అన్వేషించండి

Mahindra SUV: మహీంద్రా స్కార్పియో N ఆటోమేటిక్ వేరియంట్ రేటు తక్కువే! - బుకింగ్స్‌ స్టార్ట్‌ అయ్యాయి

Mahindra Scorpio N: మహీంద్రా ఇటీవలే స్కార్పియో-N సరీస్‌లో కొత్త Z4 ఆటోమేటిక్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది, పెట్రోల్ & డీజిల్ ఇంజిన్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది.

Mahindra Scorpio-N Price And Features In Telugu: మహీంద్రా & మహీంద్రా, ఇటీవలే, భారతదేశంలో తన పాపులర్‌ SUV స్కార్పియో-N సిరీస్‌లో Z4 ట్రిమ్ ఆటోమేటిక్ వేరియంట్‌ను లాంచ్‌ చేసింది. గతంలో, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్ Z6 & Z8 ట్రిమ్‌లకు మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు కస్టమర్లు Z4 ట్రిమ్‌లోనూ ఆటోమేటిక్‌ ఆప్షన్‌ ఎంచుకోవచ్చు.

Z4 పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్‌ ధర (Mahindra Scorpio-N ex-showroom price) దాదాపు రూ. 17 లక్షలు. డీజిల్ ఆటోమేటిక్ వెర్షన్ ధర దాదాపు రూ. 18 లక్షలు. ఈ ధర Z6 ట్రిమ్ కంటే దాదాపు 1 లక్ష రూపాయలు చవక. హుందాగా కనిపించే & అద్భుతమైన ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ SUVని బడ్జెట్‌ రేటులోనే కొనాలనుకునే కస్టమర్లకు ఈ వేరియంట్ ఒక మంచి అవకాశం లాంటిది.

ఇంజిన్ & పెర్ఫార్మెన్స్‌
రెండు ఇంజిన్ ఆప్షన్స్‌లో Z4 ఆటోమేటిక్‌ వేరియంట్‌ అందుబాటులో ఉంది. మొదటి ఆప్షన్‌ - 2.0 లీటర్ mStallion టర్బో పెట్రోల్ ఇంజిన్, ఇది 203 PS పవర్‌ను & 380 Nm టార్క్ (ఆటోమేటిక్ వెర్షన్‌లో) ఇస్తుంది, ఆక్సిలేటర్‌ తొక్కిపడితే తుపాకీ తూటాకు కూడా దొరకదు. ఈ ఇంజిన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పని చేస్తుంది. రెండో ఆప్షన్‌ - 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజన్, ఇది రియర్‌-వీల్‌ డ్రైవ్‌లో 132 PS పవర్‌ను & 300 Nm టార్క్‌ను ఇస్తుంది. అదే సమయంలో, దీని ఫోర్‌ వీల్‌ డ్రైవ్‌ (4WD) వెర్షన్ (Z4 E) 175 PS పవర్‌ను & 370 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. అయితే, ఇది ప్రస్తుతం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.      

కొత్త స్కార్పియో-N Z4 ట్రిమ్‌ ఫీచర్లు
Z4 వేరియంట్‌లో అడ్వాన్స్‌డ్‌ & రోజువారీ అవసరాలను తీర్చే చాలా ఫీచర్లు (Mahindra Scorpio-N Price Features) ఉన్నాయి. క్యాబిన్‌లో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇస్తుంది. ఇంకా... మల్టీఫంక్షన్ స్టీరింగ్ కంట్రోల్, రియర్ AC వెంట్స్, హాలోజన్ హెడ్‌లైట్లు, LED టర్న్ ఇండికేటర్లు, 17-అంగుళాల స్టీల్ వీల్‌, రియర్ స్పాయిలర్, పవర్ విండోస్ & ఫాబ్రిక్ సీట్‌ కవర్స్‌ ఏర్పాటు చేశారు.               

భద్రత
సేఫ్టీ పరంగానూ (Mahindra Scorpio-N Price Safety Features) Z4 ట్రిమ్‌పై శ్రద్ధ పెట్టారు. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ABS & EBD, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్‌ & త్రీ-పాయింట్ సీట్ బెల్ట్స్‌ వంటి సేఫ్టీ ఫీచర్లను ఈ SUVలో చూడవచ్చు.            

బుకింగ్స్‌ & డెలివెరీ
దేశవ్యాప్తంగా ఉన్న మహీంద్రా డీలర్‌షిప్స్‌ ఈ వేరియంట్ కోసం బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి & కంపెనీ త్వరలో డెలివరీలు ప్రారంభించవచ్చు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs nz 2nd odi highlights: రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Bullet Bike Prize in Cockfights: కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

AA 23 Announcement Video Decode | Allu Arjun తో ఏం ప్లాన్ చేశావయ్యా Lokesh Kanagaraj | ABP Desam
Mumbai Indians vs Gujarat Giants WPL 2026 | హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం!
Ind vs NZ Shreyas Iyer Records | రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
Jitesh Sharma Being Dropped from T20 World Cup | వరల్డ్ కప్ జితేష్ సంచలన వ్యాఖ్యలు!
India vs New Zealand 2nd ODI | టీమిండియాలో భారీ మార్పులు ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs nz 2nd odi highlights: రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Bullet Bike Prize in Cockfights: కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Nagoba Jatara 2026: నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
Hyderabad CP Sajjanar: మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారంపై చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
Harshit Rana: గంభీర్ దత్తపుత్రుడు అంటూ ట్రోలింగ్.. కట్ చేస్తే టీమిండియా సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా రికార్డ్
గంభీర్ దత్తపుత్రుడు అంటూ ట్రోలింగ్.. కట్ చేస్తే టీమిండియా సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా రికార్డ్
Telangana: జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
Embed widget