అన్వేషించండి

Upcoming Cars: మారుతి నుంచి టాటా వరకు, ఎలక్ట్రిక్‌ నుంచి SUV వరకు - 2025లో తెలుగు రాష్ట్రాల్లోకి దూసుకొచ్చే కొత్త కార్ల ఫుల్‌ లిస్ట్‌

Upcoming electric cars 2025: ఈ ఏడాది ఫెస్టివ్‌ సీజన్‌ మజాగా సాగనుంది. తెలుగు రాష్ట్రాల్లోకి దూసుకొస్తున్న కొత్త కార్లు దమ్ముదుమారం రేపనున్నాయి. 2025లో రాబోతున్న కొత్త కార్ల పూర్తి లిస్ట్ ఈ కథనంలో.

Upcoming Cars In India 2025: 2025లో, ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ రాష్ట్రాల్లోకి రాబోయే కార్ల జాబితా కొత్త కస్టమర్లలో గట్టి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇండియాలో పండుగ సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో, ఇక నుంచి ప్రతి నెలా కొత్త మోడల్స్, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు, ఎలక్ట్రిక్‌ కార్లు, హైబ్రిడ్‌ మోడల్స్‌ వరుసగా మార్కెట్‌లోకి అడుగు పెట్టబోతున్నాయి. SUVలు, MPVలు, సెడాన్‌లు - అన్ని విభాగాల్లో కొత్త లాంచ్‌లు రానున్నాయి, ఆటోమొబైల్ మార్కెట్ మరింత కదలికలు చురుగ్గా మారనున్నాయి.

రాబోయే బ్రాండ్లు
2025లో భారత్‌లోకి, ముఖ్యంగా తెలురు రాష్ట్రాల్లో లాంచ్‌ కానున్న కార్ల జాబితాలో Maruti Suzuki, Hyundai, Tata, Toyota, Volkswagen, Skoda, MG Motor, Renault, Nissan వంటి పాపులర్‌ బ్రాండ్లు ఉన్నాయి. కొత్త SUVలు, హ్యాచ్‌బ్యాక్‌లు, MPVలు వరుసగా లాంచ్ అవుతాయి.

ఎలక్ట్రిక్ కార్ల హవా
ఎలక్ట్రిక్‌ సెగ్మెంట్‌లో పోటీ మరింత పెరిగింది. టాటా మోటార్స్‌, ఇప్పటికే Harrier EVని లాంచ్ చేసింది. త్వరలో Tata Sierra EV కూడా రాబోతోంది. మారుతి సుజుకీ eVitara, టయోటా Urban Cruiser EV లాంటి మోడల్స్‌ను సిద్ధం చేస్తుంటే, కొత్తగా మార్కెట్లోకి అడుగుపెడుతున్న Vinfast కంపెనీ VF6 (Creta EV రైవల్) & VF7 (Mahindra XEV 9e రైవల్) మోడల్స్‌తో బరిలోకి దిగుతోంది.

హైబ్రిడ్ కార్లలో కొత్త శకం
ఇటీవలి కాలంలో హైబ్రిడ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో Honda City Hybrid, Toyota Innova Hycross, Maruti Invicto, Toyota Vellfire వంటి మోడల్స్ ఉన్నాయి. త్వరలో Maruti కొత్త SUV & దాని టయోటా వెర్షన్ కూడా హైబ్రిడ్ ఇంజిన్‌తో రానున్నాయి. అదేవిధంగా, Hyundai కూడా తన కార్లను పెట్రోల్-హైబ్రిడ్ వేరియంట్లలో మార్కెట్లోకి తెచ్చే యోచనలో ఉంది. 2026 ప్రారంభంలో లాంచ్ కాబోయే Kia Seltos కూడా హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వచ్చే అవకాశం ఉంది.

7 సీటర్ కార్ల జాబితా
పెద్ద కుటుంబాల కోసం 7 సీటర్ కార్లకు ప్రస్తుతం మంచి డిమాండ్ కొనసాగుతోంది. 2025లో రాబోయే Mahindra XEV 7e EV, MG Majestor SUV, Nissan B MPV (Gravite), Renault Bigster SUV & Nissan 7-seater SUV మోడల్స్ ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి.

దమ్ము చూపనున్న SUVలు
SUV మార్కెట్‌ ఎప్పుడూ బూమ్‌లోనే ఉంటుంది. 2025లో Hyundai Venue కొత్త వెర్షన్, Tata Sierra, కొత్త Renault Duster, Nissan SUV, Maruti eVitara, Toyota Urban Cruiser EV, Kia Seltos Next-Gen, Maruti Victoris (Escudo SUV) వంటివి వరుసగా లాంచ్ కానున్నాయి.

ఓవరాల్‌గా చూస్తే... 2025లో, ముఖ్యంగా ఈ ఫెస్టివ్‌ సీజన్‌లో, తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్, SUV, 7 సీటర్ మోడల్స్ అన్నీ కలిపి భారీ పోటీని తీసుకురాన్నాయి. పండుగ సీజన్‌ కాబట్టి వివిధ ఆఫర్లు కూడా ఉండే అవకాశం ఉంది, ఇప్పటికే కొన్ని కంపెనీలు ఫెస్టివ్‌ ఆఫర్లను ప్రకటించాయి. కొత్త మోడల్ కోసం ఎదురు చూస్తున్న కస్టమర్లకు ఇది బంగారం లాంటి అవకాశం కానుంది.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
iBomma Ravi Bail Petition: ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన నాంపల్లి కోర్టు.. పోలీసుల వాదనతో ఏకీభవించిన జడ్జి
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన నాంపల్లి కోర్టు.. పోలీసుల వాదనతో ఏకీభవించిన జడ్జి
Maoists surrender: మావోయిస్టులు లొంగిపోవడమంటే సరెండర్ కాదు.. అడవిని వదిలిన అన్నలను అవమానించొద్దు..!
మావోయిస్టులు లొంగిపోవడమంటే సరెండర్ కాదు.. అడవిని వదిలిన అన్నలను అవమానించొద్దు..!
Top 10 Actress: టాప్ 10 ఇండియన్ హీరోయిన్లలో దీపికా పదుకోన్ నంబర్ వన్... లిస్టులో రష్మిక ప్లేస్ ఎంతో తెలుసా?
టాప్ 10 ఇండియన్ హీరోయిన్లలో దీపికా పదుకోన్ నంబర్ వన్... లిస్టులో రష్మిక ప్లేస్ ఎంతో తెలుసా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
iBomma Ravi Bail Petition: ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన నాంపల్లి కోర్టు.. పోలీసుల వాదనతో ఏకీభవించిన జడ్జి
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన నాంపల్లి కోర్టు.. పోలీసుల వాదనతో ఏకీభవించిన జడ్జి
Maoists surrender: మావోయిస్టులు లొంగిపోవడమంటే సరెండర్ కాదు.. అడవిని వదిలిన అన్నలను అవమానించొద్దు..!
మావోయిస్టులు లొంగిపోవడమంటే సరెండర్ కాదు.. అడవిని వదిలిన అన్నలను అవమానించొద్దు..!
Top 10 Actress: టాప్ 10 ఇండియన్ హీరోయిన్లలో దీపికా పదుకోన్ నంబర్ వన్... లిస్టులో రష్మిక ప్లేస్ ఎంతో తెలుసా?
టాప్ 10 ఇండియన్ హీరోయిన్లలో దీపికా పదుకోన్ నంబర్ వన్... లిస్టులో రష్మిక ప్లేస్ ఎంతో తెలుసా?
Mustafizur Rahman Joins PSL: ఐపీఎల్ నుండి తొలగింపు.. PSLలో ఆడాలని ముస్తాఫిజుర్ రెహ్మాన్ నిర్ణయం.. 3 రోజుల్లో మారిన సీన్
ఐపీఎల్ నుండి తొలగింపు.. PSLలో ఆడాలని ముస్తాఫిజుర్ రెహ్మాన్ నిర్ణయం.. 3 రోజుల్లో మారిన సీన్
Smartphones Expensive: భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు
Donald Trump: ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్
ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్
కుర్రకారుకి భారీ ఆఫర్‌: KTM 390 Adventure కొంటే ₹10,000 వరకు బెనిఫిట్స్‌ - లిమిటెడ్‌ టైమ్‌ డీల్‌
యూత్‌కి భలే ఛాన్స్‌: KTM 390 Adventure కొంటే యాక్సెసరీస్‌ పూర్తిగా 'ఉచితం', 10 ఏళ్ల ఎక్స్‌టెండెడ్‌ వారంటీ
Embed widget