అన్వేషించండి

ABS Rule For Two Wheelers: ఇకపై అన్ని టూవీలర్లకు ABS ఫీచర్‌ - బండి రేటు రూ.5000 వరకు పెరిగే అవకాశం!

New Safety Rule For All Two Wheelers: భారత ప్రభుత్వం 2026 నుంచి అన్ని ద్విచక్ర వాహనాలలో ABS సేఫ్టీ ఫీచర్‌ను తప్పనిసరి చేయబోతోంది. కొత్త నియమం వల్ల ప్రయోజనాలు & ABS ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

New ABS Rule For All Bikes And Scooters: భారత ప్రభుత్వం ద్విచక్ర వాహన భద్రతకు సంబంధించి కీలక ప్రతిపాదన చేసింది. ఇప్పటివరకు, 125cc కంటే ఎక్కువ కెపాసిటీ బైక్‌లకు మాత్రమే తప్పనిసరిగా ఉన్న ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) రూల్‌ను ఇకపై అన్ని ఇంజిన్‌ సైజ్‌ల్లోని టూవీలర్లకు (బైక్‌లు, స్కూటర్లు) వర్తింపజేస్తోంది. అంటే హీరో స్ల్పెండర్‌, స్ప్లెండర్, బజాజ్ ప్లాటినా & TVS స్పోర్ట్ వంటి చిన్న ఇంజిన్ బైక్‌లలో కూడా ABS తప్పనిసరి అవుతుంది.

ABS లేదా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఒక ముఖ్యమైన భద్రత కవచం. ఆకస్మిక పరిస్థితుల్లో బైక్ బ్రేకులు& టైర్లు లాక్ అవ్వకుండా నిరోధిస్తుంది. ఈ వ్యవస్థ, బ్రేకింగ్ సమయంలో చక్రాల వేగాన్ని పర్యవేక్షిస్తుంది & అవసరమైనప్పుడు బ్రేక్ ఒత్తిడిని నియంత్రించి రైడర్‌ బ్యాలెన్స్‌ను కాపాడుతుంది. తద్వారా బైక్‌ జారిపోవడం, పల్టీలు కొట్టడం వంటి ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తుంది.

ABS రెండు రకాలు
నిజానికి, ABS రెండు రకాలు - మొదటిది సింగిల్ ఛానల్ ABS, ఇది ముందు టైర్‌ను మాత్రమే ప్రభావితం చేస్తుంది. రెండోది డ్యూయల్ ఛానల్ ABS - ఇది ముందు & వెనుక టైర్లలో పని చేస్తుంది. అందుకే దీనిని సురక్షితమైనదిగా భావిస్తారు.

ఇప్పటి వరకు ఉన్న రూల్‌ ఏంటి?
ప్రస్తుతం, దేశంలో 125cc కంటే తక్కువ ఇంజిన్లు కలిగిన బైక్‌లకు ABS తప్పనిసరి కాదు, దీని కారణంగా 45% పైగా ద్విచక్ర వాహనాలు ఈ సేఫ్టీ ఫీచర్‌ను కోల్పోతున్నాయి. భారతదేశంలో చిన్న ఇంజిన్ కలిగిన కమ్యూటర్ బైక్‌లు అత్యధికంగా అమ్ముడవుతున్నందున, కేంద్ర తీసుకురానున్న కొత్త నియమం కోట్లాది మంది రైడర్‌లకు భద్రత కల్పించగలదు.

ప్రస్తుతానికి ఇది ప్రతిపాదన రూపంలోనే ఉన్నప్పటికీ, త్వరలోనే, కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.

ధర పెరిగే అవకాశం
బైకులు, స్కూటర్లలో ABS ఏర్పాటు వల్ల టూవీలర్ల ధర రూ. 2,500 నుంచి రూ. 5,000 వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

హెల్మెట్ విషయంలోనూ పెద్ద నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం మరో కీలక రూల్‌ తీసుకురావడానికి కూడా సన్నాహాలు చేస్తోంది. త్వరలో, ప్రతి ద్విచక్ర వాహనంతో రెండు BIS-సర్టిఫైడ్ హెల్మెట్‌లను అందించడం తప్పనిసరి చేయనున్నారు. మన దేశంలో జరుగుతున్న మొత్తం రోడ్డు ప్రమాద మరణాల్లో ద్విచక్ర వాహన రైడర్లు 44% మంది ఉన్నారు & ఈ మరణాలలో ఎక్కువ భాగం తలకు తీవ్రమైన గాయాల కారణంగా సంభవిస్తున్నాయి. బైక్ కొనుగోలు చేసే సమయంలో హెల్మెట్‌లను అందిస్తే అవగాహన పెరుగుతుంది & ప్రాణాలను కాపాడవచ్చు. ఈ కొత్త మార్పులతో ప్రతి రైడర్‌ భద్రత ప్రయోజనాన్ని పొందుతాడు. బడ్జెట్ బైక్‌ను కొనుగోలు చేసినా, ప్రీమియం స్కూటర్‌ను కొనుగోలు చేసినా ABS & హెల్మెట్‌ను తప్పనిసరిగా ఉపయోగించడం వల్ల ప్రతి రైడర్‌కు మెరుగైన రక్షణ లభిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

కియా సిరోస్‌ EVకి అదిరిపోయే డిమాండ్‌.. 650కి పైగా బుకింగ్స్‌, ఒక్కరోజులోనే 150 డెలివరీలు
ఈ EV డిమాండ్‌ మామూలుగా లేదుగా! ఒక్కరోజులో 150.. ఇది నేషనల్‌ రికార్డ్‌
KTM 390 Duke వర్సెస్‌ RE Guerrilla 450 Apex.. ధర, పవర్‌, ఫీచర్లలో ఏది బెస్ట్‌?
KTM 390 Duke వర్సెస్‌ Guerrilla 450.. పెద్ద ఇంజిన్‌ ఉన్నా తక్కువ ధరలో RE బైక్‌!
2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌లో భలే అప్‌డేట్స్‌.. వెనుక సీట్‌లో కూర్చున్నవాళ్లకు మంచి మసాజ్‌!
2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌.. కొత్త ఫీచర్లతో అదరగొడుతున్న సెడాన్! బుకింగ్స్‌ ప్రారంభం
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Embed widget