అన్వేషించండి

Toyota Luxury SUV: లాంచ్‌కు ముందే కోట్లు పెట్టి కొంటున్నారు - ఈ ఆఫ్‌-రోడ్‌ బీస్ట్‌ డిజైన్‌, ఫీచర్లు వేరే లెవెల్‌

Toyota Land Cruiser Prado J250: మొదటిసారిగా, టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో డీజిల్ వెర్షన్‌ భారతదేశంలో అమ్మకానికి వస్తోంది. ఈ లగ్జరీ SUVని కేరళలోని ఎంపిక చేసిన కస్టమర్లకు అమ్ముతున్నారు.

Toyota Land Cruiser Prado J250 Price And Features: టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో J250 డీజిల్ వేరియంట్‌ను మొదటిసారిగా భారతదేశ మార్కెట్‌లో అమ్మకానికి తెచ్చింది ఆ కంపెనీ. కేరళ ఆటో మార్కెట్ సమాచారం ప్రకారం, ఆ రాష్ట్రంలో ఈ లగ్జరీ ఆఫ్-రోడ్ SUVని ఎంపిక చేసిన వినియోగదారులకు అందుబాటులో ఉంచారని తెలుస్తోంది. విశేషం ఏంటంటే, ఈ కారు అధికారికంగా మన దేశంలో ఇంకా లాంచ్‌ కాలేదు. అయినా కేరళ మార్కెట్‌లో ఎంపిక చేసిన వారికి ఇచ్చినట్టు సమాచారం.   

అయితే, ప్రాడో J250 మోడల్ కొన్ని ప్రపంచ మార్కెట్లలో 2023 ఆగస్టులోనే లాంచ్‌ అయింది. ఈ మోడల్‌ను నచ్చిన & మెచ్చిన కొందరు సంపన్నులు ఈ కార్లు ఇప్పటికే భారతదేశంలోకి దిగుమతి చేసుకుని రయ్‌ రయ్‌ మంటూ రోడ్లపై తిరుగుతున్నారు. 2025 ఫిబ్రవరిలో, పంజాబ్‌లో నాలుగు ప్రాడో SUVలు కనిపించాయి. ఈ మోడల్ ల్యాండ్ క్రూయిజర్ LC300 కంటే కొంచం రేంజ్‌ తక్కువ & CBU (కంప్లీట్ బిల్ట్ యూనిట్)గా భారతదేశానికి దిగుమతి అవుతోంది. ఇది ఒక హై-ఎండ్ ఆఫ్-రోడింగ్ SUV. అందుకే దీనిపై మోజును పెంచుకుంటున్నారు. 

ఫీచర్లు & ఇంజిన్ పవర్‌ ఎలా ఉంటుంది?
టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో J250 SUV డిజైన్ (Toyota Land Cruiser Prado J250 Design) బాక్సీగా, ఆఫ్-రోడ్ ఫోకస్డ్‌గా & ప్రాక్టికల్ గా ఉంటుంది. పాత J60 మోడల్ ప్రేరణతో J250 ని డిజైన్‌ చేశారు. ప్రాడో J250ని GA-F ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు, దీంతో ఫ్రేమ్ దృఢత్వం 50% మెరుగుపడింది. ఈ SUV 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో (1GD-FTV) పవర్‌ తీసుకుంటుంది. ఈ ఇంజిన్ దాదాపు 201 Bhp పవర్ & 500 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఇంకా.. 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ & 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎలాంటి రోడ్లపై అయినా ఈజీగా, బలంగా పరుగులు పెడుతుంది. ఈ SUV అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ హైబ్రిడ్ & మైల్డ్ హైబ్రిడ్ డీజిల్ ఆప్షన్లలోనూ అందుబాటులో ఉంది.       

భారతదేశంలో ఎప్పుడు లాంచ్‌ అవుతుంది?
కేరళలో ఈ SUV కనిపించిందంటే, కొన్ని ప్రాడో J250 యూనిట్లను ఇప్పటికే భారతదేశంలోకి దిగుమతి చేసుకున్నారని అర్ధం చేసుకోవాలి. ఈ మోడల్ 2025 చివరి నాటికి భారతదేశంలో అధికారికంగా లాంచ్‌ అవుతుంది. దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర (Toyota Land Cruiser Prado J250 ex-showroom price) రూ. 1.25 కోట్ల నుంచి రూ. 1.50 కోట్ల వరకు ఉంటుందని అంచనా.                   

భారతదేశంలో టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో J250 ప్రవేశం, ముఖ్యంగా కేరళలో దాని ప్రదర్శన, దేశంలో హై-ఎండ్ ఆఫ్-రోడింగ్ SUVల పట్ల క్రేజ్ మళ్లీ పెరుగుతోందని సూచిస్తుంది. ఈ SUV బోల్డ్‌ డిజైన్ & బలమైన నిర్మాణం విషయంలో మాత్రమే కాదు, కారులో ఇచ్చిన మైల్డ్‌ హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Embed widget