి ఉంది, మరింత వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. కియా సోనెట్ మైలేజ్, ఇంజిన్ & ట్రాన్స్‌మిషన్‌ రకాన్ని బట్టి మారుతుంది, ఇది 18.4 kmpl నుంచి 24.1 kmpl వరకు ఉంటుంది. డీజిల్‌ వేరియంట్లలో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్లు 24.1 kmpl & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లు 19 kmpl సాధిస్తాయి. పెట్రోల్ వేరియంట్లలో మాన్యువల్ & ఆటోమేటిక్ రెండూ వరుసగా 18.4 kmpl & 18.3 kmpl మైలేజీ ఇస్తాయి.

ధరలు
ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ రాష్ట్రాల్లో మారుతి ఫ్రాంక్స్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర 7.58 లక్షలు కాగా, దాని టాప్ వేరియంట్ 13.06 లక్షల వరకు ఉంటుంది. కియా సోనెట్ ప్రారంభ ధర 7.99 లక్షలు & దాని టాప్ వేరియంట్ రూ. 14.99 లక్షల వరకు లభిస్తుంది.

ఎవరు ఏ కారు కొంటే బాగుంటుంది?
మెరుగైన మైలేజ్ & బడ్జెట్ ఫ్రెండ్లీ SUV కోరుకుంటే, మారుతి ఫ్రాంక్స్ మీకు మంచి ఎంపిక. ప్రీమియం ఫీచర్లు, ఎక్కువ ఇంజన్ ఆప్షన్లు & లగ్జరీ అనుభవంపై దృష్టి పెడితే కియా సోనెట్ మెరుగ్గా ఉంటుంది. ఈ వాహనాల్లో ఒకటి ఎక్కువ, మరొకటి తక్కువ అని స్పష్టంగా చెప్పలేము.

టాప్ హెడ్ లైన్స్

Renault Kiger, Triber, Kwidపై అద్భుతమైన ఆఫర్లు - వేల రూపాయలు ఆదా, ఇది పరిమిత కాల ఆఫర్‌
కొత్త కారు కొనేవాళ్లకు గుడ్‌న్యూస్‌ - రూ.68,000 వరకు డిస్కౌంట్లు ప్రకటించిన రెనాల్ట్‌
Maruti Suzuki Celerio EMI Calculator: 50వేల రూపాయల డౌన్‌పేమెంట్‌తో మారుతి సెలెరియో సొంతం చేసుకునే EMI ప్లాన్ ఇదే! 
50వేల రూపాయల డౌన్‌పేమెంట్‌తో మారుతి సెలెరియో సొంతం చేసుకునే EMI ప్లాన్ ఇదే! 
రేస్‌ బైక్‌ తరహాలో Yamaha R15 V4, MT-15 MotoGP ఎడిషన్లు లాంచ్‌ - FZ-S సిరీస్‌కు కొత్త రంగులు
యమహా R15 V4, MT-15 మోటోజీపీ ఎడిషన్లు లాంచ్‌.. అచ్చం 'రేస్‌ బైక్‌'ను చూసినట్లే ఉంది
TVS స్కూటర్ల ధరలు పెంపు.. పాపులర్‌ మోడళ్ల రేట్లు ఏకంగా రూ.11,000 వరకు హైక్‌, ఇదిగో లిస్ట్‌
TVS స్కూటర్‌ కొనేవాళ్లకు షాక్‌! iQube నుంచి Jupiter వరకు వేలల్లో పెరిగిన ధరలు - కొత్త రేట్లు ఇవే

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Embed widget